< యెషయా~ గ్రంథము 12 >

1 ఆ రోజున మీరు ఇలా అంటారు, “యెహోవా, నువ్వు నా మీద కోపపడ్డావు, నీ కోపం చల్లారింది, నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు నన్ను ఆదరించావు.
וְאָֽמַרְתָּ בַּיּוֹם הַהוּא אוֹדְךָ יְהוָה כִּי אָנַפְתָּ בִּי יָשֹׁב אַפְּךָ וּֽתְנַחֲמֵֽנִי׃
2 చూడు, దేవుడే నా రక్షణ. భయం లేకుండా నేను ఆయన్ని నమ్ముతాను. యెహోవా, అవును, యెహోవాయే నాకు బలం. ఆయనే నా కీర్తన. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.”
הִנֵּה אֵל יְשׁוּעָתִי אֶבְטַח וְלֹא אֶפְחָד כִּֽי־עָזִּי וְזִמְרָת יָהּ יְהוָה וַֽיְהִי־לִי לִֽישׁוּעָֽה׃
3 ఆనందంతో రక్షణ బావుల్లోనుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ రోజున మీరు ఇలా అంటారు,
וּשְׁאַבְתֶּם־מַיִם בְּשָׂשׂוֹן מִמַּעַיְנֵי הַיְשׁוּעָֽה׃
4 “యెహోవాను స్తుతించండి. ఆయన పేరు పెట్టి పిలవండి. జనాల్లో ఆయన క్రియలు చాటించండి. ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.
וַאֲמַרְתֶּם בַּיּוֹם הַהוּא הוֹדוּ לַֽיהוָה קִרְאוּ בִשְׁמוֹ הוֹדִיעוּ בָֽעַמִּים עֲלִֽילֹתָיו הַזְכִּירוּ כִּי נִשְׂגָּב שְׁמֽוֹ׃
5 యెహోవాను గూర్చి పాటలు పాడండి. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ సంగతి భూమంతా తెలియనివ్వండి.
זַמְּרוּ יְהוָה כִּי גֵאוּת עָשָׂה מידעת מוּדַעַת זֹאת בְּכָל־הָאָֽרֶץ׃
6 గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”
צַהֲלִי וָרֹנִּי יוֹשֶׁבֶת צִיּוֹן כִּֽי־גָדוֹל בְּקִרְבֵּךְ קְדוֹשׁ יִשְׂרָאֵֽל׃

< యెషయా~ గ్రంథము 12 >