< హొషేయ 7 >
1 ౧ నేను ఇశ్రాయేలును బాగు చేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషం కనిపిస్తూ ఉంది. షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి. వారు మోసం అభ్యాసం చేస్తారు. దొంగతనానికి చొరబడతారు. బంది పోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు.
Kad Es Israēli dziedināšu, tad Efraīma noziegums taps atsegts un Samarijas ļaunums, jo tie dara viltību; zagļi ir iekšā, un laupītāji ārā.
2 ౨ తమ క్రియలు వారి చుట్టూ ఉన్నప్పటికీ, అవి నా ఎదుటనే జరిగినప్పటికీ, వారి దుర్మార్గత నేను జ్ఞాపకం చేసుకోనని తమలో తాము అనుకుంటారు.
Un tie nedomā savā sirdī, ka Es visu viņu ļaunumu pieminu. Bet nu viņu darbi apmetās pret tiem, tie ir Manā priekšā.
3 ౩ వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు.
Ar savu ļaunumu tie iepriecina ķēniņu un lielkungus ar saviem meliem.
4 ౪ వారంతా కాముకులే. రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. ఊరుకున్నట్టు వారంతా కాముకులే.
Tie visi ir laulības pārkāpēji, tie ir kā ceplis, kurināts no cepēja, kas mīklu samīcījis, mitējās kurināt, kamēr tā ir uzrūgusi.
5 ౫ మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు. రాజు తానే అపహాసకులతో చెయ్యి కలిపాడు.
Mūsu ķēniņa dienā lielkungi paliek vāji no vīna karstuma; viņš sniedz savu roku smējējiem.
6 ౬ పొయ్యి లాంటి తమ హృదయాలతో కపటపు ఆలోచనలు చేస్తారు. వారి క్రోధం రాత్రంతా మండుతూనే ఉంటుంది. ఉదయాన అది తీవ్రమైన జ్వాలగా మండుతుంది.
Jo tie ar savu sirdi dodās uz viltību kā ceplī. Viņu cepējs guļ cauru nakti, rītā viņš deg kā uguns liesmās.
7 ౭ వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు. వారి రాజులంతా కూలిపోయారు. నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు.
Tie visi ir iekarsuši kā ceplis un aprij savus tiesnešus, visi viņu ķēniņi krīt, neviens no tiem mani nepiesauc.
8 ౮ ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అట్టు వంటి వాడయ్యాడు.
Efraīms jaucās ar tautām, Efraīms ir rausis, ko neapgriež.
9 ౯ పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు.
Sveši norij viņa spēku, un viņš to nemana, arī sirmums viņam ir uznācis, un viņš to neatzīst.
10 ౧౦ ఇశ్రాయేలువారి ప్రతిష్టే అతని మీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వైపు తిరుగడం లేదు. ఆయనను వెతకడం లేదు.
Un Israēla gods dod liecību pret viņa vaigu, bet tie neatgriežas pie Tā Kunga, sava Dieva, un tomēr viņu nemeklē.
11 ౧౧ ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయిపోయింది. అది ఐగుప్తీయులను పిలుస్తుంది. తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది.
Jo Efraīms ir kā nejēdzīgs balodis bez prāta; Ēģipti tie piesauc, pie Asura tie staigā.
12 ౧౨ వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను. పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను. వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను.
Kad tie nu tā staigā, tad Es Savu tīklu pār tiem izpletīšu, Es tos nometīšu(lejā) kā putnus apakš debess, Es tos pārmācīšu, tā kā ir sludināts viņu draudzei.
13 ౧౩ వారికి బాధ! వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారిని రక్షించేవాడినే. కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు.
Vai tiem! Jo tie bēg no Manis; posts pār viņiem! Jo tie ir noziegušies pret Mani. Es tos gan gribētu atpestīt, bet tie runā melus pret Mani.
14 ౧౪ హృదయ పూర్వకంగా నన్ను బతిమాలుకోలేదు గానీ. మంచాల మీద పడుకుని ఆక్రోశిస్తారు. ధాన్యం, కొత్త సారాయి కావాలని తమను కత్తితో గాయపరచుకుంటారు. కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతారు.
Un tie Mani nepiesauc no sirds, kad tie kauc uz savām gultām. Tie sapulcējās labības un vīna dēļ bet Man tie turas pretī.
15 ౧౫ నేను వారి చేతులు బలపరచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు.
Gan Es tos pamācu un stiprināju viņu elkoņus, bet tie domā ļaunu pret Mani.
16 ౧౬ వారు తిరిగి వస్తారు గానీ, సర్వోన్నతుని దేవుని వైపుకు తిరగరు. వారు పనికిరాని విల్లులాగా ఉన్నారు. వారి అధికారులు తాము పలికిన గర్వపు మాటల మూలంగా కత్తి పాలవుతారు. ఇలా వారు ఐగుప్తుదేశంలో ఎగతాళికి గురి అవుతారు.
Tie griežas, bet ne uz to, kas augšā; tie ir kā viltīgs stops; viņu lielkungi kritīs caur zobenu viņu trakās mēles dēļ; tas būs viņu apsmiekls Ēģiptes zemē.