< హెబ్రీయులకు 5 >

1 దేవునికి సంబంధించిన పనులు చేయడానికీ, ప్రజల పక్షంగా వారి పాపాల కోసం అర్పణలనూ, బలులనూ అర్పించడానికీ, ప్రతి ప్రధాన యాజకుడి నియామకమూ ప్రజల్లో నుండే జరుగుతుంది.
yaH kazcit mahAyAjakO bhavati sa mAnavAnAM madhyAt nItaH san mAnavAnAM kRta IzvarOddEzyaviSayE'rthata upahArANAM pApArthakabalInAnjca dAna niyujyatE|
2 అతడు అజ్ఞానుల విషయంలోనూ, దారి తప్పిన వారి విషయంలోనూ సానుభూతి చూపుతాడు. ఎందుకంటే అతణ్ణి కూడా అలాంటి బలహీనతలు చుట్టుముట్టి ఉంటాయి గనక
sa cAjnjAnAM bhrAntAnAnjca lOkAnAM duHkhEna duHkhI bhavituM zaknOti, yatO hEtOH sa svayamapi daurbbalyavESTitO bhavati|
3 ఆ బలహీనతల కారణంగా ప్రజల పాపాల కోసం ఎలా అర్పణలు అర్పిస్తున్నాడో అలాగే తన కోసం కూడా అర్పించాల్సి ఉంటుంది.
EtasmAt kAraNAcca yadvat lOkAnAM kRtE tadvad AtmakRtE'pi pApArthakabalidAnaM tEna karttavyaM|
4 ఈ గొప్పదనాన్ని ఎవరూ తమకు తామే ఆపాదించుకునే వీలు లేదు. అహరోనుకు ఉన్నట్టుగా దీనికి దేవుని ప్రత్యేక పిలుపు ఉండాలి.
sa ghOccapadaH svEcchAtaH kEnApi na gRhyatE kintu hArONa iva ya IzvarENAhUyatE tEnaiva gRhyatE|
5 అలానే క్రీస్తు కూడా ప్రధాన యాజకుని స్థానానికి తనను తానే హెచ్చించుకోలేదు గానీ దేవుడే ఆయనతో ఇలా అన్నాడు. “నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.”
EvamprakArENa khrISTO'pi mahAyAjakatvaM grahItuM svIyagauravaM svayaM na kRtavAn, kintu "madIyatanayO'si tvam adyaiva janitO mayEti" vAcaM yastaM bhASitavAn sa Eva tasya gauravaM kRtavAn|
6 అలాగే మరొక చోట ఆయన, “నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి” అన్నాడు. (aiōn g165)
tadvad anyagItE'pIdamuktaM, tvaM malkISEdakaH zrENyAM yAjakO'si sadAtanaH| (aiōn g165)
7 ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలూ, మనవులూ చేస్తూ కన్నీళ్ళతో మొర్ర పెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజ్యభావం వల్ల దేవుడు వాటిని ఆలకించాడు.
sa ca dEhavAsakAlE bahukrandanEnAzrupAtEna ca mRtyuta uddharaNE samarthasya pituH samIpE punaH punarvinatiM prarthanAnjca kRtvA tatphalarUpiNIM zagkAtO rakSAM prApya ca
8 ఆయన కుమారుడై ఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకున్నాడు.
yadyapi putrO'bhavat tathApi yairaklizyata tairAjnjAgrahaNam azikSata|
9 మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించాడు.
itthaM siddhIbhUya nijAjnjAgrAhiNAM sarvvESAm anantaparitrANasya kAraNasvarUpO 'bhavat| (aiōnios g166)
10 ౧౦ ఈ విధంగా ఆయన పరిపూర్ణుడయ్యాడు, తనకు విధేయులైన వారందరి శాశ్వత రక్షణకు కారణమయ్యాడు. (aiōnios g166)
tasmAt sa malkISEdakaH zrENIbhuktO mahAyAjaka IzvarENAkhyAtaH|
11 ౧౧ దీన్ని గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది. అయితే వినడంలో మందకొడిగా ఉంటారు గనక మీకు వివరించడం కష్టం.
tamadhyasmAkaM bahukathAH kathayitavyAH kintu tAH stabdhakarNai ryuSmAbhi rdurgamyAH|
12 ౧౨ ఈపాటికల్లా మీరు బోధకులుగా ఉండవలసింది కానీ దేవుని మాటల్లోని ప్రాథమిక సూత్రాలను మరొకడు ఇంకా మీకు బోధించాల్సి వస్తున్నది. మీరింకా పాలు తాగే దశలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే శక్తి మీకు లేదు.
yatO yUyaM yadyapi samayasya dIrghatvAt zikSakA bhavitum azakSyata tathApIzvarasya vAkyAnAM yA prathamA varNamAlA tAmadhi zikSAprApti ryuSmAkaM punarAvazyakA bhavati, tathA kaThinadravyE nahi kintu dugdhE yuSmAkaM prayOjanam AstE|
13 ౧౩ కేవలం పాలు మాత్రమే తాగే ప్రతివాడూ పసివాడే కాబట్టి నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేని వాడుగా ఉన్నాడు.
yO dugdhapAyI sa zizurEvEtikAraNAt dharmmavAkyE tatparO nAsti|
14 ౧౪ దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.
kintu sadasadvicArE yESAM cEtAMsi vyavahArENa zikSitAni tAdRzAnAM siddhalOkAnAM kaThOradravyESu prayOjanamasti|

< హెబ్రీయులకు 5 >