< యెషయా~ గ్రంథము 28 >

1 ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న పూలమాలకు బాధ. వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యానికి బాధ. అది ద్రాక్షారసం వశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నివసించే పచ్చని లోయ తలపై ఉన్న కిరీటం.
एफ्राइममधील मद्यप्यांनो तुमच्या गर्वाच्या मुकुटाला हायहाय! आणि धुंद झालेल्या सुपिक खोऱ्याच्या माथ्यावरील मोठी शोभा देणारे जे कोमेजणारे फुल त्यास हायहाय!
2 వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు. అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు.
पाहा! परमेश्वराकडे पराक्रमी आणि बलवान असा एक आहे. तो गारपिटीप्रमाणे आहे. नष्ट करणाऱ्या वादळाप्रमाणे, आणि प्रचंड ढगफूटी प्रमाणे, तो पृथ्वीला आपल्या हाताने ताडना करेल.
3 ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న కిరీటాన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కుతారు.
एफ्राइममधील मद्याप्यांचा अभिमानी मुकुट पायाखाली तुडवला जाईल.
4 పచ్చని లోయ తలపై ఉన్న వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యం కోతకాలం రాకముందే పండిపోయిన మొదటి అంజూరపు పండులా ఉంటుంది. మొదట దాన్ని చూసినవాడు దాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే నోట్లో వేసుకుని మింగివేస్తాడు.
त्याच्या वैभवशाली सौंदर्याचे कोमेजणारे फूल, जे खोऱ्याच्या माथ्यावर आहे, उन्हाळ्यात झाडावर प्रथम आलेल्या अंजिरांप्रमाणे त्याची स्थिती होईल, त्याकडे पाहणारा पाहतो तेव्हा तो त्याच्या हातांत असतानांच तो खाऊन टाकतो.
5 ఆ రోజున సేనల ప్రభువైన యెహోవా మిగిలి ఉన్న తన ప్రజలకు తానే అందమైన కిరీటంగానూ, అందమైన రాజ మకుటంగానూ ఉంటాడు.
त्या दिवशी सेनाधीश परमेश्वर आपल्या लोकांच्या उरलेल्यांना सुंदर मुकुट असा होईल.
6 ఆయన న్యాయం చెప్పడానికి న్యాయపీఠం పైన కూర్చున్న వాడికి న్యాయం నేర్పే ఆత్మగానూ, తమ ద్వారాల దగ్గర శత్రువులను తరిమి కొట్టే వాళ్లకి బలంగానూ ఉంటాడు.
आणि जो न्याय करत बसतो त्यास तो न्यायाचा आत्मा आणि जे वेशीजवळ लढाई मागे हटवतात त्यांना तो पराक्रम असा होईल.
7 అయితే వీళ్ళు కూడా ద్రాక్షారసం తాగి తూలుతారు. మద్యపానం చేసి తడబడతారు. యాజకుడైనా, ప్రవక్త అయినా మద్యం తాగి తూలుతారు. ద్రాక్షారసం వాళ్ళని వశం చేసుకుంటుంది. మద్యపానం చేసి తడబడుతూ ఉంటారు. దర్శనం కలిగినప్పుడు తూలుతూ ఉంటారు. తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు తడబడతారు.
पण हे सुद्धा द्राक्षरसाने हेलकावे खात आहेत, आणि मादक मद्यानी अडखळत आहेत. याजक व संदेष्टे सर्वच जण द्राक्षरस व मद्य पिऊन धुंद झाले आहेत आणि मद्याने त्यांना गिळून घेतले आहे. ते मद्याने अडखळून पडत आहेत आणि ते दृष्टांतात भ्रमतात, ते न्याय करण्यात अडखळतात.
8 వాళ్ళు భోజనం చేసే బల్లలు అన్నీ వాంతితో నిండి ఉన్నాయి. శుభ్రమైన స్థలం అక్కడ కనిపించదు.
खरोखर सर्व मेजे ओकारीने भरलेली आहेत, कोठेही स्वच्छ जागा राहिलेली नाही.
9 వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? పాలు విడిచిన వాళ్ళకా? లేక తల్లి రొమ్ము విడిచిన వాళ్ళకా?
तो कोणाला ज्ञान शिकवील? आणि तो कोणाला निरोप समजावेल? दुग्धापासून दूर केलेल्यांना किंवा स्तनपानापासून दूर केलेल्यांना काय?
10 ౧౦ ఎందుకంటే “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రంగా, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెంగా ఉంటుంది.” అని వాళ్ళు అనుకుంటారు.
१०कारण नियमा वर नियम, नियमावर नियम, ओळीवर ओळ, ओळीवर ओळ, इथे थोडे, तिथे थोडे, असे आहे.
