< హెబ్రీయులకు 10 >

1 ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది భవిష్యత్తులో కలిగే శ్రేష్ఠమైన విషయాలకు ప్రతిబింబంలా ఉంది కానీ అది వాటి నిజ స్వరూపం కాదు. యాజకులు ప్రతి సంవత్సరం అర్పించే ఒకే రకం బలుల ద్వారా ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి వచ్చే వారిని పరిపూర్ణులను చేయలేదు.
For the Law having a shadow of the good things coming—not the very image of the matters, every year, by the same sacrifices that they offer continually, is never able to make perfect those coming near,
2 ఒకవేళ అలా చేయగలిగితే ఇక ఆ బలులు అర్పించడం మానేస్తారు కదా! ఆరాధించేవారు ఒక సారంటూ శుద్ధులైతే పాపానికి గూర్చిన స్పృహ వారికిక ఉండదు కదా!
since, would they not have ceased to be offered, because of those serving having no more conscience of sins, having been purified once?
3 అయితే ఆ బలులు అర్పించడం వల్ల ప్రతి సంవత్సరం పాపాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి.
But in those [sacrifices] is a remembrance of sins every year,
4 ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం.
for it is impossible for blood of bulls and goats to take away sins.
5 క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు, “నువ్వు బలులను గానీ కానుకలను గానీ కోరుకోలేదు. కానీ నాకొక దేహాన్ని నువ్వు సిద్ధం చేసావు.
For this reason, coming into the world, He says, “Sacrifice and offering You did not will, and a body You prepared for Me;
6 దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు.
in burnt-offerings, and concerning sin-offerings, You did not delight.
7 అప్పుడు నేను నీతో ఇలా అన్నాను, ‘చూడు, నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని జరిగించడానికి నేనున్నాను.’”
Then I said, Behold, I come (in a volume of the scroll it has been written concerning Me), to do, O God, Your will”;
8 పైన చెప్పినట్టుగా ఆయన, “నువ్వు బలులను గానీ, కానుకలను గానీ దహన బలులను గానీ పాప పరిహారం కోసం చేసే బలులను గానీ కోరుకోవు, వీటిలో నీకు సంతోషం ఉండదు. ఇవి ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడేవి” అన్నాడు.
saying above, “Sacrifice, and offering, and burnt-offerings, and concerning sin-offering You did not will, nor delight in” (which are offered according to the Law),
9 ఆ తరువాత ఆయన, “చూడు, నీ ఇష్ట ప్రకారం చేయడానికి నేనున్నాను” అని చెప్పాడు. రెండవ ప్రక్రియను నెలకొల్పడానికి ఆయన మొదటి ప్రక్రియను పక్కన పెట్టేశాడు.
then He said, “Behold, I come to do, O God, Your will”; He takes away the first that He may establish the second;
10 ౧౦ ఈ రెండవ ప్రక్రియలో యేసు క్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్ట ప్రకారం మనకు శుద్ధి జరిగింది.
in which will, we have been sanctified through the offering of the body of Jesus Christ once for all,
11 ౧౧ నిజంగా ప్రతి యాజకుడూ ప్రతి రోజూ నిలబడి ఒకే విధమైన బలులు అదేపనిగా అర్పిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అవి ఎప్పటికీ పాపాలను తీసివేయలేవు.
and every priest, indeed, has daily stood serving, and offering the same sacrifices many times, that are never able to take away sins.
12 ౧౨ కానీ క్రీస్తు పాపాల కోసం శాశ్వతంగా నిలిచి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు.
But He, having offered one sacrifice for sin—to the end, sat down at the right hand of God—
13 ౧౩ తన శత్రువులు అవమానం పొంది తన కాళ్ళ కింద పీటగా మారే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు.
as to the rest, expecting until He may place His enemies [as] His footstool,
14 ౧౪ శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు.
for by one offering He has perfected to the end those being sanctified;
15 ౧౫ దీన్ని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు,
and the Holy Spirit also testifies to us, for after that He has said before,
16 ౧౬ “‘ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే’ అని ప్రభువు అంటున్నాడు. ‘నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను. వారి మనసులపై వాటిని రాస్తాను.’”
