< యెషయా~ గ్రంథము 15 >
1 ౧ మోయాబు గురించి ప్రకటన. ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
모압에 관한 경고라 하루 밤에 모압 알이 망하여 황폐할 것이며 하루 밤에 모압 길이 망하여 황폐할 것이라
2 ౨ ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.
그들은 바잇과 디본 산당에 올라가서 울며 모압은 느보와 메드바를 위하여 통곡하도다 그들이 각각 머리털을 없이 하였고 수염을 깎았으며
3 ౩ తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు.
거리에서는 굵은 베로 몸을 동였으며 지붕과 넓은 곳에서는 각기 애통하여 심히 울며
4 ౪ హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి. యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి.
헤스본과 엘르알레는 부르짖으며 그 소리는 야하스까지 들리니 그러므로 모압의 전사가 크게 부르짖으며 그 혼이 속에서 떨도다
5 ౫ మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు.
내 마음이 모압을 위하여 부르짖는도다 그 귀인들은 소알과 에글랏 슬리시야로 도망하여 울며 루힛 비탈길로 올라가며 호로나임 길에서 패망을 부르짖으니
6 ౬ ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.
니므림 물이 마르고 풀이 시들었으며 연한 풀이 말라 청청한 것이 없음이로다
7 ౭ వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.
그러므로 그들이 얻은 재물과 쌓았던 것을 가지고 버드나무 시내를 건너리니
8 ౮ రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది. అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది.
이는 곡성이 모압 사방에 둘렸고 슬피 부르짖음이 에글라임에 이르며 부르짖음이 브엘엘림에 미치며
9 ౯ ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను. మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది.
디몬 물에는 피가 가득함이로다 그럴지라도 내가 디몬에 재앙을 더 내리되 모압에 도피한 자와 그 땅의 남은 자에게 사자를 보내리라