< యెషయా~ గ్రంథము 23 >
1 ౧ ఇది తూరును గూర్చిన దైవ ప్రకటన. తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. ఎందుకంటే ఓడరేవు గానీ ఆశ్రయం గానీ లేవు. కిత్తీము దేశం నుండి వాళ్లకి ఈ విషయం వెల్లడి అయింది.
Utsagn om Tyrus. Jamre eder, I Tarsis-skib! For det er ødelagt, så der ikke mere er hus, og I ikke mere kan komme hjem; fra Kittims land blir det kunngjort for dem.
2 ౨ సముద్ర తీరవాసులారా! సీదోను పట్టణంలోని వర్తకులారా! విభ్రాంతి చెందండి. సముద్రంపై వస్తూ పోతూ ఉండేవాళ్ళు తమ సరుకులు మీకు సరఫరా చేశారు.
Bli stille, I som bor på kysten som Sidons sjøfarende kjøbmenn opfylte!
3 ౩ మహా సముద్రంపై ప్రయాణించి షీహోరు ప్రాంతం ధాన్యం, నైలు నదికి చెందిన పంట తూరుకు వస్తూ ఉండేవి. తూరు దేశాలన్నిటికీ వర్తక కేంద్రంగా ఉండేది.
Av Sikors sæd, av Nilens høst, som blev ført frem over det store hav, gjorde det sig vinning, og det var et marked for folkene.
4 ౪ సీదోనూ, సిగ్గుపడు, ఎందుకంటే సముద్రం మాట్లాడుతుంది. సముద్ర బలిష్టుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు. “నేను పురిటినొప్పులు పడలేదు. పిల్లలకు జన్మనివ్వలేదు. నేను పిల్లలను పోషించలేదు, కన్యకలను పెంచలేదు.”
Skam dig, Sidon! - For havet, havets festning sier: Jeg har ikke hatt fødselsveer, heller ikke født, heller ikke opfødd unge menn eller fostret jomfruer.
5 ౫ ఆ సమాచారం విని ఐగుప్తు ప్రజలు తూరును గురించి వేదన చెందుతారు.
Når de får høre om dette i Egypten, skal de skjelve ved ryktet om Tyrus.
6 ౬ సముద్ర తీరవాసులారా! రోదించండి. తర్షీషుకి తరలి వెళ్ళండి.
Far over til Tarsis, jamre eder, I som bor på kysten!
7 ౭ ఎప్పుడూ ఆనందిస్తూ ఉండే పట్టణం, పురాతన కాలంలో మూలాలున్న పట్టణం, పాశ్చాత్య దేశాల్లో నివాసం ఉండటానికి సుదూర ప్రయాణాలు చేసే పట్టణం, నీకే ఇలా జరిగిందా?
Er dette eders jublende by, som blev til i fordums dager, hvis føtter bærer den bort til å bo som fremmed i det fjerne?
8 ౮ తూరు వర్తకులు రాజకుమారుల్లాంటి వాళ్ళు. అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు భూమిపై గౌరవం పొందిన వాళ్ళు. తూరు కిరీటాలు పంచే పట్టణం. దానికి వ్యతిరేకంగా పథకం వేసిందెవరు?
Hvem har besluttet dette mot Tyrus, mot henne som delte ut kroner, hun hvis kjøbmenn var fyrster, hvis kremmere var stormenn på jorden?
9 ౯ ఆమె గర్వాన్నీ, ఘనతా ప్రాభవాలనూ అగౌరవ పరచడానికీ, భూమి మీద ఘనత పొందిన ఆమె పౌరులను అవమాన పరచడానికీ సేనల ప్రభువైన యెహోవా సంకల్పించాడు.
Herren, hærskarenes Gud, har besluttet det for å vanhellige all stolt prakt, for å vanære alle jordens store.
10 ౧౦ తర్షీషు కుమారీ, నీ భూమిని దున్నడం మొదలు పెట్టు. నైలు నదిలా నీ భూమిని విస్తరింపజెయ్యి. తూరులో వ్యాపార కేంద్రం ఇక లేదు.
