< హొషేయ 10 >

1 ఇశ్రాయేలు గుబురుగా పెరిగిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారి ఫలం విరగ గాసింది. ఫలించినకొద్దీ వారు బలిపీఠాలను మరి ఎక్కువగా కట్టుకున్నారు. తమ భూమి సారవంతమైన కొద్దీ, వారు తమ దేవతా స్థంభాలను మరి విశేషంగా నిర్మించారు.
Ізра́їль — буйни́й виноград, що родить подібне собі. Та за многістю пло́ду свого він намно́жує же́ртівники, за добрістю кра́ю свого́ бовва́нські стовпи́ прикраша́є.
2 వారి హృదయం కపటమైనది, వారు త్వరలోనే తమ అపరాధానికి శిక్ష పొందుతారు. యెహోవా వారి బలిపీఠాలను కూల్చేస్తాడు. వారి దేవతా స్థంభాలను ధ్వంసం చేస్తాడు.
Облу́дне їхнє серце, тому винні тепер вони бу́дуть, Він їхні же́ртівники пони́щить поруйнує стовпи́ їхні.
3 వాళ్ళిలా అంటారు. “మనకు రాజు లేడు, మనం యెహోవాకు భయపడం. రాజు మనకేమి చేస్తాడు?”
Бо тепер вони кажуть: Нема в нас царя, бо ми не боялися Господа, а цар що́ нам зробить?
4 వారు శుష్కప్రియాలు వల్లిస్తారు. అబద్ధ ప్రమాణాలతో ఒప్పందాలు చేస్తారు. అందువలన నాగటి చాళ్లలో విషపు మొక్కలాగా దేశంలో వారి తీర్పులు మొలుస్తున్నాయి.
Говорять порожні слова́, кляну́ться фальши́во, коли́ заповіта склада́ють, і на грядка́х польови́х цвіте їхнє правосу́ддя, немов той поли́н.
5 బేతావెనులో ఉన్న దూడల విషయమై దాని ప్రజలు భయపడతారు. దాని వైభవం పోయిందని ప్రజలు, సంతోష పడుతూ వచ్చిన దాని అర్చకులు దుఃఖిస్తారు.
За телят Бет-Авену бояться мешка́нці Самарії, бо в жало́бі опини́вся через нього наро́д його, а жерці́ будуть плакати над ним, за славу його, що пішла на вигна́ння від нього.
6 వారు గొప్ప రాజుకు కానుకగా అష్షూరు దేశంలోకి బందీలుగా వెళ్ళిపోతారు. ఎఫ్రాయిము అవమానం పాలవుతుంది. ఇశ్రాయేలు వారు విగ్రహాల మాటలు విన్నందుకు సిగ్గు పడతారు.
Запрова́джений буде і він в Асирі́ю царе́ві великому в дар. Прийме сором Єфрем, і посоро́млений буде Ізраїль за раду свою.
7 షోమ్రోను రాజు నాశనమైపోతాడు. నీళ్లలో కొట్టుకు పోయే పుడకలాగా ఉంటాడు.
Самарі́я загине; її цар — немов трі́ска ота́ на пове́рхні води!
8 ఇశ్రాయేలు వారి పాపానికి ప్రతిరూపాలైన ఆవెనులోని ఎత్తయిన పూజా స్థలాలు నాశనం అవుతాయి. వారి బలిపీఠాల మీద ముళ్ళ కంప పెరుగుతుంది. పర్వతాలతో “మమ్మల్ని కప్పండి” అనీ, కొండలను చూసి “మా మీద పడండి” అనీ వారు చెబుతారు.
І поруйно́вані бу́дуть висо́ти Авена, Ізраїлів гріх, терни́на й будя́ччя зросте на їхніх же́ртівниках, і до гір вони скажуть: „Накрийте ви нас!“а до взгі́р'їв: „На нас упаді́ть!“
9 ఇశ్రాయేలూ, గిబియా దినాల నుండి నీవు పాపం చేస్తూ వచ్చావు. వారు అక్కడ ఉండిపోయారు. గిబియాలో ఉన్న దుర్మార్గుల మీదికి యుద్ధం ముంచుకు రాలేదా?
Від днів Ґів'ї́ грішив ти, Ізраїлю! Там вони полишились були́, — чи ж їх не дося́гне в Ґів'ї́ війна проти синів беззако́нних?
10 ౧౦ నేను అనుకున్నప్పుడు వారిని శిక్షిస్తాను. వారు చేసిన రెండింతల దోషక్రియలకు నేను వారిని బంధించినప్పుడు, అన్యప్రజలు సమకూడి వారి మీదికి వస్తారు.
За жада́нням Своїм покараю Я їх, і зберуться наро́ди на них, і пока́рані будуть вони за подві́йні провини свої.
11 ౧౧ ఎఫ్రాయిము కంకులు నూర్చడంలో నైపుణ్యం సంపాదించిన పెయ్య. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కడతాను. ఎఫ్రాయిము పొలం దున్నుతాడు. యూదా భూమిని దున్నుతాడు. యాకోబు దాన్ని చదును చేస్తాడు.
А Єфрем — це привче́на телиця, що звикла вона молоти́ти, Сам ярмо́ накладу́ на її товсту шию, запряжу́ Я Єфрема, Юда буде орати, Яків буде собі скороди́ти.
12 ౧౨ మీ కోసం నీతి విత్తనం వేయండి. నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి. ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ, యెహోవాను వెదకడానికి ఇదే అదను.
Сійте собі на справедливість, за ми́лістю жніть, орі́те собі перелі́г, бо час наверну́тись до Господа, ще поки Він при́йде і правду лине́ вам доще́м.
13 ౧౩ నీవు దుర్మార్గం అనే పంటకోసం దుక్కి దున్నావు. పాపమనే కోత కోసుకున్నావు. ఎందుకంటే నీ పథకాలపై ఆధారపడ్డావు. నీకున్న అసంఖ్యాకమైన సైనికులను నమ్ముకున్నావు.
Ви беззако́ння ора́ли, — пожа́ли ви кривду, плід брехні спожива́ли, бо наді́явся ти на дорогу свою́, на многість лица́рства свого́.
14 ౧౪ నీ ప్రజల మధ్య అల్లరి రేగుతుంది. ప్రాకారాలు గల నీ పట్టణాలన్నీ పాడైపోతాయి. షల్మాను రాజు యుద్ధం చేసి బేతర్బేలును పాడు చేసినట్టు అది ఉంటుంది. పిల్లలతో సహా తల్లులను నేలకేసి కొట్టి చంపినట్టు అది ఉంటుంది.
І станеться шум по наро́дах твоїх, і всі твердині твої поруйно́вані бу́дуть, як Шалма́н зруйнував Вет-Арбе́л в час війни, — була мати з синами убита.
15 ౧౫ ఇలా మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలూ, నీకు నాశనం ప్రాప్తిస్తుంది. ప్రాతఃకాలాన ఇశ్రాయేలు రాజును పూర్తిగా నిర్మూలం చేస్తారు.
Отак вам учинить Бет-Ел за зло вашого зла, — конче згине Ізраїлів цар на світа́нку!

< హొషేయ 10 >