< హెబ్రీయులకు 3 >
1 ౧ కాబట్టి, పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపొస్తలుడూ, ప్రధాన యాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి.
Зато, браћо света, заједничари звања небеског, познајте посланика и владику, ког ми признајемо, Исуса Христа,
2 ౨ దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
Који је веран Ономе који га створи, као и Мојсије у свему дому његовом.
3 ౩ మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం.
Јер Овај поста толико достојан веће части од Мојсија, колико већу од дома част има онај који га је начинио.
4 ౪ ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే.
Јер сваки дом треба неко да начини; а ко је све створио оно је Бог.
5 ౫ దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు.
И Мојсије дакле беше веран у свему дому његовом, као слуга, за сведочанство оног што је требало да се говори.
6 ౬ కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు.
Али је Христос као син у дому свом: ког смо дом ми, ако слободу и славу наде до краја тврдо одржимо.
7 ౭ కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే
Зато, као што говори Дух Свети: Данас ако глас Његов чујете,
8 ౮ అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.
Не будите дрвенастих срца, као кад се прогневисте у дане напасти у пустињи,
9 ౯ నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు.
Где ме искушаше очеви ваши, искушаше ме, и гледаше дела моја четрдесет година.
10 ౧౦ కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను. కాబట్టి నేను కోపంతో ‘వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు.
Тога ради расрдих се на тај род, и рекох: Једнако се мету у срцима, али они не познаше путеве моје;
11 ౧౧ వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని కోపంగా శపథం చేశాను.”
Зато се заклех у гневу свом да неће ући у покој мој.
12 ౧౨ సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి.
Гледајте, браћо, да не буде кад у коме од вас зло срце неверства да одступи од Бога Живога;
13 ౧౩ పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.
Него се утешавајте сваки дан, докле се данас говори, да који од вас не одрвени од преваре греховне;
14 ౧౪ ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకూ ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.
Јер постадосмо заједничари Христу, само ако како смо почели у Њему бити до краја тврдо одржимо;
15 ౧౫ దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు. “ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.”
Докле се говори: Данас, ако глас Његов чујете, не будите дрвенастих срца, као кад се прогневисте.
16 ౧౬ దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? మోషే ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన వారే కదా!
Јер неки чувши прогневише се, али не сви који изиђоше из Мисира с Мојсијем.
17 ౧౭ దేవుడు నలభై ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా! వారి మృతదేహాలు అరణ్యంలో రాలి పోయాయి.
А на које мрзи четрдесет година? Није ли на оне који сагрешише, који оставише кости у пустињи?
18 ౧౮ తనకు అవిధేయులైన వారిని గూర్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు?
А којима се закле да неће ући у покој Његов, него онима који не хтеше да верују?
19 ౧౯ దీన్నిబట్టి, అవిశ్వాసం మూలానే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేక పోయారని మనం చూశాము.
И видимо да не могоше ући за неверство.