< ఆదికాండము 49 >
1 ౧ యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
Nígbà náà ni Jakọbu ránṣẹ́ pe àwọn ọmọ rẹ̀, ó sì wí pé, “Ẹ kó ara yín jọ pọ̀, kí n le è sọ ohun tí yóò ṣẹlẹ̀ ní ọjọ́ iwájú fún un yín.
2 ౨ యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.
“Ẹ kó ara yín jọ pọ̀, kí ẹ sì tẹ́tí, ẹ̀yin ọmọ Jakọbu; ẹ fetí sí Israẹli baba yín.
3 ౩ రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.
“Reubeni, ìwọ ni àkọ́bí mi, agbára mi, ìpilẹ̀ṣẹ̀ ipá mi, títayọ ní ọlá àti títayọ ní agbára.
4 ౪ పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.
Ẹni ríru bí omi Òkun, ìwọ kì yóò tayọ mọ́, nítorí pé ìwọ gun ibùsùn baba rẹ, lórí àkéte mi, ìwọ sì bà á jẹ́ (ìwọ bá ọ̀kan nínú àwọn aya baba rẹ lòpọ̀).
5 ౫ షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
“Simeoni àti Lefi jẹ́ arákùnrin— idà wọn jẹ́ ohun èlò ogun alágbára.
6 ౬ నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.
Kí ọkàn mi má ṣe ni àṣepọ̀ pẹ̀lú wọn, kí n má sì ṣe dúró níbí ìpéjọpọ̀ wọn, nítorí wọ́n ti pa àwọn ènìyàn ní ìbínú wọn, wọ́n sì da àwọn màlúù lóró bí ó ti wù wọ́n.
7 ౭ వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
Ìfibú ni ìbínú wọn nítorí tí ó gbóná púpọ̀, àti fún ìrunú wọn nítorí tí ó kún fún ìkà! Èmi yóò tú wọn ká ní Jakọbu, èmi ó sì fọ́n wọn ká ní Israẹli.
8 ౮ యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.
“Juda, àwọn arákùnrin rẹ yóò yìn ọ, ọwọ́ rẹ yóò wà ní ọrùn àwọn ọ̀tá rẹ, àwọn ọmọkùnrin baba rẹ yóò foríbalẹ̀ fún ọ.
9 ౯ యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?
Ọmọ kìnnìún ni ọ́, ìwọ Juda, o darí láti igbó ọdẹ, ọmọ mi. Bí i kìnnìún, o ba mọ́lẹ̀, o sì sùn sílẹ̀ bí i abo kìnnìún, ta ni ó tó bẹ́ẹ̀, kí o lé e dìde?
10 ౧౦ షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.
Ọ̀pá oyè kì yóò kúrò ní Juda bẹ́ẹ̀ ni ọ̀pá-ìṣàkóso kì yóò kúrò láàrín ẹsẹ̀ rẹ̀, títí tí Ṣilo tí ó ni í yóò fi dé, tí gbogbo àwọn orílẹ̀-èdè yóò máa wárí fún un.
11 ౧౧ ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.
Yóò má so ọmọ ẹṣin rẹ̀ mọ́ igi àjàrà, àti ọmọ kẹ́tẹ́kẹ́tẹ́ rẹ̀ mọ́ ẹ̀ka tí ó dára jù. Yóò fọ aṣọ rẹ̀ nínú wáìnì àti ẹ̀wù rẹ̀ nínú omi-pupa ti èso àjàrà.
12 ౧౨ అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.
Ojú rẹ̀ yóò rẹ̀ dòdò ju wáìnì lọ, eyín rẹ yóò sì funfun ju omi-ọyàn lọ.
13 ౧౩ జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.
“Sebuluni yóò máa gbé ní etí Òkun, yóò sì jẹ́ èbúté fún ọkọ̀ ojú omi, agbègbè rẹ yóò tàn ká títí dé Sidoni.
14 ౧౪ ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
“Isakari jẹ́ kẹ́tẹ́kẹ́tẹ́ alágbára tí ó dùbúlẹ̀ láàrín agbo àgùntàn.
15 ౧౫ అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు. బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.
Nígbà tí ó bá rí bí ibi ìsinmi òun ti dára tó, àti bí ilẹ̀ rẹ̀ ti ní ìdẹ̀ra tó, yóò tẹ èjìká rẹ̀ ba láti ru àjàgà, yóò sì fi ara rẹ̀ fún iṣẹ́ ipá.
16 ౧౬ దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.
“Dani yóò ṣe ìdájọ́ àwọn ènìyàn rẹ̀ gẹ́gẹ́ bí ọ̀kan nínú àwọn ẹ̀yà Israẹli.
