< హబక్కూకు 1 >
1 ౧ ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
先知哈巴谷所得的默示。
2 ౨ “యెహోవా, నేను సహాయం కోసం మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు? బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షించడం లేదు.
他说:耶和华啊!我呼求你, 你不应允,要到几时呢? 我因强暴哀求你,你还不拯救。
3 ౩ నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు? బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు? ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం కనబడుతున్నాయి. జగడం, కలహం రేగుతున్నాయి.
你为何使我看见罪孽? 你为何看着奸恶而不理呢? 毁灭和强暴在我面前, 又起了争端和相斗的事。
4 ౪ అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది. న్యాయం జరగకుండా ఆగిపోయింది. భక్తి హీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు. న్యాయం చెడిపోతున్నది.
因此律法放松, 公理也不显明; 恶人围困义人, 所以公理显然颠倒。
5 ౫ అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి, ఆలోచించండి. నిర్ఘాంతపొండి. మీ కాలంలో నేనొక కార్యం చేస్తాను. అలా జరుగుతుందని ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు.
耶和华说:你们要向列国中观看, 大大惊奇; 因为在你们的时候,我行一件事, 虽有人告诉你们,你们总是不信。
6 ౬ కల్దీయులను నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు.
我必兴起迦勒底人, 就是那残忍暴躁之民,通行遍地, 占据那不属自己的住处。
7 ౭ వారు ఘోరమైన భీకర జాతి. వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టం వచ్చినట్టు ఏర్పరచుకుంటారు.
他威武可畏, 判断和势力都任意发出。
8 ౮ వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి. రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు. ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు.
他的马比豹更快, 比晚上的豺狼更猛。 马兵踊跃争先, 都从远方而来; 他们飞跑如鹰抓食,
9 ౯ వెనుదిరిగి చూడకుండా దౌర్జన్యం చేయడానికి వారు వస్తారు. ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెర పట్టుకుంటారు.
都为行强暴而来, 定住脸面向前, 将掳掠的人聚集,多如尘沙。
10 ౧౦ రాజులను అపహాస్యం చేస్తారు. అధిపతులను హేళన చేస్తారు. ప్రాకారాలున్న దుర్గాలన్నిటిని తృణీకరిస్తారు. మట్టి దిబ్బలు వేసి వాటిని పట్టుకుంటారు.
他们讥诮君王,笑话首领, 嗤笑一切保障,筑垒攻取。
11 ౧౧ తమ బలమే తమ దేవుడనుకుంటారు. గాలి కొట్టుకుని పోయేలా వారు కొట్టుకు పోతూ అపరాధులౌతారు.
他以自己的势力为神, 像风猛然扫过,显为有罪。
12 ౧౨ యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా? మేము మరణించము. యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు.
耶和华—我的 神,我的圣者啊, 你不是从亘古而有吗? 我们必不致死。 耶和华啊,你派定他为要刑罚人; 磐石啊,你设立他为要惩治人。
13 ౧౩ నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా. కపటులను నువ్వు చూసి కూడా, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు?
你眼目清洁, 不看邪僻,不看奸恶; 行诡诈的,你为何看着不理呢? 恶人吞灭比自己公义的, 你为何静默不语呢?
14 ౧౪ పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు.
你为何使人如海中的鱼, 又如没有管辖的爬物呢?
15 ౧౫ వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు. ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు. వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు.
他用钩钩住,用网捕获, 用拉网聚集他们; 因此,他欢喜快乐,
16 ౧౬ కాబట్టి వలల వలన మంచి రాబడి, పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు. తన వలలకు సాంబ్రాణి వేస్తున్నాడు.
就向网献祭,向网烧香, 因他由此得肥美的分和富裕的食物。
17 ౧౭ వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా?”
他岂可屡次倒空网罗, 将列国的人时常杀戮,毫不顾惜呢?