< యెషయా~ గ్రంథము 15 >

1 మోయాబు గురించి ప్రకటన. ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
Jövendölés Moáb ellen. Igen, a pusztulás éjjelén megsemmisült Ar-Moáb; igen, a pusztulás éjjelén megsemmisült Kir-Moáb!
2 ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.
Felmennek a templomba, és Dibon a magaslatokra megy sírni, Nebón és Médebán jajgat Moáb, minden fejen kopaszság, minden szakál lenyírva!
3 తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు.
Utczáin gyászruhába öltöznek, házfedelein és piaczain jajgat minden, és könyekben olvad el!
4 హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి. యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి.
És kiált Hesbon és Eleálé, szavok Jáháczig hallatik; ezért ordítanak Moáb vitézei, és lelke reszket.
5 మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు.
Szívem kiált Moábért, a melynek végvárai Zoárig, a három éves üszőig nyúltanak; mert Luhith hágóján sírással mennek fel, és mert Horonaim útján romlásuknak kiáltását hallatják.
6 ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.
Mert Nimrim vizei pusztasággá lesznek, mert elszáradt a pázsit, elfogyott a fű, és semmi zöld nem lészen.
7 వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.
Ezért a mit megmenthettek és jószágukat a fűzfáknak patakja mellé hordják.
8 రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది. అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది.
Mert kiáltás zengé körül Moáb határát, jajgatása Eglaimig, és Beér-Élimig hallatik jajgatása!
9 ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను. మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది.
Mert Dimon vizei megteltek vérrel, mert új romlást hozok Dimonra: Moáb menekültjeire oroszlánt, és a földnek maradékira.

< యెషయా~ గ్రంథము 15 >