< యెషయా~ గ్రంథము 29 >
1 ౧ అరీయేలుకు బాధ! దావీదు విడిది చేసిన అరీయేలు పట్టణానికి బాధ! సంవత్సరం వెనుకే సంవత్సరం గడవనివ్వండి. పండగలు క్రమంగా జరగనివ్వండి.
Voi Arielia, Arielia, kaupunkia, jonne Daavid asetti leirinsä! Liittäkää vuosi vuoteen, kiertäkööt juhlat kiertonsa,
2 ౨ కానీ నేను అరీయేలును ముట్టడిస్తాను. అప్పుడు అది దుఃఖించి విలపిస్తుంది. అందుచేత అది నిజంగా నాకు నిప్పుల కుప్పలా ఉంటుంది.
niin minä ahdistan Arielia, ja se on oleva täynnä valitusta ja vaikerrusta, oleva minulle kuin Jumalan uhriliesi.
3 ౩ నేను నీకు విరోధంగా నీ చుట్టూ శిబిరం కడతాను. నీకు ఎదురుగా కోట కడతాను. ముట్టడి వేస్తాను. నీకు విరోధంగా ముట్టడి పనులను అధికం చేస్తాను.
Minä asetan leirini yltympäri sinua vastaan ja saarran sinut vartiostoilla ja luon vallit sinua vastaan.
4 ౪ అప్పుడు నువ్వు కిందకి దిగుతావు. నేలపై నుండి మాట్లాడటం ప్రారంభిస్తావు. నీ మాటలు నేలపై నున్న దుమ్ములోనుండి వినపడతాయి. నీ మాటలు చాలా బలహీనంగా ఉంటాయి.
Silloin sinä puhut maasta matalalta, sanasi tulevat vaimeina tomusta, sinä uikutat kuin vainajahenki maasta, puheesi tulee supisten tomusta.
5 ౫ నిన్ను ఆక్రమించుకోడానికి గుంపులుగా వచ్చే శత్రువులు ధూళిలా ఉంటారు. క్రూరులైన శత్రు సమూహం ఎగిరిపోయే పొట్టులాగా మాయమౌతారు. ఇదంతా అకస్మాత్తుగా ఒక్క క్షణంలో జరుగుతుంది.
Mutta sinun vainolaistesi lauma on oleva niinkuin hieno pöly, ja väkivaltaisten lauma niinkuin lentävät akanat, ja tämä tapahtuu äkkiä, silmänräpäyksessä:
6 ౬ నిన్ను సేనల ప్రభువైన యెహోవా శిక్షిస్తాడు. ఉరుములతో, భూకంపాలతో, భీకర శబ్దాలతో, సుడిగాలి తుఫానులతో, దహించే అగ్నిజ్వాలలతో ఆయన నిన్ను శిక్షిస్తాడు.
Herra Sebaot etsiskelee sinua ukkosenjylinässä ja maanjäristyksessä, kovassa pauhinassa, myrskyssä ja rajuilmassa, kuluttavan tulen liekissä.
7 ౭ ఇదంతా ఒక కలలా ఉంటుంది. రాత్రి వేళ వచ్చే స్వప్నంలా ఉంటుంది. జాతుల సమూహం అరీయేలు పైనా దాని బలమైన స్థావరం పైనా యుద్ధం చేస్తాయి. వాళ్ళు ఆమె పైనా, ఆమె రక్షణ స్థావరాల పైనా దాడి చేస్తారు.
Niinkuin yöllinen uninäky on oleva kansain lauma, joka sotii Arielia vastaan, kaikki, jotka sotivat sitä ja sen varustuksia vastaan ja sitä ahdistavat.
8 ౮ ఆకలితో ఉన్నవాడు కలలో భోజనం చేసి మేలుకున్న తర్వాత వాడు ఇంకా ఆకలితోనే ఉన్నట్టుగా, దాహంతో ఉన్నవాడు కలలో నీళ్ళు తాగి మేలుకున్న తర్వాత వాడు ఇంకా దాహంతోనే ఉన్నట్టుగా అవును, అలాగే సీయోను కొండపై జాతుల సమూహం చేసే యుద్ధం కూడా ఉంటుంది.
