< ఆదికాండము 5 >
1 ౧ ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
Ovo je povijest Adamova roda. Kad je Bog stvorio čovjeka, napravio ga je na priliku svoju;
2 ౨ వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
stvorio je muško i žensko. A kad ih je stvorio, blagoslovi ih i nazva - čovjek.
3 ౩ ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
Kad je Adamu bilo sto i trideset godina, rodi mu se sin njemu sličan, na njegovu sliku; nadjenu mu ime Šet.
4 ౪ షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
Po rođenju Šetovu Adam je živio osam stotina godina te mu se rodilo još sinova i kćeri.
5 ౫ ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
Adam poživje u svemu devet stotina i trideset godina. Potom umrije.
6 ౬ షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.
Kad je Šetu bilo sto i pet godina, rodi mu se Enoš.
7 ౭ ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Po rođenju Enoševu Šet je živio osam stotina i sedam godina te mu se rodilo još sinova i kćeri.
8 ౮ షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
Šet poživje u svemu devet stotina i dvanaest godina. Potom umrije.
9 ౯ ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
Kad je Enošu bilo devedeset godina, rodi mu se Kenan.
10 ౧౦ కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Po rođenju Kenanovu Enoš je živio osam stotina i petnaest godina te mu se rodilo još sinova i kćeri.
11 ౧౧ ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
Enoš poživje u svemu devet stotina i pet godina. Potom umrije.
12 ౧౨ కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
Kad je Kenanu bilo sedamdeset godina, rodi mu se Mahalalel.
13 ౧౩ మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Po rođenju Mahalalelovu Kenan je živio osam stotina i četrdeset godina te mu se rodilo još sinova i kćeri.
14 ౧౪ కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
Kenan poživje u svemu devet stotina i deset godina. Potom umrije.
15 ౧౫ మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
Kad je Mahalalelu bilo šezdeset i pet godina, rodi mu se Jered.
16 ౧౬ యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Po rođenju Jeredovu Mahalalel je živio osam stotina i trideset godina te mu se rodilo još sinova i kćeri.
17 ౧౭ మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
Mahalalel poživje u svemu osam stotina devedeset i pet godina. Potom umrije.
18 ౧౮ యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.
Kad je Jeredu bilo sto šezdeset i dvije godine, rodi mu se Henok.
19 ౧౯ హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Po rođenju Henokovu Jered je živio osam stotina godina te mu se rodilo još sinova i kćeri.
20 ౨౦ యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
Jered poživje u svemu devet stotina šezdeset i dvije godine. Potom umrije.
21 ౨౧ హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.
Kad je Henoku bilo šezdeset i pet godina, rodi mu se Metušalah.
22 ౨౨ మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Henok je hodio s Bogom. Po rođenju Metušalahovu Henok je živio trista godina te mu se rodilo još sinova i kćeri.
23 ౨౩ హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
Henok poživje u svemu trista šezdeset i pet godina.
24 ౨౪ హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
Henok je hodio s Bogom, potom iščeznu; Bog ga uze.
25 ౨౫ మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
Kad je Metušalahu bilo sto osamdeset i sedam godina, rodi mu se Lamek.
26 ౨౬ మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Po rođenju Lamekovu Metušalah je živio sedam stotina osamdeset i dvije godine te mu se rodilo još sinova i kćeri.
27 ౨౭ మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
Metušalah poživje u svemu devet stotina šezdeset i devet godina. Potom umrije.
28 ౨౮ లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
Kad su Lameku bile sto osamdeset i dvije godine, rodi mu se sin.
29 ౨౯ “భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
Nadjene mu ime Noa, govoreći: “Ovaj će nam pribavljati, u trudu i naporu naših ruku, utjehu iz zemlje koju je Bog prokleo.”
30 ౩౦ లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Po rođenju Noinu Lamek je živio pet stotina devedeset i pet godina te mu se rodilo još sinova i kćeri.
31 ౩౧ లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
Lamek poživje u svemu sedam stotina sedamdeset i sedam godina. Potom umrije.
32 ౩౨ ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
Pošto je Noa proživio pet stotina godina, rode mu se Šem, Ham i Jafet.