< హగ్గయి 2 >

1 రాజైన దర్యావేషు పరిపాలనలో ఏడవ నెల ఇరవై ఒకటవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,
Paa den een og tyvende Dag i den syvende Maaned kom HERRENS Ord ved Profeten Haggaj saaledes:
2 “నీవు యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువతోను శేషించిన జనులతోను ఇలా చెప్పు.
Sig til Judas Statholder Zerubbabel, Sjaltiels Søn, til Ypperstepræsten Josua, Jozadaks Søn, og til Resten af Folket saaledes:
3 పూర్వకాలంలో ఈ మందిరానికి ఉన్న మహిమను చూసినవారు మీలో ఉన్నారు గదా. అలాటి వారికి ఇది ఎలా కనబడుతున్నది? దానితో ఇది ఏ విధంగానూ సరి పోలినది కాదని తోస్తున్నది గదా.
Er der nogen tilbage iblandt eder af dem, der har set dette Hus i dets fordums Herlighed? Hvorledes tykkes det eder da nu? Er det ikke som intet i eders Øjne?
4 అయినా యెహోవా ఇచ్చే ఆజ్ఞ. జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో. ప్రధానయాజకుడు, యెహోజాదాకు కొడుకు యెహోషువా, ధైర్యం తెచ్చుకో. దేశంలో ఉన్న ప్రజలారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.
Dog vær kun trøstig, Zerubbabel, lyder det fra HERREN, vær kun trøstig, du Ypperstepræst Josua, Jozadaks Søn, vær kun trøstigt, alt Folket i Landet, lyder det fra HERREN. Arbejd kun, thi jeg er med eder, lyder det fra Hærskarers HERRE,
5 మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీతో ఉంది కాబట్టి భయపడవద్దు.
og min Aand bliver iblandt eder med den Pagt, jeg sluttede med eder, da I drog bort fra Ægypten; frygt ikke!
6 సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే ఇక త్వరలోనే, ఇంకొకమారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తాను.
Thi saa siger Hærskarers HERRE: Endnu en Gang om en liden Stund vil jeg ryste Himmel og Jord, Hav og tørt Land,
7 ప్రతి రాజ్యాన్నీ నేను కదిలించగా అన్యజనులందరి విలువైన వస్తువులు తీసుకు వస్తారు. నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను.” ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.
og jeg vil ryste alle Folkene, og da skal alle Folkenes Skatte komme hid, og jeg fylder dette Hus med Herlighed, siger Hærskarers HERRE.
8 “వెండి నాది. బంగారం నాది” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
Mit er Sølvet, og mit er Guldet, lyder det fra Hærskarers HERRE.
9 ఈ చివరి మందిరం మహిమ మునుపటి మందిరం మహిమను మించి పోతుందని సేనల ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలంలో నేను శాంతిసమాధానాలు నిలుపుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
Dette Hus's kommende Herlighed bliver større end den tidligere, siger Hærskarers HERRE, og paa dette Sted vil jeg give Fred, lyder det fra Hærskarers HERRE.
10 ౧౦ దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,
Paa den fire og tyvende Dag i den niende Maaned i Darius's andet Regeringsaar kom HERRENS Ord ved Profeten Haggaj saaledes:
11 ౧౧ సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. యాజకుల దగ్గర ధర్మశాస్త్ర విచారణ చెయ్యి.
Saa siger Hærskarers HERRE: Bed Præsterne om Svar paa følgende Spørgsmaal:
12 ౧౨ “ఒకడు ప్రతిష్టితమైన మాంసాన్ని తన వస్త్రపు చెంగున కట్టుకుని, తన చెంగుతో రొట్టెనైనా వంటకాన్నైనా, ద్రాక్షారసాన్నైనా, నూనెనైనా మరి ఏ విధమైన భోజన పదార్థాన్నైనా, ముట్టుకుంటే ఆ ముట్టుకున్నది ప్రతిష్ఠితమవుతుందా?” అని యాజకులను అడిగితే, వారు “కాదు” అన్నారు.
