< హెబ్రీయులకు 13 >

1 సోదర ప్రేమను కొనసాగనియ్యండి.
Братня любов нехай пробував.
2 అపరిచితులను ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతలను ఆహ్వానించారు.
Гостинности не забувайте, через се бо инші, не відаючи, вгостили ангелів.
3 మీరు కూడా వారితో చెరసాల్లో ఉన్నట్టు చెరసాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనక కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి.
Памятайте вязників, мов би з ними ви увязнені, бідолашних, самі бувши в тїлї.
4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.
Чесна женитва у всіх і ложе непорочне; блудників же і перелюбників судити ме Бог
5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు.
Не сріблолюбиві обичаєм, довольні тим, що єсть. Сам бо рече. "Не оставлю тебе, анї покину тебе."
6 కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.
Так що сьміло можемо сказати: "Господь моя поміч; не бояти мусь: що вдіє мені чоловік?"
7 మీకు దేవుని మాటలు చెప్పిన వారిని మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి.
Поминайте наставників ваших, що гдаголали вам слово Боже; і позираючи на конець їх життя, послїдуйте вірі їх.
8 యేసు క్రీస్తు నిన్న, నేడు ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. (aiōn g165)
Ісус Христос учора і сьогоднї, той же самий і на віки. (aiōn g165)
9 అనేక రకాలైన కొత్త బోధలకు తిరిగిపోకండి. దైవకృపతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారనియమాలతో కాదు. వాటి ప్రకారం ప్రవర్తించిన వారికి వాటివల్ల ఏ ప్రయోజనం కలగదు.
У всякі чужі науки не вдавайтесь. Добре бо благодаттю покріпляти серця, а не їжами, з котрих не мали користи ті, що пішли за ними.
10 ౧౦ మనకు ఒక బలిపీఠం ఉంది. గుడారంలో సేవ చేసే వారికి దానిపై నుండి ఏదీ తినడానికి అధికారం లేదు.
Маємо жертівню, з котрої не мають права їсти, хто служить скинї.
11 ౧౧ ఎందుకంటే పాప పరిహార బలి అయిన జంతువుల రక్తం మాత్రమే ప్రధాన యాజకుడి ద్వారా పరిశుద్ధ స్థలానికి వస్తుంది. వాటి కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు.
Которих бо животних кров уносить в сьвятиню архиєрей за гріхи, тих мясо палить ся осторонь стану.
12 ౧౨ కాబట్టి యేసు కూడా ప్రజలను తన రక్తం ద్వారా శుద్ధీకరించడానికి నగరద్వారం బయట హింసలు పొందాడు.
Тим і Ісус, щоб осьвятити людей своєю кровю, осторонь воріт пострадав.
13 ౧౩ కాబట్టి మనం ఆయన అపనిందను భరిస్తూ శిబిరం బయటకు ఆయన దగ్గరికి వెళ్దాం.
Тим же опе вийдімо до Нього осторонь стану, дізнаючи наруги Його.
14 ౧౪ ఎలాంటి నిత్యమైన పట్టణమూ ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం.
Не маємо бо тут сталого города, а того, що буде, шукаємо.
15 ౧౫ యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం.
Тим оце через Нього приносьмо жертву хвалення без перестанку Богу, се єсть уст, що визнають імя Його.
16 ౧౬ ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.
Благотворення ж і подїльчивости не забувайте; такими бо жертвами вельми догоджують Богу.
17 ౧౭ మీ నాయకులకు విధేయులుగా ఉండండి. వారికి లోబడి ఉండండి. ఎందుకంటే వారు లెక్క అప్పజెప్పే వారిలా మీ ఆత్మల క్షేమం కోసం కావలివారుగా ఉన్నారు. మీ గురించి వారు విచారంతో కాకుండా సంతోషంగా కావలి కాసేవారుగా ఉండడానికి వారికి లోబడండి. వారు విచారంగా ఉండడం మీకు మేలుకరం కాదు.
Слухайте наставників ваших і коріть ся (їм); вони бо пильнують душ ваших, яко мають перелік оддати; щоб з радістю се робили, а не зітхаючи; не користь бо вам се.
18 ౧౮ అన్ని విషయాల్లో యోగ్యంగా జీవించాలనే మంచి మనస్సాక్షి మాకుందని నమ్ముతున్నాం. మా కోసం ప్రార్ధించండి.
Моліте ся за нас: уповаємо бо, що добру совість маємо, у всьому хотячи добре жити.
19 ౧౯ మీ దగ్గరికి త్వరలో తిరిగి రాగలిగేలా మరింత ప్రార్థించాలని కోరుతున్నాను.
Найбільше ж благаю се чинити, що б скоро вернено мене вам.
20 ౨౦ గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపిన శాంతి ప్రదాత అయిన దేవుడు (aiōnios g166)
Бог же впокою, що підняв з мертвих великого Пастиря вівцям через кров завіту вічнього, Господа нашого Ісуса Христа, (aiōnios g166)
21 ౨౧ ప్రతి మంచి విషయంలో తన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు గాక! తన దృష్టిలో ప్రీతికరమైన దాన్ని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగిస్తూ ఉంటాడు గాక! ఆ యేసు క్రీస్తుకు ఎప్పటికీ కీర్తి యశస్సులు కలుగుతాయి. ఆమెన్. (aiōn g165)
нехай звершить вас у всякому доброму ділі, щоб чинили волю Його, роблячи в вас любе перед Ним, через Ісуса Христа, котрому слава до віку вічнього. Амінь. (aiōn g165)
22 ౨౨ సోదరులారా మీకు సంక్షిప్తంగా రాసిన ఈ ప్రోత్సాహవాక్కును సహించమని కోరుతున్నాను.
Благаю ж вас, браттє, прийміте се слово напомину: бо коротко написав вам.
23 ౨౩ మన సోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరగా వస్తే అతనితో కలసి మిమ్మల్ని చూస్తాను.
Знайте, що брата нашого Тимотея випущено, з котрим, воли скоро прийде, побачу вас.
24 ౨౪ మీ అధికారులందరికీ పరిశుద్ధులందరికీ అభివందనాలు తెలియజేయండి. ఇటలీలో ఉన్నవారు మీకు అభివందనాలు చెబుతున్నారు.
Витайте всіх наставників ваших і всіх сьвятих. Витають вас ті, що з Італиї.
25 ౨౫ మీకందరికీ కృప తోడై ఉండు గాక.
Благодать з усіма вами. Амінь.

< హెబ్రీయులకు 13 >