Bred dig ut over ditt land som strømmen, du Tarsis' datter! Det er intet bånd mere.
11 ౧౧ యెహోవా తన చేతిని సముద్రంపై చాపాడు. ఆయన రాజ్యాలను కంపింపజేశాడు. కనానులో కోటలను నాశనం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు.
Han har rakt ut sin hånd over havet, han har fått kongeriker til å skjelve; Herren har befalt å ødelegge Kana'ans faste borger.
12 ౧౨ ఆయన ఇలా అన్నాడు “పీడన కింద ఉన్న సీదోను కన్యా, నీకిక సంతోషం ఉండదు. నువ్వు కిత్తీముకి తరలి వెళ్ళు. కానీ అక్కడ కూడా నీకు విశ్రాంతి కలగదు.”
Han sa: Du skal ikke mere bli ved å juble, du voldtatte jomfru, Sidons datter! Bryt op, dra over til Kittim! Heller ikke der skal du finne ro.
13 ౧౩ కల్దీయుల దేశాన్ని చూడండి. వాళ్ళిప్పుడు ఒక జనంగా లేరు. అష్షూరు వాళ్ళు దాన్ని క్రూర మృగాలు నివసించే అడవిగా చేశారు. దాని ముట్టడికై వాళ్ళు గోపురాలు కట్టారు. దాని భవనాలను ధ్వంసం చేశారు. దేశాన్ని శిథిలంగా చేశారు.
Se, kaldeernes land, dette folk som fordum ikke var til, de hvis land Assur har gjort til bolig for ørkenens dyr, de reiser sine beleiringstårn, omstyrter dets palasser og gjør det til en grushaug.
14 ౧౪ తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. మీ ఆశ్రయ దుర్గం నాశనమైంది.
Jamre eder, I Tarsis-skib! For ødelagt er eders faste borg.
15 ౧౫ ఒక రాజు జీవిత కాలంలా డెబ్భై సంవత్సరాలు తూరును మర్చిపోవడం జరుగుతుంది. డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత తూరులో ఒక వేశ్యా గీతంలో ఉన్నట్టు జరుగుతుంది.
På den tid skal Tyrus bli glemt i sytti år, så lenge som en konges dager; når sytti år er til ende, skal det gå Tyrus som det heter i visen om skjøgen:
16 ౧౬ అంతా మర్చిపోయిన వేశ్యా! తంతి వాద్యం తీసుకుని పట్టణంలో తిరుగులాడు. అందరూ నిన్ను జ్ఞాపకం చేసుకునేలా దాన్ని చక్కగా వాయించు. ఎక్కువ పాటలు పాడు.
Ta din citar, gå omkring i byen, du glemte skjøge! Spill det beste du kan, syng vise på vise, så folk kan komme dig i hu!
17 ౧౭ డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత యెహోవా తూరుకు సహాయం చేస్తాడు. అది తిరిగి తన జీతం సంపాదించుకోడానికి భూమి పైన ఉన్న అన్ని రాజ్యాలతో వేశ్యలాగా వ్యవహరిస్తుంది.
Når de sytti år er til ende, da skal Herren ta sig av Tyrus, og det skal atter få ta imot horelønn, og det skal drive utukt med alle verdens riker over den vide jord.
18 ౧౮ ఆమె పొందిన లాభం, సంపాదన యెహోవాకు చెందుతుంది. దాన్ని సేకరించడం, జమ చేయడం జరగదు. యెహోవా సన్నిధిలో నివసించే వారి భోజనానికీ, మంచి బట్టలకీ ఆమె వర్తక లాభం వినియోగిస్తారు.
Men dets vinning og dets horelønn skal være helliget til Herren, den skal ikke legges op og ikke gjemmes; for de som bor for Herrens åsyn, skal få dets vinning og bruke den til å ete sig mette og klæ sig i prektige klær for.