< యెషయా~ గ్రంథము 26 >
1 ౧ ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు. “మనకి ఒక బలమైన పట్టణం ఉంది. దేవుడు రక్షణను దాని గోడలుగానూ ప్రాకారాలుగానూ చేశాడు.
På den tiden skall man sjunga, en sådana viso i Juda land: Vi hafve en fast stad, murar och värn äro helsa.
2 ౨ నీతిని పాటించే నమ్మకమైన జనం దానిలో ప్రవేశించేలా దాని తలుపులు తెరవండి.
Låter upp portarna, att det rättfärdiga folket, som tro bevarar, må gå härin.
3 ౩ తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.
Du håller allstädes frid vid magt, efter visst löfte; ty man förlåter sig uppå dig.
4 ౪ నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల!
Derföre förlåter eder uppå Herran evinnerliga; ty Herren Gud är en klippa evinnerliga.
5 ౫ అలాగే ఆయన ఉన్నత స్థల నివాసులను, గర్వించే వాళ్ళనూ కిందకు లాగి పడవేస్తాడు. ఎత్తయిన ప్రాకారాలు గల పట్టణాన్ని కూలదోస్తాడు. ఆయన దాన్ని నేలమట్టం చేస్తాడు. దుమ్ముతో ధూళితో కలిపివేస్తాడు.
Och han nederböjer dem som i höjdene bo; den höga staden förnedrar han; ja, han stöter honom neder till jordena, så att han ligger i stoftet;
6 ౬ పేదల, అవసరంలో ఉన్నవాళ్ళ కాళ్ళు దాన్ని తొక్కివేస్తాయి.
Att han med fötter trampad varder; ja, med de fattigas fötter; de arme skola trampa deruppå.
7 ౭ న్యాయవంతులు నడిచే దారి సమంగా ఉంటుంది. న్యాయ వంతుడా, నువ్వు న్యాయవంతులు దారిని తిన్నగా చేస్తావు.
Men de rättfärdigas väg är slät; de rättfärdigas stig gör du rättan.
8 ౮ న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము. నీ పేరు, నీ జ్ఞాపకాలే మా ప్రాణాలు కోరుకుంటున్నాయి.
Ty vi vänte efter dig, Herre, uti dins rätts väg; hjertans lust står till ditt Namn och ord.
9 ౯ రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది. నాలోని ఆత్మలో చిత్తశుద్ధితో నిన్ను వెతుకుతూ ఉన్నాను. నీ తీర్పులు భూమిపై తెలిసినప్పుడు ఈ లోక నివాసులు నీతిని అభ్యాసం చేస్తారు.
Af hjertat begärar jag dig om nattena; med minom anda i mig vakar jag bittida upp till dig; ty der din rätt är på jordene, der lära jorderikes inbyggare rättfärdighet.
10 ౧౦ దుర్మార్గుడికి నువ్వు దయ చూపినా వాడు మాత్రం నీ నీతిని నేర్చుకోడు. న్యాయబద్ధంగా జీవించే వారి మధ్యలో నివసించినా వాడు దుర్మార్గాన్నే అవలంబిస్తాడు. యెహోవా ఘనతా ప్రభావాలను వాడు పట్టించుకోడు.
Men om än dem ogudaktigom nåde tillbuden varder, så lära de dock icke rättfärdighet; utan på jordene, der rätt ske skulle, göra de det ondt är; ty de se intet Herrans härlighet.
11 ౧౧ యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు. కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది.
Herre, din hand är upphöjd, det se de intet; men när de få se det, så skola de på skam komma, uti nit öfver Hedningarna; dertill skall du förtära dem med eld, der du dina fiendar med förtärer.
12 ౧౨ యెహోవా, నువ్వు మాకు శాంతిని నెలకొల్పుతావు. నిజంగా మా కార్యాలన్నిటినీ నువ్వే మాకు సాధించిపెట్టావు.
Men oss, Herre, varder du frid skaffandes; ty allt det vi uträtte, det hafver du gifvit oss.
13 ౧౩ మా దేవుడివైన యెహోవా, నువ్వు కాకుండా ఇతర ప్రభువులు మాపై రాజ్యం చేశారు గానీ మేం నీ నామాన్ని మాత్రమే కీర్తిస్తాం.
Herre, vår Gud, det råda väl andre herrar öfver oss utan dig; men vi tänke dock allena uppå dig och ditt Namn.
