< యెషయా~ గ్రంథము 24 >
1 ౧ చూడండి! యెహోవా భూమిని ఖాళీ చేయబోతున్నాడు. దాన్ని నాశనం చేయబోతున్నాడు. దాని ఉపరితలాన్ని పాడు చేయబోతున్నాడు. దానిపై నివాసమున్న వారిని చెదరగొట్టబోతున్నాడు.
Hwɛ, Awurade rebɛma asase ada mpan na wasɛe no; ɔbɛsɛe asase ani na wabɔ sotefo ahwete,
2 ౨ ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగుతుంది. దాసులకు జరిగినట్టు యజమానులకు జరుగుతుంది. దాసీలకు జరిగినట్టు వారి యజమానురాళ్లకు జరుగుతుంది. కొనేవారికి జరిగినట్టు అమ్మేవారికి జరుగుతుంది. అప్పిచ్చే వారికి జరిగినట్టు అప్పు పుచ్చుకొనే వారికి జరుగుతుంది. వడ్డీకి ఇచ్చేవారికి జరిగినట్టు వడ్డీకి తీసుకునేవారికి జరుగుతుంది.
ɛbɛyɛ saa ara ama ɔsɔfo sɛnea ɛbɛyɛ ama nnipa, ama owura sɛnea ɛbɛyɛ ama asomfo, ama awuraa sɛnea ɛbɛyɛ ama afenaa, ama nea ɔtɔn sɛnea ɛbɛyɛ ama nea ɔtɔ, ama nea ogye bosea sɛnea ɛbɛyɛ ama nea ɔma bosea, ama ɔkafo sɛnea ɛbɛyɛ ama nea ɔde ma.
3 ౩ దేశం కేవలం వట్టిదిగా అయి పోతుంది. అది కేవలం కొల్లసొమ్ము అవుతుంది. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.
Asase bɛda mpan koraa, na wɔafom so nneɛma. Awurade, na waka saa asɛm yi.
4 ౪ దేశం వ్యాకులం చేత వాడిపోతున్నది. లోకంలోని గొప్పవారు క్షీణించి పోతున్నారు.
Asase so yɛ wosee, na ekisa wiase kɔ ahoyeraw mu, na ekisa, nea wɔama no so wɔ asase so ho yeraw no.
5 ౫ లోక నివాసులు ధర్మ శాసనాలు అతిక్రమించారు. నియమాన్ని మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది.
Asase so nnipa agu ne ho fi; wɔanni mmara no so, wɔabu ahyɛde no so na wɔasɛe apam a ɛwɔ hɔ daa no.
6 ౬ శాపం దేశాన్ని నాశనం చేస్తున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుషులు కొద్దిమందే ఉన్నారు.
Enti nnome amene asase no ɛsɛ sɛ so nnipa nya wɔn afɔdi so akatua ne saa nti wɔahyew asase no so nnipa, na kakraa bi pɛ na wɔaka.
7 ౭ కొత్త ద్రాక్షారసం అంగలారుస్తున్నది. ద్రాక్షావల్లి వాడి పోతున్నది. ఆనంద హృదయులంతా నిట్టూర్పు విడుస్తున్నారు. తంబురల సంతోషనాదం నిలిచిపోయింది.
Nsa foforo no ho yow na bobe no guan; wɔn a wogye wɔn ani no si apini.
8 ౮ కేరింతలు కొట్టే వారి ధ్వని మానిపోయింది. సితారాల ఇంపైన సంగీతం ఆగి పోయింది.
Akasaebɔ mu anigye no agyae, ahosɛpɛwfo no nteɛteɛmu no agyae. Sankuten so nnwom dɛdɛ no ayɛ dinn.
9 ౯ మనుషులు పాటలు పాడుతూ ద్రాక్షారసం తాగరు. పానం చేసేవారికి మద్యం చేదైపోయింది.
Wɔnnto dwom mfa nnom nsa bio; mmorɔsa ayɛ nwen ama anomfo.
10 ౧౦ అల్లకల్లోలమైన పట్టణం నిర్మూలమై పోయింది. ఎవరూ ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూతబడింది.
Kuropɔn a wɔasɛe no ada mpan; wɔatoto ofi biara apon mu.
11 ౧౧ ద్రాక్షారసం లేదని పొలాల్లో ప్రజలు కేకలు వేస్తున్నారు. సంతోషమంతా ఆవిరై పోయింది. దేశంలో ఆనందం లేదు.
Wɔpere nsa wɔ mmɔnten so; ahosɛpɛw nyinaa adan bosooyɛ, anigye nyinaa atu ayera wɔ asase no so.
12 ౧౨ పట్టణంలో శైథిల్యం మాత్రం మిగిలింది. గుమ్మాలు విరిగి పోయాయి.