Niinkuin nälkäinen on unissaan syövinänsä, mutta herää hiuka sydämessä, ja niinkuin janoinen on unissaan juovinansa, mutta herää, ja katso, hän on nääntynyt ja himoitsee juoda, niin on oleva kaikki kansain lauma, joka sotii Siionin vuorta vastaan.
9 ౯ వేచి చూడండి! ఆశ్చర్యపొండి, నివ్వెరపొండి. మిమ్మల్ని మీరు గుడ్డివాళ్ళుగా చేసుకుని గుడ్డివాళ్ళు కండి. ద్రాక్షారసం తాగకుండానే మత్తెక్కిన వాళ్ళలా ఉండండి. మద్యం తీసుకోకుండానే తూలుతూ ఉండండి.
Hämmästykää ja ihmetelkää, tuijottakaa sokeiksi itsenne ja sokeiksi jääkää! He ovat juovuksissa, vaikkeivät viinistä, hoipertelevat, vaikkeivät väkijuomasta.
10 ౧౦ ఎందుకంటే యెహోవా మీ మీద గాఢమైన నిద్రాత్మను కుమ్మరించాడు. ఆయన మీ కళ్ళు మూసివేశాడు. అంటే మీకు ప్రవక్తలను లేకుండా చేశాడు. మీ తలలకు ముసుగు వేశాడు. మీకు నాయకులను లేకుండా చేశాడు.
Sillä Herra on vuodattanut teidän päällenne raskaan unen hengen ja sulkenut teidän silmänne-profeettanne, ja peittänyt teidän päänne-näkijänne.
11 ౧౧ మీకు ఈ దర్శనమంతా మూసి ఉన్న పుస్తకంలోని మాటల్లా ఉన్నాయి. దాన్ని మనుషులు చదవ గలిగిన వాడికిచ్చి “ఇది చదవండి” అన్నప్పుడు అతడు చూసి “నేను దీన్ని చదవలేను. ఎందుకంటే ఇది మూసి ఉంది” అంటాడు.
Niin on kaikki ilmoitus teille niinkuin lukitun kirjan sanat; jos se annetaan kirjantaitavalle ja sanotaan: "Lue tämä", niin hän vastaa: "Ei voi, sillä se on lukittu",
12 ౧౨ ఒకవేళ చదువు లేనివాడికి పుస్తకాన్ని ఇచ్చి “చదువు” అంటే అతడు “నేను చదవలేను” అంటాడు.
ja jos kirja annetaan kirjantaitamattomalle ja sanotaan: "Lue tämä", niin hän vastaa: "En osaa lukea".
13 ౧౩ ప్రభువు ఇలా అంటున్నాడు “ఈ ప్రజలు నోటిమాటతో నా దగ్గరకి వస్తున్నారు. వీళ్ళు పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలను నాకు దూరంగా ఉంచారు. మనుషులు ఏర్పరచిన ఆచారాలను నేర్చుకుని దాని ప్రకారం వాళ్ళు నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.
Ja Herra sanoi: Koska tämä kansa lähestyy minua suullaan ja kunnioittaa minua huulillaan, mutta pitää sydämensä minusta kaukana, ja koska heidän jumalanpelkonsa on vain opittuja ihmiskäskyjä,
14 ౧౪ కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను. అద్భుతం వెనుక అద్భుతాన్ని చేస్తాను. వారి జ్ఞానుల జ్ఞానం నశించిపోతుంది. వివేకుల వివేకం అదృశ్యమై పోతుంది.”
sentähden, katso, minä vielä teen tälle kansalle kummia tekoja-kummia ja ihmeitä, ja sen viisaitten viisaus häviää, ja sen ymmärtäväisten ymmärrys katoaa.
15 ౧౫ తమ ఆలోచనలు యెహోవాకి తెలియకుండా లోపలే దాచుకునే వాళ్లకీ, చీకట్లో తమ పనులు చేసే వాళ్ళకీ బాధ! “మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మేం చేసేది ఎవరికీ తెలుస్తుంది?” అని వాళ్ళు అనుకుంటారు.
Voi niitä, jotka syvälle kätkevät hankkeensa Herralta, joiden teot tapahtuvat pimeässä ja jotka sanovat: "Kuka meitä näkee, kuka meistä tietää?"
