< హొషేయ 9 >
1 ౧ ఇశ్రాయేలూ, అన్యప్రజలు సంతోషించేలా నీవు సంతోషించవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి నమ్మక ద్రోహం చేశావు. నీ కళ్ళాలన్నిటి మీద ఉన్న ధాన్యాన్ని బట్టి నీవు వేశ్యకిచ్చే మామూలు కోరావు.
Rejoice not, O Israel, Exult not, like the nations! For thou committest fornication, forsaking thy God! Thou lovest hire on every corn-floor.
2 ౨ కళ్ళాలు గాని ద్రాక్షగానుగలు గాని వారికి అన్నం పెట్టవు. కొత్త ద్రాక్షారసం ఉండదు.
The floor and the vat shall not feed them, And the new wine shall deceive them.
3 ౩ వారు యెహోవా దేశంలో కొనసాగరు. ఎఫ్రాయిమీయులు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతారు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తింటారు.
They shall not dwell in the land of Jehovah; To Egypt shall Ephraim go back, And eat unclean things in Assyria.
4 ౪ యెహోవాకు ద్రాక్షారస పానార్పణం అర్పించరు. వారు అర్పించేవి ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారంగా పుచ్చుకొనేది ప్రలాపం చేసేవారి ఆహారం వలే ఉంటుంది. దాన్ని తినే వారంతా అపవిత్రులైపోతారు. వారి ఆహారం వారికే సరిపోతుంది. అది యెహోవా మందిరంలోకి రాదు.
They shall pour out no offerings of wine to Jehovah, Nor shall their sacrifices please him; They shall be to them as the bread of mourners; All that eat thereof shall be polluted. Their bread shall be for their own hunger; It shall not come into the house of Jehovah.
5 ౫ నియామక పండగల్లో, యెహోవా పండగ దినాల్లో మీరేమి చేస్తారు?
What will ye do in the festal day, In the day of the feast of Jehovah?
6 ౬ చూడండి, వారు నాశనం తప్పించుకుంటే. ఐగుప్తుదేశం వారికి పోగయ్యే స్థలంగా ఉంటుంది. మెంఫిస్ పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉంటుంది. వారి అపురూపమైన వెండివస్తువులను దురదగొండి మొక్కలు ఆవరిస్తాయి. ముండ్లకంప వారి నివాస స్థలంలో పెరుగుతుంది.
For, behold, they go forth from a wasted land; Egypt shall gather them; Memphis shall bury them; The precious places of their silver, Nettles shall possess them; Thorns shall spring up in their habitations.
7 ౭ శిక్షా దినాలు వచ్చేస్తున్నాయి. ప్రతికార దినాలు వచ్చేశాయి. “ప్రవక్తలు బుద్ధిలేని వారు, ఆత్మ మూలంగా పలికే వారు వెర్రివారు.” ప్రజల విస్తార దోషం, వారు చూపిన తీవ్ర శత్రుత్వం మూలంగా ఇశ్రాయేలువారు ఇది తెలుసుకుంటారు.
The days of visitation are come; The days of retribution are come— Israel shall know that the prophet was foolish, That the man of the spirit was mad— For the greatness of` thy iniquity, and thy great hatred.
8 ౮ నా దేవుని దగ్గర ఉండే ప్రవక్త ఎఫ్రాయిముకు కావలివాడు. వారి దారులన్నిటిలో పక్షులకు పన్నే వలలు ఉన్నాయి. దేవుని మందిరంలో వారి పట్ల శత్రుత్వం ఉంది.
If Ephraim seek an answer from my God, The prophet is as the snare of the fowler in all his ways, A net in the house of his God.
9 ౯ గిబియా రోజుల్లో లాగా వాళ్ళు చాలా దుర్మార్గులై పోయారు. యెహోవా వారి దోషాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి పాపాలకై ఆయన వారికి శిక్ష విధిస్తాడు.
They have deeply corrupted themselves, as in the days of Gibeah; He will remember their iniquity; He will requite their sins.
10 ౧౦ యెహోవా ఇలా అంటున్నాడు. “అరణ్యంలో ద్రాక్షపండ్లు దొరికినట్టు ఇశ్రాయేలువారు నాకు దొరికారు. వసంత కాలంలో అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు. అయితే వారు బయల్పెయోరు దగ్గరికి పోయారు. ఆ లజ్జాకరమైన దేవుడికి తమను అప్పగించుకున్నారు. తాము మోహించిన విగ్రహాల్లాగానే వారు కూడా అసహ్యులయ్యారు.”
I found Israel as grapes in the wilderness; As the early fruit on the fig-tree, at its first time of bearing, I saw your fathers. But they went to Baal Peor, And separated themselves to shame, And had abominable idols according to their love.
11 ౧౧ ఎఫ్రాయిము విషయానికొస్తే వారి కీర్తి పక్షిలాగా ఎగిరిపోతుంది. ప్రసవమైనా, గర్భవతులుగా ఉండడం అయినా, గర్భం ధరించడమైనా వారికి ఉండదు.
The glory of Ephraim shall fly away as a bird; They shall not bring forth, nor bear in the womb, nor conceive;
12 ౧౨ వారు తమ పిల్లలను పెంచినా. వారికి ఎవరూ మిగల కుండా తీసేస్తాను. నేను వారి నుండి ముఖం తిప్పుకున్నప్పుడు అయ్యో, వారికి బాధ!
Yea, if they bring up children, I will utterly bereave them; Yea, woe to them when I depart from them!
13 ౧౩ లోయలో నాటిన తూరు పట్టణం లాగా ఉండడానికి. నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకున్నాను. అయితే ఊచకోత కోసేవారి పాలు చెయ్యడానికి అది తన పిల్లలను బయటికి తీసుకు వస్తుంది.
I have seen Ephraim planted, like Tyre, in a rich pasture, Yet shall Ephraim bring out his children to the murderer.
14 ౧౪ యెహోవా, వారికి ప్రతీకారం చెయ్యి. వారికి నీవేమి ప్రతీకారం చేస్తావు? వారి స్త్రీలకు గర్భస్రావమయ్యే గర్భసంచులను, పాలు లేని స్తనాలను ఇవ్వు.
Give them, O Jehovah! What wilt thou give them? Give them a miscarrying womb, And dry breasts!
15 ౧౫ గిల్గాలులో వారు చేసిన పాపం మూలంగా. అక్కడే నేను వారికి విరోధినయ్యాను. వారి దుష్టక్రియలను బట్టి వారిని ఇక నా మందిరంలోనుండి తోలి వేస్తాను. వారిని ఇక మీదట ప్రేమించను. వారి అధికారులంతా తిరుగుబాటు చేసేవారు.
All their wickedness is in Gilgal; Yea, there have I hated them for the wickedness of their doings; I will drive them from my house; I will love them no more; All their princes are revolters.
16 ౧౬ ఎఫ్రాయిము రోగి అయ్యాడు. వారి వేరు ఎండిపోయింది. వారు ఫలించరు. వారు పిల్లలను కన్నప్పటికీ వారి ముద్దు బిడ్డలను నాశనం చేస్తాను.
Ephraim is smitten; Their root is dried up; they shall bear no fruit; Yea, though they should beget children, I will destroy the beloved fruit of the womb.
17 ౧౭ వారు నా దేవుని మాట వినలేదు గనక ఆయన వారిని విసర్జించాడు. వారు దేశం విడిచి అన్యజనుల్లో దేశదిమ్మరులౌతారు.
My God shall cast them away, Because they have not hearkened to him, And they shall be wanderers among the nations.