< యెషయా~ గ్రంథము 22 >

1 “దర్శనం లోయ” ను గూర్చిన దైవ ప్రకటన. “మీరంతా ఇళ్ళ పైకప్పుల పైకి ఎక్కి ఉండటానికి కారణమేంటి?
Наложеното за долината на видението пророчество: Що ти е сега Ти си се качил цял на къщните покриви,
2 సందడితో నిండి పోయి కేకలు వేస్తున్న పట్టణమా! వేడుకల్లో మునిగిపోయిన నగరమా! నీలో చనిపోయిన వాళ్ళు కత్తి వల్ల హతం కాలేదు. వాళ్ళు యుద్ధంలో చనిపోలేదు.
О ти, пълен с викове, Шумни граде, велели граде? Убитите ти не се убиха с нож, Нито умряха в бой.
3 నీ అధిపతులంతా కలసి పారిపోయారు. కానీ విలుకాళ్ళు బాణాలు వేసి కొట్టకుండానే వాళ్ళు దొరికి పోయారు. దూరంగా పారిపోయినా శత్రువు వాళ్ళందర్నీ కలిపి పట్టుకున్నాడు.
Всичките ти първенци побягнаха заедно, Вързани бидоха от стрелците; Всички твои, които се намериха, Надалеч побягнали, бидоха вързани заедно
4 కాబట్టి నేను చెప్పేదేమిటంటే ‘నా వంక చూడకండి. నేను తీవ్రమైన విషాదంతో ఏడుస్తాను. నా జనానికి సంభవించిన వినాశనం గూర్చి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి.’
Затова рекох: Отвърнете се от мене; ще плача горчиво; Не се трудете да ме утешавате За опустошението на дъщерята на людете ми.
5 దర్శనం లోయలో అల్లరి, తొక్కిసలాటతో నిండిన ఒక రోజు రాబోతుంది. దాన్ని సేనల ప్రభువు అయిన యెహోవా రప్పించబోతున్నాడు. ఆ రోజు ఓటమీ, కలవరమూ కలుగుతాయి. గోడలు కూలిపోతాయి. ప్రజలంతా సహాయం కోసం పర్వతాల వైపు చూస్తారు.
Защото в долината на видението Е ден на поражение и тъпчене И недоумение от Господа Бога на Силите, - Ден на събаряне стените, и на викане към планините.
6 ఏలాము రథాలతో ఉన్న యోధులతో, రౌతులతో తన అంబుల పొదిని ధరించింది. కీరు తన డాలును బయటకు తీసింది.
И Елам взе тула, С полкове войници и конници, И Кир откри щита.
7 నీకు ఇష్టమైన లోయలన్నీ రథాలతో నిండిపోతాయి. తమ గుర్రాలపై కూర్చున్న రౌతులు పట్టణ ద్వారం దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు.
И когато отбраните ти долини се напълниха с колесници, И конниците се опълчиха при портата,
8 అప్పుడు ఆయన యూదా భద్రత కవచాన్ని తీసివేశాడు. ఆ రోజు నువ్వు ‘అడవి రాజ భవనం’ లో ఉన్న ఆయుధాల కోసం చూశావు.
И той дигна покривалото на Юда, То в оня ден ти обърна погледа си към оръжията на къщата лес.
9 దావీదు పట్టణానికి అనేక చోట్ల బీటలు పడటం నువ్వు చూశావు. అది తెలుసుకుని నువ్వు దిగువన ఉన్న కోనేరు నుండి నీళ్ళ తెచ్చుకున్నావు.
И като видяхте, че проломите на Давидовия град са много, Събрахте водите на долния водоем,
10 ౧౦ మీరు యెరూషలేములోని ఇళ్ళను లెక్కపెట్టారు. ప్రాకారాన్ని బలపరచడానికై మీరు ఇళ్ళు పడగొట్టారు.
Та, като изброихте къщите на Ерусалим И развалихте къщите, за да укрепите стената,
11 ౧౧ పాత కోనేటి నీళ్ళ కోసం రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని నిర్మించారు. కానీ పట్టణాన్ని నిర్మించిన వాణ్ణి మీరు పట్టించుకోలేదు. ఏనాడో దాని కోసం ఆలోచించిన వాణ్ణి మీరు లక్ష్యం చేయలేదు.
Направихте и между двете стени нов водоем За водата на стария водоем; Но не погледнахте към Онзи, Който стори това, Нито дадохте внимание на Този Който го бе приготвил отдавна.
12 ౧౨ ఆ రోజున ఏడవడానికీ, అంగలార్చడానికీ, తలలు బోడి చేసుకోడానికీ, గోనె పట్ట కట్టుకోడానికీ సేనల ప్రభువైన యెహోవా పిలుపునిచ్చాడు.
В оня ден Господ Иеова на Силите Ви призовава на плач и на жалеене, На обръсване главата и на опасване с вретище;
13 ౧౩ కానీ చూడండి! దానికి బదులుగా, పశువులను చంపుదాం, గొర్రెలను వధించుదాం. వాటి మాంసం తిని ద్రాక్షారసం తాగుదాం. సంతోషంతో పండగ చేసుకుందాం. ఎందుకంటే రేపు చనిపోతాం కదా” అనుకున్నారు.
