< యెషయా~ గ్రంథము 10 >
1 ౧ వితంతువులు తమకు కొల్లసొమ్ముగా ఉండాలనీ,
Тешко онима који постављају законе неправедне и који пишу неправду,
2 ౨ తల్లిదండ్రులు లేని వాళ్ళను దోచుకోవాలనీ కోరి, అవసరతలో ఉన్న వాళ్లకు న్యాయం జరిగించకుండా చేసి, నా ప్రజల్లో ఉన్న పేదలకు హక్కులు లేకుండా చేసి, అన్యాయ నియమాలు విధించే వారికీ, బాధ కలిగించే శాసనాలు చేసే వారికీ బాధ.
Да одбију од суда убоге, и да отимају правицу сиромасима народа мог, да би им плен биле удовице и сироте грабеж.
3 ౩ తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?
А шта ћете чинити у дан похођења и погибли која ће доћи издалека? Коме ћете прибећи за помоћ? Где ли ћете оставити славу своју?
4 ౪ నువ్వు బందీలైన వాళ్ళ కింద ముడుచుకుని దాక్కున్నావు. హతమైన వాళ్ళతోపాటు పడి ఉన్నావు. అయినా యెహోవా కోపం చల్లారలేదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.
Да се не би унизила међу робље и међу побијене пала? Код свега тога неће се одвратити гнев Његов, него ће рука Његова још бити подигнута.
5 ౫ అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర.
Тешко Асиру, шиби гнева мог, ако и јесте палица у руци његовој моја јарост.
6 ౬ భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాళ్ళను పంపిస్తాను. కొల్లసొమ్ము దోచుకోడానికీ, వేటాడింది తెచ్చుకోడానికీ, వాళ్ళను వీధుల్లో మట్టి తొక్కినట్టు తొక్కడానికీ, నా ఉగ్రతకు పాత్రులైన అహంకార ప్రజలకు విరోధంగా అతన్ని పంపిస్తాను.
На народ лицемерни послаћу га, и заповедићу му за народ на који се гневим, да плени и отима, и да га изгази као блато на улицама.
7 ౭ కాని అతడు ఆలా అనుకోడు. అది అతని ఉద్దేశం కాదు. నాశనం చెయ్యాలనీ, అనేకమందిని నిర్మూలం చెయ్యాలనీ అతని ఆలోచన.
Али он неће тако мислити и срце његово неће тако судити, него му је у срцу да затре и истреби многе народе.
8 ౮ అతను “నా అధిపతులందరూ మహారాజులు కారా?
Јер ће рећи: Кнезови моји нису ли сви цареви?
9 ౯ కల్నో పట్టణం కర్కెమీషులాంటిదే కదా? హమాతు అర్పాదులాంటిది కాదా? షోమ్రోను దమస్కులాంటిది కాదా?
Није ли Халан као Хархемис? Није ли Емат као Арфад? Није ли Самарија као Дамаск?
10 ౧౦ విగ్రహాలను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి గదా, వాటి విగ్రహాలు యెరూషలేము, షోమ్రోనుల విగ్రహాల కంటే ఎక్కువే గదా.
Како је рука моја нашла царства лажних богова, којих ликови беху јачи од јерусалимских и самаријских,
11 ౧౧ షోమ్రోను పట్ల, దాని విగ్రహాల పట్ల నేను చేసినట్టు యెరూషలేము పట్ల, దాని విగ్రహాల పట్ల చెయ్యకుండా ఉంటానా” అంటాడు.
Нећу ли учинити Јерусалиму и његовим лажним боговима онако како сам учинио Самарији и њеним лажним боговима?
12 ౧౨ సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత ఆయన “నేను అష్షూరు రాజు హృదయ గర్వం కారణంగా అతని మాటను బట్టి, అతని కళ్ళల్లోని అహంకారపు చూపులను బట్టి, అతన్ని శిక్షిస్తాను” అంటాడు.
Али кад сврши Господ све дело своје на гори сионској и у Јерусалиму, тада ћу обићи плод охолог срца цара асирског и славу поноситих очију његових.