14 ౧౪ వాళ్ళు చనిపోయారు. వాళ్ళిక మళ్ళీ బతకరు. వాళ్ళు మరణమయ్యారు. వాళ్ళిక తిరిగి లేవరు. నువ్వు తీర్పు తీర్చడానికి వచ్చి వాళ్ళని నిజంగా అంతం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలన్నిటినీ తుడిచి పెట్టేశావు.
De döde få icke lif, de afledne stå icke upp; ty du hafver sökt dem, och förgjort dem, och all deras åminnelse tillintetgjort.
15 ౧౫ యెహోవా, నువ్వు జనాన్ని వృద్ధి చేశావు. నువ్వే గౌరవం పొందావు. దేశం సరిహద్దులను విశాలపరచావు.
Men, Herre, du håller det fram ibland Hedningarna, du håller det alltså fram ibland Hedningarna; du beviser dina härlighet, och kommer långt bort, allt intill verldenes ända.
16 ౧౬ యెహోవా, కష్టాల్లో ఉన్నప్పుడు వారు నీ వైపు చూశారు. నువ్వు వాళ్లకి శిక్ష విధించినప్పుడు కీడుకువ్యతిరేకంగా నీకు ప్రార్థనలు వల్లించారు.
Herre, när bedröfvelse på färde är, så söker man dig; när du tuktar dem, så ropa de med ängslan.
17 ౧౭ బిడ్డని కనే సమయం దగ్గర పడినప్పుడు గర్భవతి వేదనతో కేకలు పెట్టినట్టుగానే ప్రభూ, మేం కూడా నీ సన్నిధిలో వేదన పడ్డాం.
Lika som en hafvandes qvinna, då det lider till födslostundena, så är henne ångest, ropar i sin värk; alltså går ock oss, Herre, för ditt ansigte.
18 ౧౮ మేం గర్భంతో ఉన్నాం. నొప్పులు కూడా అనుభవించాం. కానీ మా పరిస్టితి గాలికి జన్మనిచ్చినట్టు ఉంది. భూమికి రక్షణ తేలేక పోయాం. లోకంలో జనాలు పుట్టలేదు.
Vi äre också hafvande, och hafvom ångest, att vi som nogast kunne andas; dock kunne vi intet hjelpa jordene, och inbyggarena på jordenes krets vilja icke falla.
19 ౧౯ మరణమైన నీ వారు బతుకుతారు. మా వారి మృత దేహాలు తిరిగి సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారు మేల్కొని ఆనందంగా పాడండి! ఉదయంలో కురిసే మంచులా నీ కాంతి ప్రకాశమానమై కురిసినప్పుడు భూమి తాను ఎరగా పట్టుకున్న తనలోని విగత జీవులను సజీవంగా అప్పగిస్తుంది.
Men dine döde skola lefva, och med lekamenom uppstå igen. Vaker upp och berömmer eder, I som liggen under jordene; ty din dagg är en grön marks dagg, och jorden skall gifva ifrå sig de döda.
20 ౨౦ నా ప్రజలారా, వెళ్ళండి! మీ గదుల్లో ప్రవేశించండి. తలుపులు మూసుకోండి. మహా కోపం తగ్గే వరకూ దాగి ఉండండి. ఇదిగో వారి దోషాన్ని బట్టి భూనివాసులను శిక్షించడానికి యెహోవా తన నివాసంలోనుండి బయలు దేరుతున్నాడు. భూమి తన మీద హతులైన వారిని ఇకపై కప్పకుండా తాను తాగిన రక్తాన్ని బయట పెడుతుంది.
Gack bort, mitt folk, uti en kammar, och slut dörrena igen efter dig; fördölj dig ett litet ögnablick, så länge vreden går öfver.
21 ౨౧ ఎందుకంటే చూడండి! యెహోవా తన నివాసం నుండి రాబోతున్నాడు. భూమిపైన ప్రజలు చేసిన అపరాధాలకై వాళ్ళని శిక్షించడానికి వస్తున్నాడు. భూమి తనపై జరిగిన రక్తపాతాన్ని బహిర్గతం చేస్తుంది. వధకు గురైన వాళ్ళని ఇక దాచి పెట్టదు.”
Ty si, Herren varder utgångandes af sitt rum, till att besöka jordenes inbyggares ondsko öfver dem, så att jorden skall uppenbara deras blod, och icke mer öfverskyla dem som på henne slagne äro.