< హొషేయ 12 >
1 ౧ ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. తూర్పు గాలి వెంట పరిగెడుతున్నాడు. మానక అబద్ధమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు. ప్రజలు అష్షూరీయులతో సంధి చేస్తారు. ఐగుప్తునకు ఒలీవనూనె పంపిస్తారు.
Јефрем се храни ветром, и иде за устоком; сваки дан множи лаж и погибао; и хватају веру с Асирцем и носе уље у Мисир.
2 ౨ యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు. యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు.
И с Јудом има Господ парбу и походиће Јакова према путевима његовим, платиће му по делима његовим.
3 ౩ తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు.
У утроби ухвати за пету брата свог, и у сили својој бори се с Богом;
4 ౪ అతడు దూతతో పోరాడి గెలిచాడు. అతడు కన్నీటితో అతని అనుగ్రహానికై బతిమాలాడు. బేతేలులో అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ ఆయన అతనితో మాట్లాడాడు.
Бори се с анђелом, и надјача; плака, и моли Му се; нађе Га у Ветиљу, и онде говори с нама.
5 ౫ ఈయన యెహోవా, సేనల ప్రభువు. “యెహోవా” అని ఆయన్ను పిలవాలి.
Али је Господ Бог над војскама, Господ му је спомен.
6 ౬ కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి. నిబంధన నమ్మకత్వాన్ని, న్యాయాన్ని అనుసరించు. నీ దేవుని కోసం ఎడతెగక కనిపెట్టు.
Ти дакле обрати се к Богу свом, чувај милост и правду, и уздај се вазда у Бога свог.
7 ౭ కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు. దగా చెయ్యడమే వారికి ఇష్టం.
Трговац је Јефрем, у руци су му мерила лажна, мило му је да чини криво.
8 ౮ “నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది. నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టీ శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు” అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు.
И говори Јефрем: Баш се обогатих, стекох благо, ни у коме труду мом неће ми наћи неправде која би била грех.
9 ౯ “అయితే ఐగుప్తుదేశంలో నుండి మీరు వచ్చినది మొదలు యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. నియామక దినాల్లో మీరు డేరాల్లో కాపురమున్నట్టు నేను మళ్లీ మిమ్మల్ని డేరాల్లో నివసింపజేస్తాను.
А ја сам Господ Бог твој од земље мисирске, још ћу ти дати да седиш у шаторима као о празницима.
10 ౧౦ ప్రవక్తలతో నేను మాటలాడాను. విస్తారమైన దర్శనాలు నేనిచ్చాను. ఉపమానరీతిగా అనేకసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాను.
И говорићу преко пророка, и умножићу утваре, и даваћу причу преко пророка.
11 ౧౧ గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే, అక్కడి ప్రజలు పనికిమాలిన వారు. గిల్గాలులో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు దున్నిన చేని చాళ్ళపై ఉన్న రాళ్లకుప్పల్లాగా ఉన్నాయి.
Доиста је Галад безакоње, посташе сама таштина; у Галгалу приносе јунце на жртву, и олтари су им као гомиле камења по браздама на њиви мојој.
12 ౧౨ యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్లిపోయాడు. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాడు. భార్య కావాలని అతడు గొర్రెలు కాచాడు.
И Јаков побеже у земљу сирску, и Израиљ служи за жену, и за жену чува овце.
13 ౧౩ ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు. ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు.
И пророком изведе Господ Израиља из Мисира, и пророком чува га.
14 ౧౪ ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు. కాబట్టి అతని యజమాని అతని మీద రక్తాపరాధం మోపుతాడు. అతని సిగ్గులేని పనులను బట్టి అతన్ని అవమానపరుస్తాను.”
Јефрем Га љуто разгневи; зато ће оставити на њему крв његову, и вратиће му срамоту његову Господ његов.