13 ౧౩ ఎందుకంటే అతడు, “నేను తెలివైన వాణ్ణి. నా బలంతో, నా బుద్ధితో అలా చేశాను. నేను దేశాల సరిహద్దులను మార్చి వాళ్ళ ఖజానాలను దోచుకున్నాను. మహా బలిష్ఠుడినై సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళను కూలదోశాను.
Јер рече: Крепошћу руке своје учиних и мудрошћу својом, јер сам разуман; и преместих међе народима и благо њихово заплених и као јунак оборих становнике.
14 ౧౪ పక్షిగూటిలో ఒకడు చెయ్యి పెట్టినట్టు దేశాల ఆస్తి చేజిక్కించుకున్నాను. విడిచిపెట్టిన గుడ్లను ఏరుకున్నట్టు నేను భూమంతా సంపాదించుకున్నాను. ఏ పక్షీ రెక్కలు ఆడించలేదు, నోరు తెరవలేదు, కిచకిచలాడలేదు” అంటాడు.
И рука моја нађе као гнездо богатство у народа, и како се купе јаја остављена тако покупих сву земљу, и не би никога да махне крилом или да отвори уста и писне.
15 ౧౫ నరికేవాణ్ణి చూసి గొడ్డలి తన గురించి తాను ప్రగల్భాలు పలుకుతుందా? కోసేవాణ్ణి చూసి రంపం తన గురించి తాను పొగడుకుంటుందా? ఇది ఒక కర్ర తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలిగినట్టు ఉంది. ఒక గద ఒక వ్యక్తిని పైకి లేపగలిగినట్టు ఉంది.
Хоће ли се секира величати над оним који њом сече? Хоће ли се пила разметати над оним који њом ради? Као да би прут махао оним који га дигне, као да би се хвалио штап да није од дрвета.
16 ౧౬ కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.
Зато ће Господ, Господ над војскама, пустити на претиле његове мршу, и славу ће његову потпалити да гори као огањ.
17 ౧౭ ఇశ్రాయేలు దేవుని వెలుగు ఒక అగ్ని అవుతుంది. దాని పరిశుద్ధ దేవుడు ఒక జ్వాల అవుతాడు. అది అష్షూరు దేశపు బలురక్కసి చెట్లకూ, గచ్చపొదలకూ అంటుకుని ఒక్క రోజులో వాటిని మింగేస్తుంది.
Јер ће видело Израиљево бити огањ, и Светац ће његов бити пламен, и упалиће и сажећи трње његово и чкаљ његов у један дан.
18 ౧౮ ఒకడు వ్యాధితో క్షీణించిపోయినట్టు శరీర ప్రాణాలతోపాటు అతని అడవికీ అతని ఫలభరితమైన పొలాలకూ కలిగిన మహిమను అది నాశనం చేస్తుంది.
И красоту шуме његове и њиве његове, од душе до тела, уништиће, и биће као бегунац кад изнемогне.
19 ౧౯ అతని అడవిచెట్ల లెక్క ఎంత తగ్గిపోతుందంటే, ఒక పసివాడు వాటిని లెక్కపెట్టగలుగుతాడు.
И шта остане дрвета шуме његове, биће мало, да би их дете могло пописати.
20 ౨౦ ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు, యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్నవాళ్ళు తమను హతం చేసిన వాణ్ణి ఇక ఎన్నడూ ఆశ్రయించకుండా ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడతారు.
И у то време остатак Израиљев и који се избаве у дому Јаковљевом неће се више ослањати на оног ко их бије, него ће се ослањати на Господа Свеца Израиљевог истином.
21 ౨౧ యాకోబులో మిగిలిన వాళ్ళు బలవంతుడైన దేవునివైపు తిరుగుతారు.
Остатак ће се обратити, остатак Јаковљев, к Богу силном.
22 ౨౨ ఇశ్రాయేలూ, నీ ప్రజలు సముద్రపు ఇసుకలా ఉన్నా, దానిలో మిగిలిన వాళ్ళే తిరుగుతారు. ప్రవాహంలా పారే నీతి నిర్ణయించిన ప్రకారం ఆ దేశానికి సమూల నాశనం ప్రాప్తించింది.
