< హబక్కూకు 2 >
1 ౧ ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైనా కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను.
Nöbet yerinde, gözcü kulesinde durayım, Bakayım RAB bana ne diyecek, Yakınmalarıma ne yanıt verecek göreyim.
2 ౨ యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా, నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి.
Şöyle yanıtladı RAB: “Göreceklerini taş levhalara oyarak yaz. Öyle ki, herkes bir çırpıda okusun.
3 ౩ ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు. అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు. అది ఆలస్యం చేయక వస్తుంది.
Bu olayların zamanı gelmedi henüz. Sonun belirtileridir bunlar ve yalan değildir. Gecikiyormuş gibi görünse de bekle olacakları, Kesinlikle olacak, gecikmeyecek.
4 ౪ మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు. అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు.
Bakın şu övüngen kişiye, niyeti iyi değildir. Ama doğru kişi sadakatiyle yaşayacaktır.
5 ౫ ద్రాక్షారసం గర్విష్టి యువకుణ్ణి మోసం చేసి నిలవననీయకుండా చేస్తుంది. అతని ఆశలను పాతాళమంతగా విస్తరింప జేస్తుంది. మరణం లాగా అది తృప్తినొందదు. అతడు సకలజనాలను వశపరచుకుంటాడు. ప్రజలందరినీ తన కోసం సమకూర్చుకుంటాడు. (Sheol )
Servet aldatıcıdır. Küstahlar kalıcı değildir; Açgözlüdürler ölüler diyarı gibi Ve ölüm gibi hiç doymazlar. Ülkeleri ele geçirip halkları tutsak alırlar. (Sheol )
6 ౬ తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వాడికి బాధ. తాకట్టు సొమ్మును నీవు ఎంతకాలం పట్టుకుంటావు? వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకుంటూ వీరంతా ఇతని విషయం ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుతారు గదా.
Tutsak alınanlar onları küçümseyip alay etmeyecekler mi? ‘Kendisine ait olmayanı ele geçirenin, Haraç alarak zenginleşenin vay haline! Daha ne kadar sürecek bu?’ demeyecekler mi?
7 ౭ పళ్ళు కొరికే వారు హటాత్తుగా వస్తారు. నిన్ను హింస పెట్టబోయేవారు లేస్తారు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు.
Haraca kestikleriniz ansızın ayaklanmayacak mı? Uyanıp yakanıza yapışmayacaklar mı? İşte o zaman onlar için çapul malı gibi olacaksınız.
8 ౮ నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. పట్టణాలకు వాటిలోని నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి, బలాత్కారాన్ని బట్టి, నిన్ను కొల్లగొడతారు.
Birçok ulusu soyduğunuz, Kan döktüğünüz, Ülkelere, kentlere ve oralarda yaşayan herkese zorbalık ettiğiniz için, Halklardan sağ kalanlar da sizi soyacaklar.
9 ౯ తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని, తన యింటివారి కోసం అన్యాయంగా లాభం సంపాదించుకొనే వాడికి బాధ.
Evini haksız kazançla dolduranın, Felaketten kaçmak için yuvasını yüksek yere kuranın vay haline!
10 ౧౦ నీవు చాలా మంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవే అవమానం తెచ్చుకున్నావు. నీ దురాలోచన వలన నీకు వ్యతిరేకంగా నీవే పాపం చేశావు.
Birçok halkı kıyıma uğratmakla Kendi soyunuzu utanca boğdunuz, Kendi yıkımınızı hazırladınız.
11 ౧౧ గోడల్లోని రాళ్లు మొర్ర పెడుతున్నాయి. దూలాలు వాటికి జవాబిస్తాయి.
Duvar taşları bile haykıracak bunu Ve yankılanacak ahşap kirişler.
12 ౧౨ రక్తపాతం మూలంగా పట్టణం కట్టించే వారికి బాధ. దుష్టత్వం మూలంగా ఊరిని స్థాపించే వారికి బాధ.
Kan dökerek kentler kuranın, Zorbalıkla beldeler yapanın vay haline!
13 ౧౩ జాతులు ప్రయాసపడతారు గాని అగ్ని పాలవుతారు. వ్యర్థమైన దాని కోసం కష్టపడి ప్రజలు క్షీణించిపోతారు. ఇది సేనల ప్రభువు యెహోవా చేతనే అవుతుంది.
Halkların bütün emeklerinin yanması, Ulusların bütün çabalarının boşa gitmesi Her Şeye Egemen RAB'bin işi değil mi?
14 ౧౪ ఎందుకంటే సముద్రం జలాలతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
Çünkü sular denizi nasıl dolduruyorsa, Dünya da RAB'bin yüceliğinin bilgisiyle dolacak.
15 ౧౫ తమ పొరుగు వాణ్ణి నగ్నంగా చూడాలని విషం కలిపి వారికి తాగించి వారిని మత్తులుగా చేసేవారికి బాధ.
Çıplak bedenlerini seyretmek için Komşularına içki içirip sarhoş eden, İçkiye zehir bile katan sizlerin vay haline!
16 ౧౬ ఘనతకు మారుగా అవమానంతో నిండిపోతావు. నీవు కూడా తాగి నీ నగ్నత కనపరచుకుంటావు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ చేతికి వస్తుంది. అవమానకరమైన వాంతి నీ ఘనత మీద పడుతుంది.
Onur yerine utanca boğulacaksınız. Şimdi sıra sizde, için de çıplaklığınız görünsün. RAB size sağ elindeki ceza dolu kâseden içirecek. Onurunuz kırılacak, rezil olacaksınız.
17 ౧౭ లెబానోనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదికే వస్తుంది. నీవు పశువులను చేసిన నాశనం నీ మీదే పడుతుంది. దేశాలకు, పట్టణాలకు, వాటి నివాసులకు, నీవు చేసిన హింసాకాండను బట్టి, ఇది సంభవిస్తుంది.
Lübnan'a ettiğiniz zorbalık kendi başınıza gelecek. Telef ettiğiniz hayvanlar sizi dehşete düşürecek. Çünkü insan kanı döktünüz, Ülkelere, kentlere ve oralarda yaşayan herkese zorbalık ettiniz.
18 ౧౮ చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి? బొమ్మను చెక్కిన శిల్పి, పోత పోసిన వాడు కేవలం అబద్ధాలు బోధించే వాడు. తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమిటి?
İnsanın biçim verdiği oyma ya da dökme putun ne yararı var ki aldatmaktan başka? Putu yapan, yaptığına güvenir, Ama yaptığı ne ki, dilsiz puttan başka.
19 ౧౯ కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ. అవి ఏమైనా బోధించగలవా? దానికి బంగారంతో, వెండితో పూత పూశారు గానీ దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు.
Tahta puta, ‘Canlan!’ diyenin, Dilsiz taşa, ‘Uyan’ diyenin Vay haline! Put yol gösterebilir mi? Altınla, gümüşle kaplanmış, Ama içinde yaşam soluğu yok.
20 ౨౦ అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు గాక.
Oysa RAB kutsal tapınağındadır. Sussun bütün dünya O'nun önünde.”