Kuropɔn no asɛe, wɔabubu nʼapon mu nketenkete.
13 ౧౩ ఒలీవ చెట్టును దులిపేటప్పుడు, ద్రాక్షకోత అయిన తరువాత పరిగె పళ్ళు ఏరు కొనేటప్పుడు జరిగేలా లోక జాతులన్నిటిలో జరుగుతుంది.
Saa ara na ɛbɛyɛ wɔ asase no so ne amanaman no mu, sɛnea wɔboro ngodua a ɛyɛ no, anaa sɛnea wogyaw mpɛpɛ wɔ bobe twabere akyi no.
14 ౧౪ శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా మహాత్మ్యాన్ని బట్టి సముద్రతీరాన ఉన్న వారు కేకలు వేస్తారు.
Wɔma wɔn nne so, wɔde anigye teɛteɛ mu; efi atɔe fam, wɔkamfo Awurade kɛseyɛ.
15 ౧౫ దాన్ని బట్టి తూర్పు ప్రాంతీయులారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.
Enti apuei fam, monhyɛ Awurade anuonyam; momma Awurade din so, Israel Nyankopɔn no, wɔ supɔw a ɛwɔ po so no so.
16 ౧౬ నీతిమంతునికి స్తోత్రమని, భూదిగంతాల నుండి సంగీతాలు మనకు వినబడ్డాయి. అప్పుడు నేను “అయ్యో నాకు బాధ. నేను చెడిపోయాను, చెడిపోయాను. మోసం చేసే వారు మోసం చేస్తారు మోసం చేసే వారు ఎంతో మోసం చేస్తారు” అన్నాను.
Yɛte nnwonto fi asase ano yɛte se, “Anuonyam nka Ɔtreneeni no.” Nanso mekae se, “Matɔ beraw, mapa abaw! Minnue! Ɔfatwafo di huammɔ! Ɔnam nnaadaa so di huammɔ.”
17 ౧౭ భూనివాసులారా, మీ మీదికి భయం వచ్చింది. గుంట, ఉరి మీకు దాపురించాయి.
Ehu, amoa ne afiri retwɛn mo, nnipa a mote asase so.
18 ౧౮ తూములు ఉబికాయి. భూమి పునాదులు కంపిస్తున్నాయి.
Nea ehu nti oguan no bɛtɔ amoa mu; nea ɔforo fi amoa mu no afiri beyi no. Wɔabue nsu apon wɔ ɔsoro, na asase nnyinaso wosow.
19 ౧౯ భూమి బొత్తిగా బద్దలై పోతున్నది. భూమి కేవలం ముక్కలై పోతున్నది. భూమి బ్రహ్మాండంగా దద్దరిల్లుతున్నది.
Wɔadwiriw asase no na emu apaapae, na asase awosow ankasa.
20 ౨౦ భూమి మత్తెక్కిన వాడిలాగా అదే పనిగా తూలుతోంది. పాకలాగా ఇటు అటు ఊగుతోంది. దాని అపరాధం దాని మీద భారంగా ఉంది. అది పడి ఇక లేవదు. భయంకరమైన వార్త విని పారిపోయే వాడు గుంటలో పడిపోతాడు. గుంటను తప్పించుకునేవాడు ఉరిలో చిక్కుతాడు.
Asase tɔ ntintan te sɛ ɔsabowfo. Ehinhim biribiri te sɛ ntamadan wɔ mframa ano; nʼatuatew ho afɔdi ayɛ adesoa ama no na ɛhwe ase a ɛrensɔre bio.
21 ౨౧ ఆ దినాన యెహోవా ఉన్నత స్థలాల్లోని ఉన్నత స్థల సమూహాన్ని, భూమి మీద ఉన్న భూరాజులను దండిస్తాడు.
Saa da no, Awurade bɛtwe ɔsoro atumfo ne ahemfo a wɔwɔ asase so aso.
22 ౨౨ బందీలు గోతిలో పోగు పడినట్టు చెరసాల్లో పడతారు. చాలా రోజులైన తరువాత వారికి తీర్పు జరుగుతుంది.
Wɔbɛka wɔn nyinaa abɔ mu sɛ nneduafo ahyɛ afiase amoa mu; wɔbɛto wɔn mu wɔ afiase na nna bebree akyi no wɔatwe wɔn aso.
23 ౨౩ చంద్రుడు వెలవెలబోతాడు. సూర్య బింబం మారిపోతుంది. సేనల ప్రభువైన యెహోవా సీయోను కొండ మీదా యెరూషలేములో రాజవుతాడు. పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడుతుంది.
Ɔsram anim begu ase na owia ani awu; na Asafo Awurade bedi hene wɔ Sion bepɔw so ne Yerusalem, ne wɔn mpanyimfo anim, wɔ anuonyam mu.