Јер ако буде народа твог, Израиљу, као песка морског, остатак ће се његов обратити. Погибао је одређена, разлиће се правда.
23 ౨౩ ఎందుకంటే ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భూమంతటా తాను నిర్ణయించిన సమూల నాశనం అమలు చెయ్యబోతున్నాడు.
Јер ће Господ, Господ над војскама, извршити погибао одређену у свој земљи.
24 ౨౪ ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “సీయోనులో నివాసం ఉంటున్న నా ప్రజలారా, అష్షూరుకు భయపడవద్దు. ఐగుప్తీయులు చేసినట్టు వాళ్ళు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తమ దండం ఎత్తుతారు.
Зато овако вели Господ, Господ над војскама: Не бој се Асирца, народе мој, који наставаш на гори Сиону; прутом ће те ударити и штап свој подигнуће на те као у Мисиру.
25 ౨౫ అతనికి భయపడవద్దు. ఇంక కొద్ది కాలమైన తరువాత నీ మీద నా కోపం చల్లారుతుంది. నా కోపం అతని నాశనానికి దారి తీస్తుంది.”
Јер још мало, и гнев ће престати; тада ће се јарост моја обратити на њихову погибао.
26 ౨౬ ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించినట్టు సేనల ప్రభువైన యెహోవా తన కొరడాను అతని మీద ఝుళిపిస్తాడు. ఆయన ఐగుప్తులో చేసినట్టు తన కర్ర సముద్రం మీద ఎత్తి దాన్ని పైకెత్తుతాడు.
Јер ће подигнути на њ Господ над војскама бич, те ће бити као расап мадијански код камена Орива и као штап његов на мору, и подигнуће га као у Мисиру.
27 ౨౭ ఆ రోజున నీ భుజం మీద నుంచి అతని బరువు, నీ మెడ మీద నుంచి అతని కాడి తీసివేయడం జరుగుతుంది. నీ మెడ బలంగా ఉన్న కారణంగా ఆ కాడి నాశనం అవుతుంది.
И тада ће се скинути бреме његово с рамена твог и јарам његов с врата твог, и изломиће се јарам од помазања.
28 ౨౮ శత్రువు ఆయాతు దగ్గరికి వచ్చాడు, మిగ్రోను మార్గంగుండా వెళ్తున్నాడు. మిక్మషులో తమ సామగ్రి నిల్వ చేశాడు.
Дође у Ајат, прође у Мигрон, у Михмасу распрти пртљаг свој.
29 ౨౯ వాళ్ళు కొండ సందు దాటారు, గెబలో బస చేశారు. రమా వణకుతోంది. సౌలు గిబ్యా నివాసులు పారిపోయారు.
Пођоше кланцем, у Гаваји заноћише, препаде се Рама, Гаваја Саулова побеже.
30 ౩౦ గల్లీము ఆడపడుచులారా, బిగ్గరగా కేకలు వేయండి. లాయిషా, ఆలకించు! అయ్యయ్యో, అనాతోతు!
Вичи гласно, кћери Галимова; нек се чује у Лаис, јадни Анатоте!
31 ౩౧ మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గెబీము నివాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తుతున్నారు.
Мадмина побеже, становници гевимски утекоше.
32 ౩౨ ఈ రోజే అతను నోబులో ఆగుతాడు. ఈ రోజే సీయోను కుమారి పర్వతం, యెరూషలేము కొండవైపు వాళ్ళు తమ పిడికిలి ఊపుతున్నారు.
Још један дан, па ће стајати у Нову, махнуће руком својом на гору кћери сионске, на хум јерусалимски.
33 ౩౩ చూడండి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భీకర శబ్దంతో కొమ్మలను తెగగొట్టినప్పుడు ఎత్తయిన చెట్లు కూలిపోతాయి. గంభీరమైనవి పడిపోతాయి.
Гле, Господ, Господ над војскама, окресаће силом гране; шта је високо посећи ће, и шта је уздигнуто снизиће.
34 ౩౪ ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతాడు. ప్రఖ్యాతిగాంచిన లెబానోను కూలిపోతుంది.
И густу ће шуму исећи секиром, и Ливан ће пасти од Силнога.