< హొషేయ 4 >

1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి. యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.
שִׁמְעוּ דְבַר־יְהוָה בְּנֵי יִשְׂרָאֵל כִּי רִיב לַֽיהוָה עִם־יוֹשְׁבֵי הָאָרֶץ כִּי אֵין־אֱמֶת וְֽאֵין־חֶסֶד וְאֵֽין־דַּעַת אֱלֹהִים בָּאָֽרֶץ׃
2 అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం. హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది. ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.
אָלֹה וְכַחֵשׁ וְרָצֹחַ וְגָנֹב וְנָאֹף פָּרָצוּ וְדָמִים בְּדָמִים נָגָֽעוּ׃
3 కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది. దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు. సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.
עַל־כֵּן ׀ תֶּאֱבַל הָאָרֶץ וְאֻמְלַל כָּל־יוֹשֵׁב בָּהּ בְּחַיַּת הַשָּׂדֶה וּבְעוֹף הַשָּׁמָיִם וְגַם־דְּגֵי הַיָּם יֵאָסֵֽפוּ׃
4 ఒకడు మరొకడిపై వ్యాజ్యం వెయ్యనివ్వవద్దు. ఒకడు మరొకడిపై నింద వెయ్యనివ్వవద్దు. ఎందుకంటే యాజకులారా, నేను తప్పు పట్టేది మిమ్మల్నే.
אַךְ אִישׁ אַל־יָרֵב וְאַל־יוֹכַח אִישׁ וְעַמְּךָ כִּמְרִיבֵי כֹהֵֽן׃
5 యాజకులు పగటి వేళ కూలిపోతారు. రాత్రివేళ నీతోబాటు ప్రవక్తలు పడిపోతారు. నీ తల్లిని నేను నాశనం చేస్తాను.
וְכָשַׁלְתָּ הַיּוֹם וְכָשַׁל גַּם־נָבִיא עִמְּךָ לָיְלָה וְדָמִיתִי אִמֶּֽךָ׃
6 నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు. నాకు యాజకుడివి కాకుండా నేను కూడా నిన్ను తోసిపుచ్చుతాను. ఎందుకంటే నీవు నీ దేవుడినైన నా చట్టాన్ని విస్మరించావు. నీ పిల్లలను కూడా నేను పట్టించుకోను.
נִדְמוּ עַמִּי מִבְּלִי הַדָּעַת כִּֽי־אַתָּה הַדַּעַת מָאַסְתָּ וְאֶמְאָֽסְאךָ מִכַּהֵן לִי וַתִּשְׁכַּח תּוֹרַת אֱלֹהֶיךָ אֶשְׁכַּח בָּנֶיךָ גַּם־אָֽנִי׃
7 యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు. కాబట్టి వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను.
כְּרֻבָּם כֵּן חָֽטְאוּ־לִי כְּבוֹדָם בְּקָלוֹן אָמִֽיר׃
8 నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు.
חַטַּאת עַמִּי יֹאכֵלוּ וְאֶל־עֲוֺנָם יִשְׂאוּ נַפְשֽׁוֹ׃
9 కాబట్టి జనులకు ఎలాగో యాజకులకూ అలాగే జరుగుతుంది. వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తాను. వారి క్రియలనుబట్టి వారందరికీ ప్రతీకారం చేస్తాను.
וְהָיָה כָעָם כַּכֹּהֵן וּפָקַדְתִּי עָלָיו דְּרָכָיו וּמַעֲלָלָיו אָשִׁיב לֽוֹ׃
10 ౧౦ వారు నాకు, అంటే యెహోవాకు దూరమయ్యారు. నన్ను విడిచిపోయారు. కాబట్టి వారు భోజనం చేసినా తృప్తి పొందరు. వ్యభిచారం చేస్తారు గానీ అభివృద్ధి పొందలేరు.
וְאָֽכְלוּ וְלֹא יִשְׂבָּעוּ הִזְנוּ וְלֹא יִפְרֹצוּ כִּֽי־אֶת־יְהוָה עָזְבוּ לִשְׁמֹֽר׃
11 ౧౧ లైంగిక విచ్చలవిడితనం, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షా రసం, వారి మతి పోగొట్టాయి.
זְנוּת וְיַיִן וְתִירוֹשׁ יִֽקַּֽח־לֵֽב׃
12 ౧౨ నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్క బొమ్మల దగ్గర విచారణ చేస్తారు. వారి చేతికర్ర వారికి ప్రవచనాలు చెబుతున్నది. వ్యభిచార మనస్సు వారిని దారి తప్పించగా వారు నన్ను, అంటే వారి దేవుణ్ణి విసర్జించారు.