11 ౧౧ అప్పుడు ఆయన నిజంగానే వాళ్ళతో వెక్కిరించే పెదాలతో, విదేశీ భాషలో మాట్లాడతాడు.
११खरच, तोतऱ्या ओठांनी आणि अन्य भाषेने तो या लोकांशी बोलेल.
12 ౧౨ గతంలో ఆయన వాళ్ళతో “ఇది విశ్రాంతి స్థలం. అలసి పోయిన వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి వాళ్ళు వెళ్ళి వెనక్కి పడి, కుంగిపోయి, వలలో చిక్కుకుని, బందీలు అయ్యేలా యెహోవా మాట వాళ్లకి ఇలా వస్తుంది.
१२पूर्वी तो त्यांना म्हणाला, “येथे विश्रांती आहे, थकलेल्यांना येथे येऊन विश्रांती घेऊ द्या, आणि हे उत्साहवर्धक आहे.” पण ते काही ऐकेनात.
13 ౧౩ “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం.”
१३लोकांस परमेश्वराचे बोलणे परक्या भाषेसारखे अनाकलनीय वाटले. हुकूमावर हुकूम, हुकूमावर हुकूम, नियमावर नियम, नियमावर नियम, थोडे इकडे, थोडे तिकडे, एक धडा तिकडे. लोकांनी स्वत: ला पाहिजे ते केले. म्हणून ते मागे पडून पराभूत झाले, ते सापळ्यात अडकले आणि पकडले गेले.
14 ౧౪ కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళూ, యెరూషలేములో ఈ ప్రజలను పాలించే వాళ్ళు, యెహోవా మాట వినండి.
१४याकरिता, जे तुम्ही थट्टा करता, आणि जे तुम्ही यरूशलेमेवर राज्य करता, ते तुम्ही परमेश्वराचे वचन काय म्हणते ते ऐका.
15 ౧౫ మీరు ఇలా అన్నారు “మేం చావుతో నిబంధన చేసుకున్నాం. పాతాళంతో ఒక ఒప్పందానికి వచ్చాం. కాబట్టి కీడు ప్రవాహంలా వచ్చినా అది మమ్మల్ని తాకదు. ఎందుకంటే మేం అబద్ధాన్ని ఆశ్రయించాం. మిథ్య వెనుక దాక్కున్నాం.” (Sheol h7585)
१५तुम्ही म्हटले, “आम्ही मृत्यूबरोबर करारनामा केला आहे. अधोलोकाशी आम्ही करार केला आहे म्हणून आम्हांला शिक्षा होणार नाही, जेव्हा बुडवणारी शिक्षा पार केली जाईल तेव्हा ती आमच्यापर्यंत येऊ शकणार नाही; कारण आम्ही कपटाच्या मागे लपलो आहोत व असत्याला आपले आश्रय केले आहे.” (Sheol h7585)
16 ౧౬ దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి. ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.
१६यासाठी परमेश्वर, माझा प्रभू म्हणतो, “पाहा, मी सियोनेत आधारशिला, पारखलेला धोंडा, कोपऱ्याचा मोलवान धोंडा, स्थीर पाया म्हणून घालतो. जो कोणी त्यावर विश्वास ठेवेल, तो लाजवला जाणार नाही.
17 ౧౭ నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి. మీరు దాగి ఉన్న చోటును వరద నీళ్ళు ముంచెత్తుతాయి.
१७मी न्याय मोजमापाची काठी, आणि नितीमत्ता हा ओळंबा असे करीन, तेव्हा गारपीट खोट्यांचे आश्रय झाडून टाकील, आणि पूराचे पाणी लपण्याच्या जागा झाकून टाकील.”
18 ౧౮ చావుతో మీరు చేసుకున్న నిబంధనను రద్దు చేస్తాను. పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం చెల్లదు. వరద ప్రవాహంలా విపత్తు మీకు పైగా దాటినప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. (Sheol h7585)
१८तुमचा मृत्यूशी असलेला करारनामा विरवला जाईल आणि अधोलोकाशी तुमचा झालेला करार रद्द केला जाईल. जेव्हा प्रकोपाचा पूर पार केला जाईल, त्या द्वारे तुम्ही झाकले जाल. (Sheol h7585)
19 ౧౯ అవి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ముంచెత్తి వేస్తాయి. ప్రతి ఉదయమూ, ప్రతి పగలూ, ప్రతి రాత్రీ అది వస్తుంది. ఈ వార్త అర్థం అయినప్పుడు అది మహాభయాన్ని కలిగిస్తుంది.
