< హగ్గయి 1 >
1 ౧ రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినాన ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుకు, ప్రధానయాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు.
In the second year of Darius the king, in the sixth month, on the first day of the month, the word of Yahweh came by the hand of Haggai the prophet to the governor of Judah, Zerubbabel son of Shealtiel, and to the high priest Joshua son of Jehozadak, saying,
2 ౨ “మేము కలిసి రావడానికి గానీ యెహోవా మందిరాన్ని కట్టడానికి గానీ ఇది సమయం కాదు అని ఈ ప్రజలు చెబుతున్నారు కదా.”
“Yahweh of hosts says this: These people say, 'It is not time for us to come or to build Yahweh's house.'”
3 ౩ అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గయి ప్రవక్త ద్వారా చెప్పినదేమిటంటే,
Then the word of Yahweh came by the hand of Haggai the prophet, saying,
4 ౪ “ఈ మందిరం పాడై ఉండగా మీరు కలపతో కప్పిన ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?
“Is it a time for you yourselves to live in your finished houses, while this house lies ruined?
5 ౫ కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.
So now Yahweh of hosts says this: Consider your ways!
6 ౬ మీరు ఎక్కువ విత్తనాలు చల్లినా పండింది కొంచెమే. మీరు భోజనం చేస్తున్నప్పటికీ ఆకలి తీరడం లేదు. మీరు ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ మత్తు రావడం లేదు. బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు. పనివారు కష్టపడి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది.
You have sown much seed, but bring in little harvest; you eat but do not have enough; you drink but cannot get drunk. You wear clothes but cannot warm yourselves, and the wage earner earns money only to put it into a bag full of holes!
7 ౭ కాగా సేనల ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.
Yahweh of hosts says this: “Consider your ways!
8 ౮ పర్వతాలెక్కి కలప తీసుకు వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించండి. అప్పుడు నేను ఆనందిస్తాను. నాకు ఘనత వస్తుంది” అని యెహోవా అంటున్నాడు.
Go up to the mountain, bring timber, and build my house; then I will take pleasure in it, and I will be glorified!—says Yahweh.”
9 ౯ “విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు గానీ నేను దాన్ని చెదరగొట్టినందువల్ల మీరు కొంచెమే ఇంటికి తెచ్చుకోగలిగారు. ఎందుకని? యెహోవా అడుగుతున్నాడు. ఎందుకంటే నా మందిరం పాడై ఉన్నా మీరంతా మీ చక్కని సొంత ఇళ్ళు కట్టుకుంటూ ఆనందిస్తున్నారు.
“You looked for much, but behold! you have brought little home, for I blew it away! Why?” declares Yahweh of hosts. “Because my house lies in ruins, while every one of you is working on his own house.
10 ౧౦ అందుకే మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవడం లేదు. భూమి పండడం లేదు.
Because of this the heavens withhold the dew from you, and the earth withholds its produce.
11 ౧౧ నేను భూమికీ పర్వతాలకూ అనావృష్టి కలగజేసి, ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించే అన్నిటి విషయంలో, మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”
I have summoned a drought upon the land and upon the mountains, upon the grain and upon the new wine, upon the oil and upon the harvest of the earth, upon men and upon beasts, and upon all the labor of your hands!”
12 ౧౨ షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యెహోజాదాకు కొడుకు, ప్రధానయాజకుడు యెహోషువ, శేషించిన ఇశ్రాయేలీ ప్రజలంతా తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త హగ్గయిని పంపించి, తెలియజేసిన మాట విని యెహోవా పట్ల భయభక్తులు చూపారు.
Then Zerubbabel son of Shealtiel, and the high priest Joshua son of Jehozadak, along with all the remnant of the people, obeyed the voice of Yahweh their God and the words of Haggai the prophet, because Yahweh their God had sent him and the people feared the face of Yahweh.
13 ౧౩ అప్పుడు యెహోవా ప్రవక్త హగ్గయి యెహోవా చెప్పగా ప్రజలతో ఇలా చెప్పాడు. “నేను మీకు తోడుగా ఉన్నాను.” ఇదే యెహోవా వాక్కు.
Then Haggai, the messenger of Yahweh, spoke Yahweh's message to the people and said, “I am with you!—this is Yahweh's declaration!”
14 ౧౪ యెహోవా యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు మనస్సును, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించాడు.
So Yahweh stirred up the spirit of the governor of Judah, Zerubbabel son of Shealtiel, and the spirit of the high priest Joshua son of Jehozadak, and the spirit of all the remnant of the people, so that they went and worked on the house of Yahweh of hosts, their God
15 ౧౫ వారు కూడి వచ్చి, దర్యావేషు రాజు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై నాలుగవ రోజున సేనల ప్రభువైన తమ దేవుని మందిరపు పనిచేయడం మొదలుపెట్టారు.
in the twenty-fourth day of the sixth month, in the second year of Darius the king.