< హొషేయ 13 >
1 ౧ ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగింది. అతడు ఇశ్రాయేలు వారిలో తనను గొప్ప చేసుకున్నాడు. తరువాత బయలు దేవుణ్ణి బట్టి అపరాధియై అతడు నాశనమయ్యాడు.
從前厄弗辣因一發言,令人害怕,他原是以色列中的首領;但後來他因巴耳而犯罪,至於滅亡。
2 ౨ ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.
如今他們仍舊犯罪,用銀子為自己鑄神像,按照他們的幻想製造偶像;這一切只是匠人的作品,他們反說:「應向他們獻祭! 各人就口親牛犢。
3 ౩ కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా, పెందలకడ ఆరిపోయే ప్రాతఃకాలపు మంచులాగా ఉంటారు. కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా, పొగ గొట్టంలో గుండా వెళ్ళిపోయే పొగలాగా ఉంటారు.
因此,他們將如黎明的雲霧,如易逝的朝霞,如禾場上被風捲去的糠秕,如由窗口冒出的煙氣
4 ౪ మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప నీవు ఏ దేవుడినీ గుర్తించ కూడదు. నేను తప్ప వేరే రక్షకుడు లేడు.
從在埃及地時,我就是上主,你們的天主;除我以外,你們不可認識其他的神;除我以外,別無拯救者。
5 ౫ మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే.
我在曠野中──在乾旱之地──牧放了你。
6 ౬ తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు.
我牧養了他們,使他們得以飽食;但飽食之後,他們便心高氣傲,反而忘卻了我。
7 ౭ కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనయ్యాను. చిరుత పులి దారిలో పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకోవడానికి పొంచి ఉంటాను.
所以我對他們像一隻獅子,像一頭豹子,伏在路旁,窺伺他們;
8 ౮ పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను. క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను.
像一隻失掉幼子的母熊衝向他們,撕破他們胸內的心,好叫野狗在那裏舌食他們,野獸撕裂他們。
9 ౯ ఇశ్రాయేలూ, నీ మీదికి వచ్చి పడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు.
以色列! 我要摧毀你,有誰能援助你﹖
10 ౧౦ నీ రాజు ఏడి? నీ పట్టణాల్లో నీకు సహాయం చేయకుండ నీ రాజు ఏమైపోయాడు? “రాజును అధిపతులను నా మీద నియమించు” అని నీవు మనవి చేశావు గదా?
你的君王在哪裏﹖讓他來拯救你! 你所有的領袖在哪裏﹖叫他們來保護你! 因為你曾說:「請你賜給我君王和領袖! 」
11 ౧౧ కోపంతో నీకు రాజును నియమించాను. క్రోధంతో అతణ్ణి తీసి పారేశాను.
我在憤怒中給了你君王,我也要在盛怒中,再將他除去。
12 ౧౨ ఎఫ్రాయిము దోషం పోగుపడింది. అతని పాపం పోగుపడింది.
厄弗辣因的邪惡已被封存,他的罪孽已被貯藏。
13 ౧౩ ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన కలుగుతుంది. ప్రసవం సమయంలో బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు.
分娩的劇痛將臨到他身上,可是胎兒是一個愚蠢的孩子,雖然時候到了,他仍不願脫離母胎。
14 ౧౪ అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా? మృత్యువు నుండి వారిని రక్షిస్తానా? ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా. పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా. నాకు కనికరం పుట్టదు. (Sheol )
我要解救他們脫離死亡嗎﹖死亡啊! 你的災害在哪裏﹖陰府啊! 你的毀滅在哪裏﹖憐憫已由我的眼前隱蔽了。 (Sheol )
15 ౧౫ ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా, తూర్పు గాలి వస్తుంది. యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి. ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి. అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు.
他在蘆葦中雖長的茂盛,但必有東風吹來:上主的風必由曠野吹來,使他的泉源乾涸。他必掠去他所貯藏的一切寶物。
16 ౧౬ షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక, ప్రజలు కత్తివాత కూలుతారు. వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు.
撒馬利亞必要承當罪罰,因為她背叛了自己的天主;她的居民必喪身刀下,他們的嬰兒必被摔死,他們的孕婦必被剖腹。