१९जेव्हा तो पार जाईल तेव्हा तो तुला झाकून टाकेल. आणि रोज रोज सकाळी, दिवसा आणि रात्री तो पार जाईल. आणि जेव्हा संदेश कळेल, तर ते भयच असे होईल.
20 ౨౦ పడుకుని కాళ్ళు చాపుకోడానికి మంచం పొడవు చాలదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.
२०कारण अंथरूण पाय पसरावयास खूप लहान आहे, आणि पांघरुण पांघरायला पुरत नाही एवढे ते अरुंद आहे.
21 ౨౧ యెహోవా తన పనిని జరిగించడానికి, ఆశ్చర్యకరమైన తన పనిని చేయడానికి, విచిత్రమైన తన పనిని జరిగించడానికి పెరాజీము పర్వతం పైన లేచినట్టుగా లేస్తాడు. గిబియోను లోయలో ఆయన తనను తాను రెచ్చగొట్టుకున్నట్టుగా లేస్తాడు.
२१जसा परासीम डोंगरामध्ये परमेश्वर उभा राहिला होता, जसा तो गिबोन दरीत रागावला होता त्याप्रमाणे तो रागावेल. अशासाठी की त्याने आपले कार्य, त्याचे अद्भूत कृत्य आणि त्याचे विस्मयकारी कृत्य करावे.
22 ౨౨ కాబట్టి పరిహాసం చేయకండి. లేకుంటే మీ సంకెళ్ళు మరింతగా బిగుసుకుంటాయి. సేనల ప్రభువైన యెహోవా నుండి భూమిపైన నాశనం జరుగుతుందనే సమాచారం నేను విన్నాను.
२२तर आता तुम्ही थट्टा करू नका, नाहीतर तुमची बंधणे घट्ट करण्यात येतील. कारण पृथ्वीवर नाश होण्याचा ठराव, मी सेनाधीश परमेश्वरापासून ऐकला आहे.
23 ౨౩ కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి.
२३मी सांगत असलेला संदेश लक्षपूर्वक ऐका, सावध असा, माझे शब्द ऐका.
24 ౨౪ రైతు విత్తడానికి ఎప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా? ఎప్పుడూ పొలంలో మట్టి పెళ్లలను పగలగొడుతూ ఉంటాడా?
२४पेरणी करण्यासाठी शेतकरी सतत शेत नांगरतो का? तो सतत मशागत करतो का?
25 ౨౫ అతడు నేలను చదును చేసిన తర్వాత సోపు గింజలు చల్లడా? జీలకర్ర చల్లడా? గోధుమలు వరుసల్లో, బార్లీ సరైన స్థలంలో వేసి చేను అంచుల్లో మిరప మొక్కలు నాటడా?
२५त्याने जमीन तयार केल्यावरच तो काळे जिरे टाकतो व जिरे विखरतो, तो गहू रांगेत आणि जव नेमलेल्या ठिकाणी आणि त्याच्या काठाला काठ्या गहू पेरीत नाही काय?
26 ౨౬ అతడి దేవుడే అతడికి ఆ క్రమాన్ని నేర్పించాడు. ఎలా చేయాలో జ్ఞానంతో అతనికి బోధించాడు.
२६कारण त्याचा देव त्यास सूचना देतो, तो त्यास सुज्ञपणे शिकवतो.
27 ౨౭ జీలకర్రను యంత్రంలో ఉంచి నూర్చారు. జీలకర్ర పై బండి చక్రాన్ని దొర్లించరు. కానీ సోపుని చువ్వతో, జీలకర్రను కర్రతో దుళ్ళకొడతారు.
२७शिवाय, काळे जिरे घणाने मळत नाही, किंवा तिच्यावर गाडीचे चाक फिरवले जात नाही, पण काळे जिरे काठीने आणि जिरे दंडाने झोडतात.
28 ౨౮ మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా! గోధుమలను దుళ్ళగొట్టడానికి గుర్రాలనూ బండి చక్రాలనూ నడిపిస్తారు గానీ దాన్ని పిండి చేయడానికి కాదు కదా!
२८भाकरीसाठी धान्य दळतात, पण ते नीट दळले जात नाही. आणि जरी त्याच्या गाडीचे चाक व त्याचे घोडे ते विखरतात तरी तो ते दळीत नाही.
29 ౨౯ దీన్ని కూడా మనుషులకు సేనల ప్రభువైన యెహోవా నేర్పిస్తున్నాడు. ఆయన బోధ అద్భుతంగానూ ఆయన ఆలోచన శ్రేష్టంగానూ ఉంటుంది.”
२९सेनाधीश परमेश्वर, जो संकल्पात सुंदर आहे आणि ज्ञानाने श्रेष्ठ आहे. त्याच्याकडून हे आहे.

< యెషయా~ గ్రంథము 28 >