< హొషేయ 7 >

1 నేను ఇశ్రాయేలును బాగు చేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషం కనిపిస్తూ ఉంది. షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి. వారు మోసం అభ్యాసం చేస్తారు. దొంగతనానికి చొరబడతారు. బంది పోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు.
Коли Я лікую Ізраїля, то виявляю гріх Єфремів та зло Самарі́ї, бо роблять вони неправдиве, і зло́дій прихо́дить, грабує на вулиці ба́нда.
2 తమ క్రియలు వారి చుట్టూ ఉన్నప్పటికీ, అవి నా ఎదుటనే జరిగినప్పటికీ, వారి దుర్మార్గత నేను జ్ఞాపకం చేసుకోనని తమలో తాము అనుకుంటారు.
І не ду́мають в серці своє́му, що Я пам'ятаю про все їхнє зло. тепер їхні вчинки ось їх оточи́ли і перед обличчям Моїм постава́ли.
3 వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు.
Вони злістю своєю втішають царя, а своїми обма́нами — зве́рхників.
4 వారంతా కాముకులే. రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. ఊరుకున్నట్టు వారంతా కాముకులే.
Усі вони чинять пере́люб, мов піч, яку пе́кар розпа́лює, що напа́лювати перестає́, як тісто замісить та вкисне воно.
5 మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు. రాజు తానే అపహాసకులతో చెయ్యి కలిపాడు.
У святко́вий день нашого царя похворі́ли князі́ від жа́ру вина, і він простяг до насмі́шників руку свою.
6 పొయ్యి లాంటి తమ హృదయాలతో కపటపు ఆలోచనలు చేస్తారు. వారి క్రోధం రాత్రంతా మండుతూనే ఉంటుంది. ఉదయాన అది తీవ్రమైన జ్వాలగా మండుతుంది.
Бо їхнє ну́тро, як піч, у них пала́є їхнє серце: всю ніч спить їхній гнів, а на ра́нок горить, як палю́чий огонь.
7 వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు. వారి రాజులంతా కూలిపోయారు. నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు.
Вони́ всі гаря́чі, як піч, і су́ддів своїх пожира́ють. Усі царі їхні попа́дали, між ними ніко́го нема, хто б кли́кав до Мене.
8 ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అట్టు వంటి వాడయ్యాడు.
Змішався Єфрем із наро́дами, Єфрем став млинце́м, що печеться непереве́рнений.
9 పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు.
Його силу чужі пожирають, та про те він не знає, вже й воло́сся посивіло в нього, а того́ він не знає.
10 ౧౦ ఇశ్రాయేలువారి ప్రతిష్టే అతని మీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వైపు తిరుగడం లేదు. ఆయనను వెతకడం లేదు.
І гордість Ізраїля свідчить на нього, і до Господа, Бога свого вони не верта́ються, і не шукають Його у всім цім.
11 ౧౧ ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయిపోయింది. అది ఐగుప్తీయులను పిలుస్తుంది. తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది.
А Єфрем став, як голуб, — нерозумний, немудрий: закликають в Єгипет, а йдуть в Асирію.
12 ౧౨ వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను. పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను. వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను.
Як пі́дуть вони, розтягну́ Свою сітку над ними, — стягну їх додолу, мов птаство небесне, — за злобою їхньою Я їх караю.
13 ౧౩ వారికి బాధ! వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారిని రక్షించేవాడినే. కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు.
Горе їм, бо від Мене вони відійшли́, погу́ба на них, бо повстали вони проти Мене! Хоч Я викупив їх, та вони проти Мене говорять неправду.
14 ౧౪ హృదయ పూర్వకంగా నన్ను బతిమాలుకోలేదు గానీ. మంచాల మీద పడుకుని ఆక్రోశిస్తారు. ధాన్యం, కొత్త సారాయి కావాలని తమను కత్తితో గాయపరచుకుంటారు. కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతారు.
І вони в своїм серці не кличуть до Мене, як виють на ло́жах своїх, точать сварку за хліб та вино, і відступають від Мене.
15 ౧౫ నేను వారి చేతులు బలపరచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు.
А Я їх картав, їхні раме́на зміцняв, а вони зло на Мене заду́мують.
16 ౧౬ వారు తిరిగి వస్తారు గానీ, సర్వోన్నతుని దేవుని వైపుకు తిరగరు. వారు పనికిరాని విల్లులాగా ఉన్నారు. వారి అధికారులు తాము పలికిన గర్వపు మాటల మూలంగా కత్తి పాలవుతారు. ఇలా వారు ఐగుప్తుదేశంలో ఎగతాళికి గురి అవుతారు.
Вони наверта́ються, та не до Всевишнього, стали, немов той обма́нливий лук. Упадуть від меча їхні князі́ за гордість свого язика́, — це їхня нару́га в єгипетськім кра́ї!

< హొషేయ 7 >