< ఆదికాండము 8 >
1 ౧ దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి.
And god remebred Noe and all ye beastes and all ye catell yt were with hi in ye arke And god made a wynde to blow vppo ye erth and ye waters ceased:
2 ౨ అగాధజలాల ఊటలు, ఆకాశపు కిటికీలు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది.
ad ye fountaynes of the depe ad the wyndowes of heave were stopte and the rayne of heaven was forbidde
3 ౩ అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి.
and the waters returned from of ye erth ad abated after the ende of an hundred and. l. dayes.
4 ౪ ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది.
And the arke rested vppo the mountayns of Ararat the. xvij. daye of the. vij. moneth.
5 ౫ పదో నెల వరకూ నీళ్ళు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పదోనెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి.
And the waters went away ad decreased vntyll the x. moneth. And the fyrst daye of the tenth moneth the toppes of the mounteyns appered.
6 ౬ నలభై రోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి
And after the ende of. xl. dayes. Noe opened the wyndow of the arke which he had made
7 ౭ ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకూ ఇటూ అటూ తిరుగుతూ ఉంది.
ad sent forth a raven which went out ever goinge and cominge agayne vntyll the waters were dreyed vpp vppon the erth
8 ౮ నీళ్ళు నేలమీదనుంచి తగ్గాయో లేదో చూడడానికి అతడు తన దగ్గరనుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు.
Then sent he forth a doue from hym to wete whether the waters were fallen from of the erth.
9 ౯ భూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు.
And when the doue coude fynde no restinge place for hyr fote she returned to him agayne vnto the arke for the waters were vppon the face of all the erth. And he put out hys honde and toke her and pulled hyr to hym in to the arke
10 ౧౦ అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు.
And he abode yet. vij. dayes mo and sent out the doue agayne out of the arke
11 ౧౧ సాయంకాలానికి అది అతని దగ్గరికి తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు.
And the doue came to hym agayne aboute eventyde and beholde: There was in hyr mouth a lefe of an olyve tre which she had plucked wherby Noe perceaved that the waters wer abated vppon the erth.
12 ౧౨ అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు.
And he taried yet. vij. other dayes and sent forth the doue which from thence forth came no more agayne to him.
13 ౧౩ ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది.
And it came to passe the syxte hundred and one yere and the fyrst daye of the fyrst moneth that the waters were dryed vpp apon the erth. And Noe toke off the hatches of the arke and loked: And beholde the face of the erth was drye.
14 ౧౪ రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది.
so by the. xxvij. daye of the seconde moneth the erth was drye.
15 ౧౫ అప్పుడు దేవుడు నోవహుతో,
And God spake vnto Noe saynge:
16 ౧౬ “నువ్వు, నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి.
come out of the arcke both thou and thy wyfe ad thy sonnes and thy sonnes wyues with the.
17 ౧౭ పక్షులను, పశువులను భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవినీ నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకుని బయటకు రావాలి. అవి భూమిమీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి” అని చెప్పాడు.
And all the beastes that are with the whatsoever flesh it be both foule and catell and all maner wormes that crepe on the erth brynge out with the and let them moue growe ad multiplye vppon the erth.
18 ౧౮ కాబట్టి నోవహు, అతనితోపాటు అతని కొడుకులు అతని భార్య, అతని కోడళ్ళు బయటకు వచ్చారు.
And Noe came out ad his sonnes and his wyfe and his sonnes wyues with hym.
19 ౧౯ ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమి మీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలోనుంచి బయటకు వచ్చాయి.
And all the beastes and all the wormes and all the foules and all that moved vppon the erth came also out of the arke all of one kynde together.
20 ౨౦ అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు.
And Noe made an aulter vnto the LORDE and toke of all maner of clene beastes and all maner of clene foules and offred sacrifyce vppon the aulter.
21 ౨౧ యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.
And the LORDE smellyd a swete savoure and sayd in his hert: I wyll henceforth no more curse the erth for mannes sake for the imagynacion of mannes hert is evell even from the very youth of hym. Morover I wyll not destroy from henceforth all that lyveth as I haue done.
22 ౨౨ భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు” అని తన హృదయంలో అనుకున్నాడు.
Nether shall sowynge tyme and harvest colde and hete somere and wynter daye and nyghte ceasse as longe as the erth endureth.