< హొషేయ 14 >

1 ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.
Turn back, O Israel, unto Jehovah thy God, For thou hast stumbled by thine iniquity.
2 ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.
Take with you words, and turn to Jehovah, Say ye unto Him: 'Take away all iniquity, and give good, And we do render the fruit of our lips.
3 అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.”
Asshur doth not save us, on a horse we ride not, Nor do we say any more, Our God, to the work of our hands, For in Thee find mercy doth the fatherless.'
4 వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను.
I heal their backsliding, I love them freely, For turned back hath Mine anger from him.
5 చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.
I am as dew to Israel, he flourisheth as a lily, And he striketh forth his roots as Lebanon.
6 అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.
Go on do his sucklings, And his beauty is as an olive, And he hath fragrance as Lebanon.
7 అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు. ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది.
Return do the dwellers under his shadow, They revive [as] corn, and flourish as a vine, His memorial [is] as wine of Lebanon.
8 ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. నావల్లనే నీకు ఫలం కలుగుతుంది.
O Ephraim, what to Me any more with idols? I — I afflicted, and I cause him to sing: 'I [am] as a green fir-tree,' From Me is thy fruit found.
9 ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.
Who [is] wise, and doth understand these? Prudent, and knoweth them? For upright are the ways of Jehovah, And the righteous go on in them, And the transgressors stumble therein!

< హొషేయ 14 >