»Dersom en Mand bærer helligt Kød i sin Kappeflig og med Fligen rører ved Brød eller noget, som er kogt, eller ved Vin eller Olie eller nogen Slags Mad, bliver disse Ting saa hellige?« Præsterne svarede nej.
13 ౧౩ “శవాన్ని ముట్టుకోవడం వల్ల ఒకడు అంటుపడి అలాటి వాటిలో దేనినైనా ముట్టుకుంటే, అతడు ముట్టుకున్నది అపవిత్రం అవుతుందా?” అని హగ్గయి మళ్లీ అడిగినప్పుడు యాజకులు “అది అపవిత్రం అవుతుంది” అన్నారు.
Haggaj spurgte da: »Hvis en, som er blevet uren ved Lig, rører ved nogen af disse Ting, bliver den saa uren?« Præsterne svarede ja.
14 ౧౪ అప్పుడు హగ్గయి వారికి ఈ విధంగా జవాబిచ్చాడు. ఈ ప్రజలు కూడా నా దృష్టికి అలానే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ వారక్కడ అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రం. ఇదే యెహోవా వాక్కు.
Saa tog Haggaj til Orde og sagde: Saaledes er det i mine Øjne med disse Mennesker, saaledes med dette Folk, lyder det fra HERREN, og saaledes med alt deres Hænders Værk og med, hvad de ofrer der: det er urent.
15 ౧౫ ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించింది మొదలు ఆ వెనుక మీకు సంభవించినదాన్ని ఆలోచన చేసుకోండి.
Men læg nu Mærke til, hvorledes det gaar fra i Dag! Før Sten lagdes paa Sten i HERRENS Hus,
16 ౧౬ అప్పటి నుండి ఒకడు ఇరవై కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుతున్నది. ఏభై కొలల తొట్టి దగ్గరికి ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరకుతున్నది.
hvorledes gik det eder da? Naar man kom til en Dynge Korn paa tyve Maal, var der ti; og kom man til en Vinperse for at øse halvtredsindstyve Maal af Kummen, var der tyve.
17 ౧౭ తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను, మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేశాను. అయినా మీలో ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రాలేదు. ఇదే యెహోవా వాక్కు.
Jeg slog eder med Kornbrand, Rust og Hagl ved alt eders Arbejde, men I omvendte eder ikke til mig, lyder det fra HERREN.
18 ౧౮ మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందు తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి, అంటే యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి.
Læg Mærke til, hvorledes det gaar fra i Dag, fra den fire og tyvende Dag i den niende Maaned, fra den Dag Grunden lagdes til HERRENS Hus, læg Mærke dertil!
19 ౧౯ కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లు అయినా అంజూరపు చెట్లు అయినా దానిమ్మ చెట్లయినా ఒలీవ చెట్లు అయినా ఫలించాయా? అయితే ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
Er Sæden endnu i Laderne, staar Vinstokken, Figentræet, Granatæbletræet og Oliventræet endnu uden Frugt? Fra i Dag velsigner jeg.
20 ౨౦ రెండవ సారి ఆ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు హగ్గయికి మళ్ళీ ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
Og HERRENS Ord kom for anden Gang til Haggaj paa den fire og tyvende Dag i Maaneden saaledes:
21 ౨౧ “యూదాదేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు. ఆకాశాన్ని, భూమిని నేను కంపింపజేయ బోతున్నాను.
Sig til Judas Statholder Zerubbabel: Jeg ryster Himmelen og Jorden
22 ౨౨ రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.
og omstyrter Kongernes Troner, tilintetgør Hedningerigernes Styrke og vælter Stridsvognene med deres Førere, og Heste og Ryttere skal styrte, og den ene skal falde for den andens Sværd.
23 ౨౩ నా సేవకుడవు, షయల్తీయేలు కుమారుడవు అయిన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.”
Paa hin Dag, lyder det fra Hærskarers HERRE, tager jeg dig, min Tjener Zerubbabel, Sjealtiels Søn, lyder det fra HERREN, og gør dig til en Seglring; thi dig har jeg udvalgt, lyder det fra Hærskarers HERRE.

< హగ్గయి 2 >