< హెబ్రీయులకు 3 >

1 కాబట్టి, పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపొస్తలుడూ, ప్రధాన యాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి.
Annakokáért szent atyafiak, mennyei elhívásnak részesei, figyelmezzetek, a mi vallásunknak apostolára és főpapjára, Krisztus Jézusra,
2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
A ki hű ahhoz, a ki őt rendelte, valamint Mózes is az ő egész házában.
3 మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం.
Mert ez nagyobb dicsőségre méltattatott, mint Mózes, a mennyiben a ház építőjének nagyobb a tisztessége, mint a háznak.
4 ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే.
Mert minden háznak van építője, a ki pedig mindent elkészített, az Isten az.
5 దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు.
Mózes is hű volt ugyan az ő egész házában, mint szolga, a hirdetendőknek bizonyságára,
6 కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు.
Krisztus ellenben mint Fiú a maga háza felett, a kinek háza mi vagyunk, ha a bizodalmat és a reménységnek dicsekedését mind végig erősen megtartjuk.
7 కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే
Annakokáért a mint a Szent Lélek mondja: Ma, ha az ő szavát halljátok,
8 అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.
Meg ne keményítsétek a ti szíveteket, mint az elkeseredéskor, a kísértés ama napján a pusztában,
9 నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు.
A hol a ti atyáitok próbára tevéssel megkísértének engem és látták az én cselekedeteimet negyven esztendeig.
10 ౧౦ కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను. కాబట్టి నేను కోపంతో ‘వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు.
Azért megharagudtam arra a nemzetségre és mondám: mindig tévelyegnek szivökben; ők pedig nem ismerték meg az én útaimat.
11 ౧౧ వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని కోపంగా శపథం చేశాను.”
Úgy hogy megesküdtem haragomban, hogy nem fognak bemenni az én nyugodalmamba.
12 ౧౨ సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి.
Vigyázzatok atyámfiai, hogy valaha ne legyen bármelyikőtöknek hitetlen gonosz szíve, hogy az élő Istentől elszakadjon;
13 ౧౩ పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.
Hanem intsétek egymást minden napon, míg tart a ma, hogy egyikőtök se keményíttessék meg a bűnnek csalárdsága által:
14 ౧౪ ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకూ ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.
Mert részeseivé lettünk Krisztusnak, ha ugyan az elkezdett bizodalmat mindvégig erősen megtartjuk.
15 ౧౫ దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు. “ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.”
E mondás szerint: Ma, ha az ő szavát halljátok, meg ne keményítsétek a ti szíveiteket, mint az elkeseredéskor.
16 ౧౬ దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? మోషే ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన వారే కదా!
Mert kik keseredtek el, mikor ezt hallák? Nemde mindazok, a kik kijövének Égyiptomból Mózes által?
17 ౧౭ దేవుడు నలభై ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా! వారి మృతదేహాలు అరణ్యంలో రాలి పోయాయి.
Kikre haragudott vala pedig meg negyven esztendeig? avagy nem azokra-é, a kik vétkeztek, a kiknek testei elhullottak a pusztában?
18 ౧౮ తనకు అవిధేయులైన వారిని గూర్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు?
Kiknek esküdött pedig meg, hogy nem mennek be az ő nyugodalmába, hanemha az engedetleneknek?
19 ౧౯ దీన్నిబట్టి, అవిశ్వాసం మూలానే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేక పోయారని మనం చూశాము.
Látjuk is, hogy nem mehettek be hitetlenség miatt.

< హెబ్రీయులకు 3 >