< హొషేయ 13 >

1 ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగింది. అతడు ఇశ్రాయేలు వారిలో తనను గొప్ప చేసుకున్నాడు. తరువాత బయలు దేవుణ్ణి బట్టి అపరాధియై అతడు నాశనమయ్యాడు.
Як Єфрем говорив, то тремтіли, — він підне́сений був ув Ізраїлі, та через Ваа́ла згрішив і помер.
2 ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.
А тепер іще більше гріша́ть, бо зробили собі вони ві́длива з срі́бла свого́, божкі́в за своєю подо́бою; робота майстрі́в усе те, розмовляють із ними вони; ті люди, що жертву прино́сять, цілують телят.
3 కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా, పెందలకడ ఆరిపోయే ప్రాతఃకాలపు మంచులాగా ఉంటారు. కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా, పొగ గొట్టంలో గుండా వెళ్ళిపోయే పొగలాగా ఉంటారు.
Тому́ вони стануть, як хмара пора́нку, і мов та роса, що зникає вранці, немов та поло́ва, що з то́ку вино́ситься бурею, і наче із ко́мина дим.
4 మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప నీవు ఏ దేవుడినీ గుర్తించ కూడదు. నేను తప్ప వేరే రక్షకుడు లేడు.
А Я — Господь, Бог твій від кра́ю єгипетського, і Бога, крім Мене, не бу́деш ти знати, і крім Мене немає Спасителя.
5 మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే.
Я тебе на пустині пізнав, у пересо́хлому кра́ї.
6 తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు.
Мали добрі пасо́виська й ситі були, наси́тилися — і загорди́лось їхнє серце, тому́ то забули про Мене вони!
7 కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనయ్యాను. చిరుత పులి దారిలో పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకోవడానికి పొంచి ఉంటాను.
І став Я для них, немов лев, на дорозі чига́ю, немов та панте́ра.
8 పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను. క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను.
Нападу́ Я на них, немов та ведмеди́ця, що дітей загубила, і те розірву́, у що серце їхнє за́мкнене, і їх, як левчу́к, пожеру́ там, шматуватиме їх польова́ звірина́.
9 ఇశ్రాయేలూ, నీ మీదికి వచ్చి పడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు.
Погубив ти себе, о Ізраїлю, бо ти був проти Мене, спасі́ння свого́.
10 ౧౦ నీ రాజు ఏడి? నీ పట్టణాల్లో నీకు సహాయం చేయకుండ నీ రాజు ఏమైపోయాడు? “రాజును అధిపతులను నా మీద నియమించు” అని నీవు మనవి చేశావు గదా?
Де цар твій тоді? Нехай він поможе тобі по міста́х твоїх усіх! А де су́дді твої, що про них ти сказав: Дай нам царя та князі́в?
11 ౧౧ కోపంతో నీకు రాజును నియమించాను. క్రోధంతో అతణ్ణి తీసి పారేశాను.
Я тобі дав царя в Своїм гніві, і забрав у Своїй ре́вності.
12 ౧౨ ఎఫ్రాయిము దోషం పోగుపడింది. అతని పాపం పోగుపడింది.
Провина Єфремова зв'я́зана, схо́ваний прогріх його.
13 ౧౩ ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన కలుగుతుంది. ప్రసవం సమయంలో బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు.
Болі, немов породі́ллі, наді́йдуть на нього. Не мудрий він син, бо інакше не був би так довго у ма́тернім ну́трі.
14 ౧౪ అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా? మృత్యువు నుండి వారిని రక్షిస్తానా? ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా. పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా. నాకు కనికరం పుట్టదు. (Sheol h7585)
З рук шеолу Я ви́куплю їх, від смерти їх ви́бавлю. Де, смерте, жа́ло твоє? Де, шео́ле, твоя перемо́га? Жаль схова́ється перед очима Моїми! (Sheol h7585)
15 ౧౫ ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా, తూర్పు గాలి వస్తుంది. యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి. ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి. అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు.
Хоч він дає плід між брата́ми, але прийде вітер зо схо́ду, вітер Госпо́дній, що зі́йде з пустині, і всо́хне його джерело́, і пересо́хне крини́чка його, — понищить він скарб всіх коштовних рече́й!
16 ౧౬ షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక, ప్రజలు కత్తివాత కూలుతారు. వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు.
Завини́ть Самарі́я, бо стала уперта до Бога свого́, — поляжуть вони від меча! Порозби́вані будуть їхні діти, вагітні́ їхні розпо́роті будуть!

< హొషేయ 13 >