< ఆదికాండము 5 >

1 ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
亚当的后代记在下面。(当 神造人的日子,是照着自己的样式造的,
2 వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
并且造男造女。在他们被造的日子, 神赐福给他们,称他们为“人”。)
3 ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
亚当活到一百三十岁,生了一个儿子,形象样式和自己相似,就给他起名叫塞特。
4 షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
亚当生塞特之后,又在世八百年,并且生儿养女。
5 ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
亚当共活了九百三十岁就死了。
6 షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.
塞特活到一百零五岁,生了以挪士。
7 ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
塞特生以挪士之后,又活了八百零七年,并且生儿养女。
8 షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
塞特共活了九百一十二岁就死了。
9 ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
以挪士活到九十岁,生了该南。
10 ౧౦ కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
以挪士生该南之后,又活了八百一十五年,并且生儿养女。
11 ౧౧ ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
以挪士共活了九百零五岁就死了。
12 ౧౨ కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
该南活到七十岁,生了玛勒列。
13 ౧౩ మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
该南生玛勒列之后,又活了八百四十年,并且生儿养女。
14 ౧౪ కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
该南共活了九百一十岁就死了。
15 ౧౫ మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
玛勒列活到六十五岁,生了雅列。
16 ౧౬ యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
玛勒列生雅列之后,又活了八百三十年,并且生儿养女。
17 ౧౭ మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
玛勒列共活了八百九十五岁就死了。
18 ౧౮ యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.
雅列活到一百六十二岁,生了以诺。
19 ౧౯ హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
雅列生以诺之后,又活了八百年,并且生儿养女。
20 ౨౦ యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
雅列共活了九百六十二岁就死了。
21 ౨౧ హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.
以诺活到六十五岁,生了玛土撒拉。
22 ౨౨ మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
以诺生玛土撒拉之后,与 神同行三百年,并且生儿养女。
23 ౨౩ హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
以诺共活了三百六十五岁。
24 ౨౪ హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
以诺与 神同行, 神将他取去,他就不在世了。
25 ౨౫ మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
玛土撒拉活到一百八十七岁,生了拉麦。
26 ౨౬ మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
玛土撒拉生拉麦之后,又活了七百八十二年,并且生儿养女。
27 ౨౭ మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
玛土撒拉共活了九百六十九岁就死了。
28 ౨౮ లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
拉麦活到一百八十二岁,生了一个儿子,
29 ౨౯ “భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
给他起名叫挪亚,说:“这个儿子必为我们的操作和手中的劳苦安慰我们;这操作劳苦是因为耶和华咒诅地。”
30 ౩౦ లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
拉麦生挪亚之后,又活了五百九十五年,并且生儿养女。
31 ౩౧ లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
拉麦共活了七百七十七岁就死了。
32 ౩౨ ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
挪亚五百岁生了闪、含、雅弗。

< ఆదికాండము 5 >