“This [is] the covenant that I will make with them after those days, says the LORD, giving My laws on their hearts, and I will write them on their minds,”
17 ౧౭ తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు.
and, “I will remember their sins and their lawlessness no more”;
18 ౧౮ ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు.
and where [there is] forgiveness of these, there is no longer offering for sin.
19 ౧౯ కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది.
Having, therefore, brothers, boldness for the entrance into the holy places, by the blood of Jesus,
20 ౨౦ తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు.
which [is] the way He initiated for us—new and living, through the veil, that is, His flesh—
21 ౨౧ దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక,
and a Great Priest over the house of God,
22 ౨౨ విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం.
may we draw near with a true heart, in full assurance of faith, having the hearts sprinkled from an evil conscience, and having the body bathed with pure water;
23 ౨౩ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.
may we hold fast the unwavering profession of the hope (for He who promised [is] faithful),
24 ౨౪ అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి.
and may we consider to provoke one another to love and to good works,
25 ౨౫ కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.
not forsaking the assembling of ourselves together, as [is] a custom of some, but exhorting, and so much the more as you see the Day coming near.
26 ౨౬ సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు.
For [if] we are sinning willingly after receiving the full knowledge of the truth—there remains no more sacrifice for sins,
27 ౨౭ కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది.
but a certain fearful looking for of judgment, and fiery zeal, about to devour the opposers;
28 ౨౮ ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు.
anyone having set aside a law of Moses dies without mercies on the basis of two or three witnesses.
29 ౨౯ ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి.
Of how much worse punishment will he be counted worthy who trampled on the Son of God, and counted the blood of the covenant a common thing, by which he was sanctified, and having insulted the Spirit of grace?
30 ౩౦ “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు.
For we have known Him who is saying, “Vengeance [is] Mine, I will repay, says the LORD”; and again, “The LORD will judge His people.”
31 ౩౧ సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం.
[It is] fearful to fall into [the] hands of [the] living God.
32 ౩౨ అయితే గతించిన రోజులను జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలుగును అనుభవించిన తరువాత ఎంత గొప్ప హింసనూ వేదననూ భరించారో జ్ఞాపకం చేసుకోండి.
But call to your remembrance the former days, in which, having been enlightened, you endured much conflict of sufferings;
33 ౩౩ హింసల, అవమానాల వల్ల మీరు బహిరంగంగా అపహాస్యానికి గురయ్యారు. మరో వైపు అలాంటి వేదన అనుభవించిన వారితో మీరు భాగస్వాములయ్యారు.
this indeed, being made spectacles with both insults and afflictions, now this, having become partners of those so living,
34 ౩౪ ఇదెలాగంటే, మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించారు. మీకు శ్రేష్ఠమైన, కలకాలం నిలిచి ఉండే సంపదలు ఉన్నాయని తెలుసుకుని మీకున్న ఆస్తిపాస్తులను ఇతరులు పట్టుకు పోతుంటే ఆనందంగా అంగీకరించారు.
for you also sympathized with my bonds, and the robbery of your goods you received with joy, knowing that you have in yourselves a better substance in the heavens, and an enduring one.
35 ౩౫ కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది.
You may not cast away, then, your boldness, which has great repayment of reward,
36 ౩౬ దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి.
for you have need of patience, that having done the will of God, you may receive the promise.
37 ౩౭ “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చేయడు.
“For yet [in] a very, very little [while], He who is coming will come, and will not linger,”
38 ౩౮ నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు. అతడు వెనక్కు మళ్ళితే అతణ్ణి గూర్చి నేను సంతోషించను.”
but, “The righteous will live by faith; and if he may draw back, My soul has no pleasure in him.”
39 ౩౯ అయితే మనం నాశనానికి పోవడానికి వెనక్కు తీసేవారం కాము. కానీ ఆత్మను కాపాడుకోడానికి కావలసిన విశ్వాసం గలవారిలో మనం ఉన్నాం.
But we are not of those drawing back to destruction, but of those believing to a preserving of soul.

< హెబ్రీయులకు 10 >