עַמִּי בְּעֵצוֹ יִשְׁאָל וּמַקְלוֹ יַגִּיד לוֹ כִּי רוּחַ זְנוּנִים הִתְעָה וַיִּזְנוּ מִתַּחַת אֱלֹהֵיהֶֽם׃
13 ౧౩ వారు పర్వత శిఖరాల మీద బలులర్పిస్తారు. కొండలపై ధూపం వేస్తారు. సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద నీడ మంచిదని అక్కడే ధూపం వేస్తారు. అందువలనే మీ కూతుర్లు వేశ్యలయ్యారు. మీ కోడళ్ళు కూడా వ్యభిచారిణులయ్యారు.
עַל־רָאשֵׁי הֶהָרִים יְזַבֵּחוּ וְעַל־הַגְּבָעוֹת יְקַטֵּרוּ תַּחַת אַלּוֹן וְלִבְנֶה וְאֵלָה כִּי טוֹב צִלָּהּ עַל־כֵּן תִּזְנֶינָה בְּנוֹתֵיכֶם וְכַלּוֹתֵיכֶם תְּנָאַֽפְנָה׃
14 ౧౪ మీ కుమార్తెలు చేసే లైంగిక దుర్మార్గతను బట్టి నేను వారిని శిక్షించను. మీ కోడళ్ళ వ్యభిచారాన్ని బట్టి నేను వారిని శిక్షించను. ఎందుకంటే ప్రజలు తామే వేశ్యల దగ్గరికి పోతారు. తామే ఆలయ వేశ్యలతో పోకిరీ పనులు చెయ్యడం కోసం బలులర్పిస్తారు. అవగాహన లేని జనం నిర్మూలమైపోతారు.
לֹֽא־אֶפְקוֹד עַל־בְּנוֹתֵיכֶם כִּי תִזְנֶינָה וְעַל־כַּלּֽוֹתֵיכֶם כִּי תְנָאַפְנָה כִּי־הֵם עִם־הַזֹּנוֹת יְפָרֵדוּ וְעִם־הַקְּדֵשׁוֹת יְזַבֵּחוּ וְעָם לֹֽא־יָבִין יִלָּבֵֽט׃
15 ౧౫ ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైపోయావు. అయినా యూదా ఆ పాపంలో పాలు పొందక పోవుగాక. మీరు గిల్గాలు వెళ్లొద్దు. బేతావెనుకు పోవద్దు. యెహోవా జీవం తోడని ప్రమాణం చేయవద్దు.
אִם־זֹנֶה אַתָּה יִשְׂרָאֵל אַל־יֶאְשַׁם יְהוּדָה וְאַל־תָּבֹאוּ הַגִּלְגָּל וְאַֽל־תַּעֲלוּ בֵּית אָוֶן וְאַל־תִּשָּׁבְעוּ חַי־יְהוָֽה׃
16 ౧౬ పొగరుబోతు పెయ్యలాగా ఇశ్రాయేలువారు మొండిగా ప్రవర్తించారు. మైదానంలో మేసే గొర్రె పిల్లలను నడిపించినట్టు దేవుడు వారినెలా నడిపిస్తాడు?
כִּי כְּפָרָה סֹֽרֵרָה סָרַר יִשְׂרָאֵל עַתָּה יִרְעֵם יְהוָה כְּכֶבֶשׂ בַּמֶּרְחָֽב׃
17 ౧౭ ఎఫ్రాయిము విగ్రహాలతో ఏకమయ్యాడు. అతణ్ణి అలానే ఉండనియ్యి.
חֲבוּר עֲצַבִּים אֶפְרָיִם הַֽנַּֽח־לֽוֹ׃
18 ౧౮ వారికి ద్రాక్షారసం లేకుండా పోయినా, వ్యభిచారం మానుకోలేదు. వారి అధికారులు ఎంతో ఇష్టంగా సిగ్గుమాలిన దాన్ని ప్రేమిస్తారు.
סָר סָבְאָם הַזְנֵה הִזְנוּ אָהֲבוּ הֵבוּ קָלוֹן מָגִנֶּֽיהָ׃
19 ౧౯ సుడిగాలి వారిని చుట్టబెట్టుకు పోతుంది. తాము అర్పించిన బలుల కారణంగా వారు సిగ్గుపడతారు.
צָרַר רוּחַ אוֹתָהּ בִּכְנָפֶיהָ וְיֵבֹשׁוּ מִזִּבְחוֹתָֽם

< హొషేయ 4 >