< హొషేయ 2 >

1 మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి. మీ అక్కచెల్లెళ్ళతో “మీరు కనికరానికి నోచుకున్నారు” అని చెప్పండి.
“Frɛ wo nuabarimanom, ‘Me nkurɔfo’ na frɛ wo nuabeanom, ‘Mʼadɔfo.’”
2 మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు. వ్యాజ్యం వెయ్యి. ఆమె నా భార్యా కాదు, నేనామెకు భర్తనీ కాను. ఆమె మొదట తన వేశ్యా వృత్తిని మానుకోమనండి. తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి.
“Ka wo na anim, ka nʼanim, na ɔnyɛ me yere na menyɛ ne kunu. Ma ɔnsesa nʼanim a ayɛ aguaman anim no na onnyae awaresɛe a ɔde ne nufu yɛ no.
3 లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను. ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను. ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను. దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను.
Anyɛ saa a mɛpa ne ho ntama na wada adagyaw te sɛ da a wɔwoo no no; mɛma wayɛ sɛ nweatam, mɛdan no asase a awo wosee na mama osukɔm akum no.
4 ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు.
Merennɔ ne mma, efisɛ wɔyɛ aguaman mma.
5 వారి తల్లి కులట. వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది.
Wɔn na anyɛ ɔnokwafo na onyinsɛnee wɔn wɔ animguase mu. Ɔkae se, ‘Medi mʼadɔfo akyi, wɔn a wɔma me aduan ne nsu, ne kuntu ne nwera, ngo ne nsa.’
6 కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను. దానికి దారి కనబడకుండా గోడ కడతాను.
Eyi nti, mede nsɔe besiw no kwan; mɛto ɔfasu afa ne ho, sɛnea ɛbɛyɛ a ɔrenhu kwan.
7 అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది. ఎంత వెతికినా వారు దానికి కనబడరు. అప్పుడు ఆమె అంటుంది. “నా మొదటి భర్త దగ్గరికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి కంటే అదే బాగుంది.”
Obetiw nʼadɔfo, nanso ɔrento wɔn; ɔbɛhwehwɛ wɔn, nanso ɔrenhu wɔn. Afei, ɔbɛka se, ‘Mɛsan akɔ me kunu nkyɛn, te sɛ kan no, efisɛ, saa bere no na eye ma me sen mprempren.’
8 దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు.
Ɔnkae sɛ me na memaa no aduan, nsa foforo ne ngo, nea ɔmaa sikakɔkɔɔ ne dwetɛ buu no so ma wɔde kɔsom Baal no.
9 కాబట్టి నా ధాన్యాన్ని నా ద్రాక్షారసాన్ని వాటి కోత కాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను. ఆమె తన నగ్నత కప్పుకోవడానికి ఉపయోగించిన నా ఉన్ని, జనపనార లాగేసుకుంటాను.
“Enti sɛ mʼaduan no du twabere a mɛfa mʼade, ne me nsa foforo no nso saa ara. Megye me kuntu ne me nwera, a anka mepɛ sɛ ɔde kata nʼadagyaw so no.
10 ౧౦ దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు.
Enti afei mɛbɔ no adagyaw wɔ nʼadɔfo anim; obiara rentumi nnye no mfi me nsam.
11 ౧౧ ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను. ఆమె పండగలూ అమావాస్య పర్వదినాలూ విశ్రాంతి దినాలూ వార్షిక ఉత్సవాలు ఆగిపోయేలా చేస్తాను.
Metwa nʼafahyɛ nyinaa so: nʼafirihyia afahyɛ, Ɔsram Foforo afahyɛ Homeda afahyɛ ne nʼafahyɛ ahorow nyinaa.
12 ౧౨ “ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను.
Mɛsɛe ne bobe ne borɔdɔma nnua, nea ɔka se nʼadɔfo de tuaa no ka no; mɛyɛ ne nyinaa nkyɛkyerɛ, ama wuram mmoa awe.
13 ౧౩ అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను. ఆ దేవుళ్ళకు ధూపం వేసినందుకు. నగలు పెట్టుకుని, సింగారించుకుని. నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.
Mɛtwe nʼaso wɔ nna a ɔhyew aduhuam maa Baal no ho; ɔde nkaa ne agude hyehyɛɛ ne ho, tu dii nʼadɔfo akyi, me de, ne werɛ fii me,” nea Awurade se ni.
14 ౧౪ ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను. అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను.
“Enti merekɔdaadaa no; mede no bɛkɔ nweatam so na makasa bɔkɔɔ akyerɛ no wɔ hɔ.
15 ౧౫ ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను. ఆకోరు లోయను ఆశాద్వారంగా చేస్తాను. యవ్వనప్రాయంలో ఐగుప్తు దేశంలోనుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది.
Mɛsan de ne bobe mfuw ama no. Mɛyɛ no Sɛkyɛ Bon, anidaso pon. Ɛhɔ na ɔbɛto dwom sɛnea na ɔyɛ ne mmabun bere mu no ne bere a ofii Misraim no.
16 ౧౬ “ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు. ‘నా భర్త’ అంటావు.”
“Saa da no,” sɛɛ na Awurade se, “Wobɛfrɛ me ‘me kunu’; na woremfrɛ me ‘me wura’ bio.
17 ౧౭ ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు.
Meyi Baal ahorow din no afi nʼano; na ɔrenkankye wɔ wɔn din mu bio.
18 ౧౮ “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను.
Saa da no, mɛyɛ apam ama wɔn, wɔne wuram mmoa ne wim nnomaa ne mmoa a wɔwea wɔ asase so. Tadua, mpeaw ne ɔko, mɛbra wɔ asase no so, sɛnea wɔn nyinaa bɛtena ase asomdwoe mu.
19 ౧౯ నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.
Mɛware wo afebɔɔ; mɛda trenee ne atɛntrenee, ahummɔbɔ ne ayamhyehye adi akyerɛ wo.
20 ౨౦ యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.
Mɛware wo nokware mu, ama woahu Awurade.
21 ౨౧ ఆ దినాన నేను జవాబిస్తాను.” ఆకాశాలు చేసే విన్నపం నేను ఆలకిస్తాను. అవి భూమి చేసే మనవికి జవాబు ఇస్తాయి.
“Saa da no, megye wo so,” nea Awurade se ni. “Megye ɔsoro so, na ɔsoro de osu begye asase so,
22 ౨౨ భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా, అవి యెజ్రెయేలు చేసే మనవి ఆలకిస్తాయి.
na asase nso begye nnɔbae so: bobe foforo ne ngodua, na wɔn nso agye so se ‘Yesreel’, ‘Onyankopɔn na wadua.’
23 ౨౩ నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను. లో రుహమా పై నేను జాలి పడతాను. నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా, వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు.
Mede Israel bedua asase no so ama me ho; mɛda me dɔ adi akyerɛ nea mekae se, ‘wonyɛ me dɔfo’ no. Mɛka akyerɛ wɔn a misee wɔn sɛ ‘monyɛ me nkurɔfo’ no se ‘moyɛ me nkurɔfo,’ na wɔn nso aka se, ‘Wone me Nyankopɔn.’”

< హొషేయ 2 >