< హెబ్రీయులకు 1 >
1 ౧ పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు.
Бог који је некада много пута и различитим начином говорио очевима преко пророка,
2 ౨ ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. (aiōn )
говори и нама у последак дана ових преко сина, Ког постави наследника свему, кроз ког и свет створи. (aiōn )
3 ౩ దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.
Који будући сјајност славе и обличје бића Његовог, и носећи све у речи силе своје, учинивши собом очишћење греха наших, седе с десне стране престола величине на висини,
4 ౪ దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు.
И толико бољи поста од анђела колико преславније име од њихова доби.
5 ౫ ఎందుకంటే దేవుడు, “నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.” అని గానీ, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు” అని గానీ తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా?
Јер коме од анђела рече кад: Син мој ти си, ја те данас родих? И опет: Ја ћу Му бити Отац, и Он ће ми бити Син.
6 ౬ అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు, “దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు.
И опет уводећи Првороднога у свет говори: и да Му се поклоне сви анђели Божији.
7 ౭ తన దూతల గూర్చి చెప్పినప్పుడు ఆయన, “దేవదూతలను ఆత్మలుగానూ, తన సేవకులను అగ్ని జ్వాలలుగానూ చేసుకునేవాడు” అని చెప్పాడు.
Тако и анђелима говори: Који чини анђеле своје духове, и слуге своје пламен огњени.
8 ౮ అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు. “దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయదండం. (aiōn )
А сину: Престо је Твој, Боже, ва век века; палица је правде палица царства Твог. (aiōn )
9 ౯ నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు. కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు.
Омилела Ти је правда, и омрзао си на безакоње: тога ради помаза Те, Боже, Бог Твој уљем радости већма од другова Твојих.
10 ౧౦ ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు. నీ చేతులతోనే ఆకాశాలను చేశావు.
И опет: Ти си, Господе, у почетку основао земљу, и небеса су дела руку Твојих:
11 ౧౧ అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు. బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి.
Она ће проћи, а Ти остајеш: и сва ће остарети као хаљина,
12 ౧౨ వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు. బట్టలను మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు. కానీ నువ్వు ఒకేలా ఉంటావు. నీ సంవత్సరాలు ముగిసిపోవు.”
И савићеш их као хаљину, и измениће се: а Ти си Онај исти, и Твојих година неће нестати.
13 ౧౩ “నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో” అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా?
А коме од анђела рече кад: Седи мени с десне стране док положим непријатеље Твоје подножје ногама Твојим?
14 ౧౪ ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?
Нису ли сви службени духови који су послани на службу онима који ће наследити спасење?