16 ౧౬ మీవెంత వంకర ఆలోచనలు! మట్టిని గూర్చి అలోచించినట్టే కుమ్మరి గురించి కూడా ఆలోచిస్తారా? ఒక వస్తువు తనను చేసిన వ్యక్తిని గూర్చి “అతడు నన్ను చేయలేదు” అనవచ్చా? ఒక రూపంలో ఉన్నది తన రూప కర్తని గూర్చి “అతడు అర్థం చేసుకోడు” అనవచ్చా?
Voi mielettömyyttänne! Onko savi savenvalajan veroinen? Ja sanooko työ tekijästään: "Ei hän ole minua tehnyt", tai sanooko kuva kuvaajastaan: "Ei hän mitään ymmärrä"?
17 ౧౭ ఇంకా కొద్ది కాలంలోనే లెబానోను సారవంతమైన పొలం అవుతుంది. ఆ పొలం అడవిలా మారుతుంది.
Vain lyhyt hetki enää, niin Libanon muuttuu puutarhaksi, ja puutarha on metsän veroinen.
18 ౧౮ ఆ రోజున చెవిటి వాళ్ళు గ్రంథంలోని వాక్యాలు వింటారు. గుడ్డి వారు చిమ్మచీకట్లో కూడా చూస్తారు.
Sinä päivänä kuurot kuulevat kirjan sanat, ja sokeiden silmät näkevät vapaina synkeästä pimeydestä.
19 ౧౯ అణచివేతకి గురైన వాళ్ళు యెహోవాలో ఆనందిస్తారు. మనుషుల్లో పేదలైన వాళ్ళు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు.
Nöyrät saavat yhä uutta iloa Herrassa, ja ihmisistä köyhimmätkin riemuitsevat Israelin Pyhästä.
20 ౨౦ నిర్దయులు లేకుండా పోతారు. పరిహాసం చేసేవాళ్ళు అంతరిస్తారు.
Sillä väkivaltaisista on tullut loppu, pilkkaajat ovat hävinneet, ja kaikki vääryyteen valppaat ovat tuhotut,
21 ౨౧ వీళ్ళు కేవలం ఒక్క మాట ద్వారా ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిర్ధారిస్తారు. న్యాయం కోసం వచ్చేవాడి కోసం వలలు వేస్తారు. వట్టి అబద్ధాలతో నీతిమంతుణ్ణి కూలగొడతారు.
ne, jotka sanallansa langettavat ihmisiä syyhyn ja virittävät pauloja sille, joka oikeutta puolustaa portissa, ja verukkeilla syyttömän asian vääräksi vääntävät.
22 ౨౨ అందుచేత అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు వంశం గూర్చి ఇలా చెప్తున్నాడు. “ఇకపై యాకోబు ప్రజలు సిగ్గుపడరు. అవమానంతో వాళ్ళ ముఖం పాలిపోవు.
Sentähden Herra, joka Aabrahamin vapahti, sanoo Jaakobin heimolle näin: Ei Jaakob enää joudu häpeään, eivätkä hänen kasvonsa enää kalpene.
23 ౨౩ అయితే వాళ్ళ సంతానాన్నీ, వాళ్ళ మధ్య నేను చేసే పనులనూ చూసినప్పుడు వాళ్ళు నా పేరును పవిత్ర పరుస్తారు. యాకోబు పరిశుద్ధ దేవుని పేరును పవిత్రపరుస్తారు. ఇశ్రాయేలు దేవునికి భయపడతారు.
Sillä kun hän näkee, kun hänen lapsensa näkevät keskellänsä minun kätteni työn, niin he pyhittävät minun nimeni, pitävät pyhänä Jaakobin Pyhän ja peljästyvät Israelin Jumalaa.
24 ౨౪ అప్పుడు ఆత్మలో పొరపాటు చేసేవారు కూడా వివేకం పొందుతారు. అదేపనిగా ఫిర్యాదులు చేసేవాళ్ళు జ్ఞానం సంపాదిస్తారు.”
Ja hengessään eksyväiset käsittävät ymmärryksen, ja napisevaiset ottavat oppia.