< హెబ్రీయులకు 12 >

1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం.
Therefore, since we have such a great cloud of witnesses surrounding us, let us lay aside every weight and the sin that so easily entangles us, and let us run with endurance the race that lies before us,
2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.
fixing our eyes upon Jesus, the author and perfecter of our faith. For the joy set before him he endured the cross, disregarding its shame, and sat down at the right hand of the throne of God.
3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.
Consider him who endured such opposition from sinners against himself, so that you will not grow weary or lose heart.
4 మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.
In your struggle against sin, you have not yet resisted to the point of shedding your blood.
5 కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”
And you have completely forgotten the exhortation that addresses you as sons: “My son, do not think lightly of the discipline of the Lord, and do not lose heart when he rebukes you.
6 ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు.
For the Lord disciplines the one he loves, and he punishes every son he receives.”
7 హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు.
For the sake of discipline you must endure. God is treating you as sons. For what son is not disciplined by his father?
8 కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.
If you do not experience discipline, which is something everyone receives, then you are illegitimate children and not sons.
9 ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా?
Furthermore, we have all had earthly fathers who disciplined us, and we respected them. Should we not submit even more to the Father of spirits and live?
10 ౧౦ మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.
For our fathers disciplined us for a short time as seemed best to them, but God disciplines us for our good, so that we may share in his holiness.
11 ౧౧ అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
Now no discipline seems pleasant at the time, but painful. Later on, however, it produces the peaceful fruit of righteousness for those trained by it.
12 ౧౨ కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి.
Therefore, lift up your drooping hands and strengthen your weak knees.
13 ౧౩ మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి
Make straight paths for your feet, so that what is lame may not be put out of joint but healed instead.
14 ౧౪ అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.
Pursue peace with everyone, and holiness, for without it no one will see the Lord.
15 ౧౫ దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.
Make sure no one falls short of the grace of God and that no root of bitterness springs up and causes trouble, which would result in many becoming defiled.
16 ౧౬ లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి.
And make sure there is no fornicator or profane person like Esau, who sold his birthright in exchange for a single meal.
17 ౧౭ ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.
You know that afterward, when he desired to inherit the blessing, he was rejected, for he found no opportunity for repentance, even though he sought the blessing with tears.
18 ౧౮ చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతూ ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు.
For you have not come to a mountain that can be touched, to a blazing fire, darkness, gloom, and a whirlwind.
19 ౧౯ బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏ మాటా చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు.
You have not come to a trumpet blast and a voice whose words made the hearers beg that no further word be spoken to them.
20 ౨౦ ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు: “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి” అన్నదే ఆ ఆజ్ఞ.
For they could not bear the order that was given: “If even a beast touches the mountain, it shall be stoned.”
21 ౨౧ భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే, “నేను ఎంతో భయపడి వణుకుతున్నాను” అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు.
Indeed, the sight was so terrifying that Moses said, “I am trembling with fear.”
22 ౨౨ ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు.
But you have come to Mount Zion, to the city of the living God, the heavenly Jerusalem. You have come to myriads of angels,
23 ౨౩ పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు.
to the festive gathering and assembly of the firstborn, whose names are enrolled in heaven. You have come to God, the judge of all, and to the spirits of righteous people who have been made perfect.
24 ౨౪ ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.
And you have come to Jesus, the mediator of a new covenant, and to the sprinkled blood that speaks a better word than the blood of Abel.
25 ౨౫ మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?
Be careful not to refuse him who is speaking. For if the people did not escape when they refused him who warned them on earth, how much less will we escape if we turn away from him who warns us from heaven?
26 ౨౬ ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.”
At that time his voice shook the earth, but now he has promised, “Yet once more I will shake not only the earth, but also the heavens.”
27 ౨౭ “మరోసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలేవాటిని అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది.
Now the phrase, “Yet once more,” indicates the removal of what can be shaken—that is, created things—so that what cannot be shaken may remain.
28 ౨౮ కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం.
Therefore, since we are receiving a kingdom that cannot be shaken, let us be thankful. It is by our thankfulness that we offer God acceptable worship, with reverence and godly fear.
29 ౨౯ ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.
For our God is a consuming fire.

< హెబ్రీయులకు 12 >