Но, ето радост и веселие, Колене говеда и колене овце, Ядене месо и пиене вино! И казват: Да ядем и да пием, Защото утре ще умрем.
14 ౧౪ ఈ సంగతి సేనల ప్రభువైన యెహోవా నా చెవుల్లో తెలియజేశాడు. “మీరు చేసిన ఈ దోషానికి క్షమాపణ లేదు. మీరు చనిపోయేటప్పుడైనా సరే” ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.
Тогава от Господа на Силите откри се в ушите му туй: Наистина това беззаконие няма да се очисти от вас докле умрете, Казва Господ Иеова на Силите.
15 ౧౫ సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా చెప్పాడు. భవనంలో నిర్వహణా పనులు చూసే షెబ్నా దగ్గరకి వెళ్ళు. అతనికి ఇలా చెప్పు.
Така казва Господ Иеова на Силите: Иди, влез при тоя настойник, При домоуправителя Шевна и речи:
16 ౧౬ “ఇక్కడ నీకేం పని? ఇక్కడ సమాధి తొలిపించుకోడానికి అసలు నువ్వెవరు? ఎత్తయిన స్థలంలో సమాధిని తొలిపించుకుంటున్నావు. రాతిలో నీ కోసం నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు!
Що правиш тук? и кого имаш тук свой? Та изсичаш тук гроб за себе си, - Правиш си гроб на високо, Изсичаш си в камъка обиталище!
17 ౧౭ చూడు, బలవంతుడివైన నిన్ను యెహోవా విసిరి వేయబోతున్నాడు. ఆయన నిన్ను నేలకు విసిరి కొట్టబోతున్నాడు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడు.
Ето, Господ като силен мъж ще те захвърли, Да, като те улови здраво,
18 ౧౮ ఆయన నిన్ను కచ్చితంగా చుట్ట చుట్టివేస్తాడు. ఒక బంతిలా నిన్ను విశాలమైన దేశంలోకి విసిరివేస్తాడు. నువ్వు అక్కడే చనిపొతావు. నీ గొప్ప రథాలు కూడా అక్కడే పడి ఉంటాయి. నీ యజమాని ఇంటికి నువ్వు ఒక అవమానంగా ఉంటావు.
Ще те навие и ще те метне като топка В Широка земя; Там ще умреш, и там наместо славните ти колесници, Ще има срама на дома на господаря ти.
19 ౧౯ నీ ఉద్యోగం నుండి నిన్ను తొలగిస్తాను. నీ హోదాను తీసి వేస్తాను. నిన్ను కిందకు లాగేస్తాను.
Ще те оттласна от чина ти, И от положението ти ще те свалят.
20 ౨౦ ఆ రోజున నేను నా సేవకుడూ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్యాకీముని పిలుస్తాను.
В оня ден ще извикаш слугата си Елиакима Хелкиевия син,
21 ౨౧ నీ చొక్కా అతనికి తొడిగిస్తాను. నీ నడికట్టును అతనికి కడతాను. నీ అధికారాన్ని అతనికి బదలాయిస్తాను. అతడు యెరూషలేములో నివాసం ఉన్న వాళ్ళకీ, యూదా జాతి వాళ్ళకీ ఒక తండ్రిగా ఉంటాడు.
И като го облека с твоето облекло И го стегна с твоя пояс Ще предам властта ти в неговата ръка, И той ще бъде един баща на ерусалимските жители И на Юдовия дом.
22 ౨౨ నేను దావీదు ఇంటి తాళపు చెవిని, అధికారాన్ని అతని భుజంపై ఉంచుతాను. అతడు తెరచినప్పుడు ఎవ్వరూ మూయలేరు. అతడు మూసినప్పుడు ఎవ్వరూ తెరవలేరు.
И ще положа на рамото му ключа на Давидовия дом; Той ще отваря, и никой няма да затваря, И ще затваря и никой няма да отваря;
23 ౨౩ బలమైన చోట ఒక మేకును దిగగొట్టినట్టు నేను అతణ్ణి స్థిరపరుస్తాను. అతడు తన తండ్రి కుటుంబానికి ఘనమైన సింహాసనంగా ఉంటాడు.
И ще го закрепя като гвоздей на твърдо място; И той ще бъде славен престол на бащиния си дом;
24 ౨౪ చిన్న గిన్నెలనూ, పాత్రలనూ మేకుకి వేలాడదీసినట్టుగా అతని పితరుల ఇంటి గౌరవమూ, సంతానం, వారసుల గౌరవమూ అతనిపై వేలాడదీస్తారు.”
И на него ще окачат всичката слава на бащиния му дом, - Чадата и внуците, Всичките малки съдове, От съдове като чаши До всичките съдове като мехове.
25 ౨౫ ఇది సేనల ప్రభువైన యెహోవా మాట. “ఆ రోజున బలమైన చోట కొట్టిన మేకు సడలి ఊడిపోతుంది. కింద పడిపోతుంది. దానిపై ఆధారపడిన బరువంతా తెగి కింద పడుతుంది.” ఇది యెహోవా మాట.
В оня ден, казва Господ на Силите, Закрепеният на твърдо място гвоздей ще ослабва, И ще се счупи, и ще падне, И товарът, който висеше на него, ще се срине; Защото Господ е изговорил това.

< యెషయా~ గ్రంథము 22 >