< హెబ్రీయులకు 4 >
1 ౧ అందుచేత, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం’ అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే, మీలో ఎవరికైనా ఆ వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి.
Portanto, vamos cuidar para garantir que, embora Deus tenha nos prometido entrar em seu descanso, nenhum de nós fique de fora!
2 ౨ విశ్రాంతిని గూర్చిన సువార్త ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టే మనకూ ప్రకటించడం జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది.
Pois nós ouvimos as boas novas exatamente como eles, mas isso não os ajudou, porque eles não aceitaram e não tiverem fé no que ouviram.
3 ౩ అయితే విశ్వసించిన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశించేది. రాసి ఉన్న దాని ప్రకారం లోకం ఆరంభం నుండి తన సృష్టి కార్యమంతా ముగిసినా ఆయన, “నేను నా తీవ్ర ఆగ్రహంతో శపథం చేశాను. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు.
No entanto, aqueles entre nós que creem em Deus entraram nesse descanso mencionado por Deus, quando ele disse: “Então, por causa da minha decepção, eu jurei que: ‘Eles não entrarão no meu descanso.’” Ele disse isso, embora os planos de Deus já tivessem sido concluídos quando Ele criou o mundo.
4 ౪ మరో చోట ఏడవ దినం గూర్చి చెబుతూ, “దేవుడు ఏడవ రోజు తన పనులన్నీ ముగించి, విశ్రాంతి తీసుకున్నాడు” అన్నాడు.
Com relação ao sétimo dia, há uma passagem nas Sagradas Escrituras que diz: “No sétimo dia, Deus descansou de todo o trabalho que havia feito.”
5 ౫ మళ్లీ “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అని చెప్పాడు.
E outra passagem afirma: “Eles não entrarão no meu descanso.”
6 ౬ దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది స్పష్టం. కాబట్టి, ఎవరికైతే సువార్త ముందుగా ప్రకటించబడిందో వారు తమ అవిధేయత కారణంగా దానిలో ప్రవేశించలేక పోయారు.
O descanso de Deus continua lá para que alguns entrem, mesmo que antes outros tenham ouvido as boas novas e tenham fracassado em entrar, por causa da desobediência deles.
7 ౭ కాబట్టి దేవుడు, “ఈ దినం” అనే ఒక ప్రత్యేక దినాన్ని నిర్ణయించాడు. మొదట దీన్ని గూర్చిన ప్రస్తావన జరిగిన చాలా కాలానికి, తిరిగి దావీదు ద్వారా ఆయన మాట్లాడినప్పుడు, ఆయన ఇలా అన్నాడు, “మీరు మీ హృదయాలను కఠినపరచుకోకుండా నేడు ఆయన స్వరం వింటే మేలు.”
Então, Deus novamente determina um outro dia, chamado “hoje.” E ele falou sobre isso muito tempo depois, por meio de Davi, conforme já havia dito antes: “Hoje, se vocês ouvirem o que Deus está dizendo, não tenham uma atitude teimosa.”
8 ౮ ఒక వేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక రోజు గూర్చి చెప్పేవాడు కాదు.
Pois se Josué tivesse sido capaz de dar ao povo esse descanso, Deus não teria falado, tempos depois, a respeito de outro dia.
9 ౯ కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది.
E, assim, resta um repouso para o povo de Deus, como o descanso de Deus no sétimo dia.
10 ౧౦ ఎందుకంటే దేవుడు తన పనులన్నీ చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నట్లే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన పనులన్నీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు.
Pois, quem entrar no descanso de Deus também descansará de tudo o que estiver fazendo, exatamente como Deus fez.
11 ౧౧ కాబట్టి, వారిలా అవిధేయతలో పడిపోకుండా, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆత్రుత పడదాం.
Assim, devemos nos esforçar para entrar nesse descanso. Então, que ninguém falhe, ao seguir o mesmo exemplo péssimo de desobediência.
12 ౧౨ ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు.
Pois a palavra de Deus é viva e poderosa, é mais afiada do que uma espada de corte duplo. Ela penetra até ao ponto de separar vida e respiração, indo ao íntimo das pessoas, e pode julgar tanto os pensamentos quanto as intenções do coração.
13 ౧౩ సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.
Nenhum ser vivo consegue se esconder de Deus; tudo está exposto e é visível para Aquele a quem devemos prestar contas.
14 ౧౪ ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం.
Por termos um grande sacerdote tão esplêndido na pessoa de Jesus, o Filho de Deus, aquele que subiu aos céus, devemos garantir que continuaremos firmes no que cremos.
15 ౧౫ మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు.
Pois o nosso grande sacerdote não é do tipo que não se compadece das nossas fraquezas. Muito pelo contrário! Ele é aquele que foi tentado de todas as maneiras, como nós também somos, mas que se recusou a pecar.
16 ౧౬ కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.
Então, devemos prosseguir, cheios de confiança, e chegarmos diante de Deus, em seu trono de graça, para que possamos receber sua misericórdia e descobrir a bênção que nos ajudará, quando realmente necessitarmos.