17 ౧౭ దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.
Dani yóò jẹ́ ejò ni pópónà àti paramọ́lẹ̀ ní ẹ̀bá ọ̀nà, tí ó bu ẹṣin jẹ ní ẹsẹ̀, kí ẹni tí ń gùn ún bá à le è ṣubú sẹ́yìn.
18 ౧౮ యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
“Mo ń dúró de ìtúsílẹ̀ rẹ, Olúwa.
19 ౧౯ దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.
“Ẹgbẹ́ ogun àwọn ẹlẹ́ṣin yóò kọlu Gadi, ṣùgbọ́n yóò kọlu wọ́n ní gìgísẹ̀ wọn.
20 ౨౦ ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.
“Oúnjẹ Aṣeri yóò dára; yóò ṣe àsè tí ó yẹ fún ọba.
21 ౨౧ నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు.
“Naftali yóò jẹ́ abo àgbọ̀nrín tí a tú sílẹ̀ tí ó ń bí ọmọ dáradára.
22 ౨౨ యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.
“Josẹfu jẹ́ àjàrà eléso, àjàrà eléso ní etí odò, tí ẹ̀ka rẹ̀ gun orí odi.
23 ౨౩ విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.
Pẹ̀lú ìkorò, àwọn tafàtafà dojú ìjà kọ ọ́, wọ́n tafà sí í pẹ̀lú ìkanra.
24 ౨౪ అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.
Ṣùgbọ́n ọrun rẹ̀ dúró ni agbára, ọwọ́ agbára rẹ̀ ni a sì mu lára le, nítorí ọwọ́ alágbára Jakọbu, nítorí olùtọ́jú àti aláàbò àpáta Israẹli,
25 ౨౫ నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.
nítorí Ọlọ́run baba rẹ tí ó ràn ọ́ lọ́wọ́, nítorí Olódùmarè tí ó bùkún ọ pẹ̀lú láti ọ̀run wá, ìbùkún ọ̀gbìn tí ó wà ní ìsàlẹ̀, ìbùkún ti ọmú àti ti inú.
26 ౨౬ నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.
Ìbùkún baba rẹ pọ̀ púpọ̀ ju ìbùkún àwọn òkè ńlá ìgbàanì, ju ẹ̀bùn ńlá àwọn òkè láéláé. Jẹ́ kí gbogbo èyí sọ̀kalẹ̀ sí orí Josẹfu, lé ìpéǹpéjú ọmọ-aládé láàrín arákùnrin rẹ̀.
27 ౨౭ బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”
“Benjamini jẹ́ ìkookò tí ó burú; ní òwúrọ̀ ni ó jẹ ẹran ọdẹ rẹ, ní àṣálẹ́, ó pín ìkógun.”
28 ౨౮ ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
Gbogbo ìwọ̀nyí ni àwọn ẹ̀yà Israẹli méjìlá, èyí sì ni ohun tí baba wọn sọ fún wọn nígbà tí ó súre fún wọn, tí ó sì fún ẹnìkọ̀ọ̀kan ní ìbùkún tí ó tọ́ sí i.
29 ౨౯ తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.
Nígbà náà ni ó fún wọn ní àwọn ìlànà yìí, “Ọjọ́ ikú mi kù fẹ́ẹ́rẹ́. Kí ẹ sin mí sí ibojì pẹ̀lú àwọn baba mi ní inú àpáta ní ilẹ̀ Hiti ará Efroni.
30 ౩౦ హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.
Ihò àpáta tí ó wà ní ilẹ̀ Makpela, nítòsí Mamre ní Kenaani, èyí tí Abrahamu rà gẹ́gẹ́ bí ilẹ̀ ìsìnkú lọ́wọ́ Efroni ará Hiti pẹ̀lú ilẹ̀ rẹ̀.
31 ౩౧ అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
Níbẹ̀ ni a sin Abrahamu àti aya rẹ̀ Sara sí, níbẹ̀ ni a sin Isaaki àti Rebeka aya rẹ̀ sí, níbẹ̀ sì ni mo sìnkú Lea sí.
32 ౩౨ ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు.
Ilẹ̀ náà àti ihò àpáta tí ó wà nínú rẹ̀ ni a rà lọ́wọ́ ará Hiti.”
33 ౩౩ యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.
Nígbà tí Jakọbu ti pàṣẹ yìí fún àwọn ọmọ rẹ̀, ó gbé ẹsẹ̀ rẹ̀ sókè sórí ibùsùn, ó sì kú, a sì ko jọ pọ̀ mọ́ àwọn ènìyàn rẹ̀.