< యెషయా~ గ్రంథము 27 >

1 ఆ రోజున యెహోవా చేతితో తన కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి గొప్పది, తీక్షణమైనది, గట్టిది. భీకరమైన సర్పాన్ని, మొసలి రూపాన్ని పోలిన “లేవియాతాన్” ను ఆయన శిక్షిస్తాడు. వంకరలు తిరుగుతూ, జారిపోతున్న సర్పాన్ని శిక్షిస్తాడు. ఆ సముద్ర జీవిని ఆయన సంహరిస్తాడు.
An jenem Tage wird der HERR mit seinem harten, großen und starken Schwerte heimsuchen den Leviatan, die flüchtige Schlange, und den Leviatan, die gewundene Schlange, und wird das Krokodil am Meere töten.
2 ఆ రోజున ఫలభరితమైన ద్రాక్ష తోటను గూర్చి పాడండి.
An jenem Tage singet vom edelsten Weinberg:
3 యెహోవా అనే నేనే దాన్ని సంరక్షిస్తున్నాను. ప్రతీ నిత్యం దానికి నీళ్ళు పోస్తున్నాను. దానికి ఎవడూ హాని తలపెట్టకుండా పగలూ రాత్రీ కాపలా కాస్తున్నాను.
Ich, der HERR, hüte ihn und bewässere ihn zu jeder Zeit; ich bewache ihn Tag und Nacht, daß sich niemand an ihm vergreife.
4 నాకిప్పుడు కోపం ఏమీ లేదు. ఒకవేళ గచ్చ పొదలూ ముళ్ళ చెట్లూ మొలిస్తే యుద్ధంలో చేసినట్టుగా వాటికి విరోధంగా ముందుకు సాగుతాను. వాటన్నిటినీ కలిపి తగలబెట్టేస్తాను.
Zorn habe ich keinen. Wenn ich aber Dorngestrüpp fände, so würde ich im Kampfe darauf losgehen und es allzumal verbrennen;
5 ఇలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు నా సంరక్షణలోకి రావాలి. నాతో సంధి చేసుకోవాలి. వాళ్ళు నాతో సంధి చేసుకోవాలి.
es sei denn, daß man bei mir Schutz suchte, daß man Frieden mit mir machte, ja, Frieden mit mir machte.
6 రాబోయే ఆ రోజున యాకోబు వేరు వ్యాపిస్తుంది. ఇశ్రాయేలు జాతి మొగ్గ వేసి పుష్పిస్తుంది. వాళ్ళు భూమినంతా ఫలభరితం చేస్తారు.
In zukünftigen Zeiten wird Jakob Wurzel schlagen, Israel wird blühen und grünen, und sie werden mit ihrer Frucht die ganze Erde erfüllen.
7 యాకోబు, ఇశ్రాయేలును వాళ్ళు కొట్టారు. వాళ్ళను యెహోవా కొట్టాడు. వాళ్ళను కొట్టినట్టు యెహోవా యాకోబు, ఇశ్రాయేలును కొట్టాడా? యాకోబు, ఇశ్రాయేలును చంపిన వాళ్ళని ఆయన చంపినట్టు ఆయన యాకోబు, ఇశ్రాయేలులను చంపాడా?
Hat Er es auch geschlagen, wie er die schlug, welche ihm Schläge versetzten? Oder wurde es hingemordet, wie seine Mörder ermordet worden sind?
8 నువ్వు అలా చేయలేదు. స్వల్పమైన శిక్షనే విధించావు. ఇతర దేశాల్లోకి ఇశ్రాయేలును బహిష్కరించావు. తూర్పు నుండి తీవ్రమైన గాలి రప్పించి వాళ్ళని తరిమావు.
Mit Maßen, durch Verbannung, straftest du es; er hat es durch seinen heftigen Sturm gerichtet, am Tage des Ostwinds.
9 యాకోబు చేసిన పాపానికి ఈ విధంగా పరిహారం జరుగుతుంది. అది అతడు చేసిన పాప పరిహారానికి కలిగే ఫలం. సున్నపురాతిని చూర్ణం చేసినట్టు అతడు బలిపీఠపు రాళ్ళను చిన్నాభిన్నం చేస్తాడు. అషేరా దేవతా స్తంభాలూ, ధూపం వేసే వేదికలూ ఇక నిలిచి ఉండవు.
Darum wird Jakobs Schuld dadurch gesühnt, und das wird die volle Frucht der Hinwegnahme seiner Sünde sein, daß er alle Altarsteine gleich zerschlagenen Kalksteinen macht und keine Ascheren und Sonnensäulen mehr aufrichtet.
10 ౧౦ అలాగే ప్రాకారాలున్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. నివాస స్థలాలు మనుషులు లేని అరణ్యాల్లా మారతాయి. అక్కడ దూడలు మేస్తాయి. అవి అక్కడే పడుకుని చెట్ల కొమ్మలను తింటాయి.
Denn die feste Stadt ist einsam geworden, eine verworfene und verlassene Wohnung, wie die Wüste. Kälber weiden und lagern sich daselbst und fressen ihre Büsche ab.
11 ౧౧ ఆ కొమ్మలు ఎండిపోయినప్పుడు విరిగిపడతాయి. స్త్రీలు వచ్చి వాటితో మంట పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ప్రజలు జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ సృష్టికర్త వాళ్ళపై కనికరపడడు. వాళ్ళని చేసిన వాడు వాళ్ళపై దయ చూపించడు.
Wenn deren Zweige verdorren, werden sie abgebrochen. Weiber kommen und zünden sie an. Denn es ist ein unverständiges Volk; darum erbarmt sich sein Schöpfer seiner nicht, und der es gebildet hat, wird es nicht begnadigen.
12 ౧౨ ఆ రోజున యెహోవా ప్రవహిస్తున్న యూఫ్రటీసు నది నుండి ఐగుప్తు వాగు వరకూ వాళ్ళను ధాన్యాన్ని నూర్చినట్టు నూరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలైన మిమ్మల్ని ఒక్కొక్కరిగా సమకూరుస్తాడు.
Und es wird geschehen an jenem Tage, daß der HERR ein Dreschen anstellen wird von den Fluten des [Euphrat] Flusses an bis zum Bache Ägyptens, und ihr sollt gesammelt werden, ihr Kinder Israel, eins ums andere.
13 ౧౩ ఆ రోజున పెద్ద బాకా ధ్వని వినిపిస్తుంది. అష్షూరు దేశంలో అంతరిస్తున్న వాళ్ళూ, ఐగుప్తులో బహిష్కరణకి గురైన వాళ్ళూ తిరిగి వస్తారు. యెరూషలేములో ఉన్న పవిత్ర పర్వతంపై ఉన్న యెహోవాను ఆరాధిస్తారు.
Und es wird an jenem Tage die große Posaune geblasen werden; da werden heimkommen die Verlorenen aus dem Lande Assur und die Verstoßenen aus dem Lande Ägypten; und sie werden den HERRN anbeten auf dem heiligen Berge zu Jerusalem!

< యెషయా~ గ్రంథము 27 >