< ఆదికాండము 49 >

1 యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
雅各伯叫了他的兒子們來說:「你們聚在一起,我要將你們日後所遇到的事告訴你們。
2 యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.
雅各伯的兒子! 你們集合靜聽,靜聽你們父親以色列的話:
3 రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.
勒烏本,你是我的長子,我的力量,我壯年的首生;你過於暴燥,過於激烈,
4 పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.
沸騰有如滾水。你不能佔據首位,因為你侵犯了你父親的床第,上去玷污了我的臥榻。
5 షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
西默盎和肋未實是一對兄弟;他們的刀劍是殘暴的武器。
6 నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.
我的心靈決不加入他們的陰謀,我的心神決不參與他們的聚會;因為他們在盛怒下屠殺了人,任意割斷了牛的腿筋。
7 వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
他們的忿怒這樣激烈,他們的狂暴這樣凶狠,實可詛咒! 我要使他們分散在雅各伯內,使他們散居在以色列中。
8 యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.
猶大! 你將受你兄弟的讚揚;你的手必壓在你仇敵的頸上;你父親的兒子要向你俯首致敬。
9 యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?
猶大是隻幼獅;我兒,你獵取食物後上來,屈身伏臥,有如雄獅,又如母獅,誰敢驚動﹖
10 ౧౦ షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.
權杖不離猶大,柄杖不離他腳間,直到那應得權杖者來到,萬民都要歸順他。
11 ౧౧ ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.
他將自己的驢繫在葡萄樹上,將自己的驢駒拴在優美的葡萄樹上;在酒中洗自己的衣服,在葡萄汁中洗自己的外氅。
12 ౧౨ అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.
他的雙眼因酒而發紅,他的牙齒因乳而變白。
13 ౧౩ జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.
則步隆將居於海濱,成為船隻停泊的口岸,與漆冬毗連。
14 ౧౪ ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
依撒加爾是匹壯驢,臥在圈中;
15 ౧౫ అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు. బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.
他覺得安居美好,地方優雅;便屈肩負重,成為服役的奴隸。
16 ౧౬ దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.
丹將如以色列的一個支派,衛護自己的人民。
17 ౧౭ దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.
丹必似路邊的長蟲,道旁的毒蛇,咬傷馬蹄,使騎士向後跌下。
18 ౧౮ యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
上主! 我期待你的救援!
19 ౧౯ దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.
加得要受襲擊者襲擊,但他要襲擊他們的後隊。
20 ౨౦ ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.
阿協爾的食物肥美,將供給君王的佳餚。
21 ౨౧ నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు.
納斐塔里是隻被釋放的母鹿,發出悅耳的歌詠。
22 ౨౨ యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.
若瑟是一株茂盛的果樹,一株泉旁茂盛的果樹;枝條蔓延牆頭。
23 ౨౩ విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.
弓手令他苦惱,向他射擊,與他對敵;
24 ౨౪ అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.
但他的弓仍舊有力,他的手臂依然靈活;這是因了雅各伯的大能者之手,因了以色列的牧者和磐石之名;
25 ౨౫ నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.
這是因為你父親的天主扶助了你,全能者天主,以天上高處的祝福,以地下深淵蘊藏的祝福,以哺乳和生育的祝福,祝福了你。
26 ౨౬ నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.
你父親的祝福,遠超過古山岳的祝福,永遠丘陵的願望;願這些祝福都降在若瑟頭上,降在他兄弟中被選者的額上。
27 ౨౭ బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”
本雅明是隻掠奪的豺狼:早上吞食獵物,晚上分贓。」
28 ౨౮ ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
以上是以色列十二支派,以及他們的父親對他們所說的話。他祝福了他們,以適合每人的祝福,祝福了他們。
29 ౨౯ తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.
以後雅各伯又囑咐他們,對他們說:「我快要歸到我親族那裏去,你們應將我葬在赫特人厄斐龍田裏的山洞裏,與我的祖先在一起。
30 ౩౦ హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.
這山洞是在客納罕地,面對瑪默勒的瑪革培拉的田內;這塊田原是亞巴郎由赫特人厄斐龍買了來作為私有墳地,
31 ౩౧ అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
在那裏葬了亞巴郎和他的妻子撒辣,在那裏葬了依撒格和他的妻子黎貝加;我也在那裏葬了肋阿。
32 ౩౨ ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు.
這塊田地和其中的山洞是由赫特人買來的。」
33 ౩౩ యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.
雅各伯給他的兒子們立完遺囑以後,便將腳縮到床上,斷氣而死,歸到他親族那裏去了。

< ఆదికాండము 49 >