< ఆదికాండము 48 >
1 ౧ ఈ సంగతులైన తరువాత “ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు” అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు.
Történt ezen dolgok után, mondták Józsefnek: Íme, atyád beteg. És ő vette két fiát magával, Menássét és Efráimot.
2 ౨ “ఇదిగో నీ కొడుకు యోసేపు నీ దగ్గరికి వస్తున్నాడు” అని యాకోబుకు తెలిసింది. అప్పుడు ఇశ్రాయేలు బలం తెచ్చుకుని తన మంచం మీద కూర్చున్నాడు.
Midőn tudtára adták Jákobnak és mondták: Íme fiad, József jön hozzád, akkor erőlködött Izrael és felült az ágyon.
3 ౩ అతడు యోసేపుతో “కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి
És mondta Jákob Józsefnek: Isten, a Mindenható megjelent nekem Lúzban, Kánaán országában és megáldott engem;
4 ౪ ‘ఇదిగో నిన్ను ఫలవంతంగా చేసి, విస్తరింపజేస్తాను. నువ్వు జన సమూహమయ్యేలా చేస్తాను. నీ వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అన్నాడు.
és mondta nekem: Íme, én megszaporítlak és megsokasítlak és teszlek népek gyülekezetévé; és adom ezt az országot magzatodnak utánad örök birtokul.
5 ౫ నేను ఐగుప్తుకు నీ దగ్గరికి రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల్లాగే ఎఫ్రాయిము, మనష్షే నా కొడుకులే.
Most tehát, két fiad, akik születtek neked Egyiptom országában, amíg eljöttem hozzád Egyiptomba, az enyéim ők; Efráim és Menásse, mint Rúbén és Simon legyenek az enyéim.
6 ౬ వారి తరువాత నీకు పుట్టిన సంతానం నీదే. వారి పేర్లు వారి సోదరుల స్వాస్థ్యం జాబితాల ప్రకారం నమోదు అవుతాయి.
Nemzettjeid pedig, akiket nemzettél utánuk, a tieid legyenek; testvéreik nevéről neveztessenek az ő örökségükben.
7 ౭ పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను” అని యాకోబు చెప్పాడు.
Én pedig, midőn jöttem Páddánból, meghalt mellettem Ráchel Kánaán országában, az úton, midőn még egy dűlő föld volt, hogy elérkezzem Efroszba és eltemettem őt ott, az Efroszba vezető úton, az Bész-Lechem.
8 ౮ ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు.
Meglátta Izrael József fiait és mondta: Kik ezek?
9 ౯ యోసేపు “వీళ్ళు నా కొడుకులు. వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు” అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు “నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకు రా” అన్నాడు.
És mondta József az ő atyjának: Fiaim ők, akiket adott nekem Isten itt; és ő mondta: Hozd csak ide őket hozzám, hogy megáldjam őket.
10 ౧౦ ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.
Izrael szemei pedig nehezek voltak az öregségtől, nem bírt látni; és közel vitte őket hozzá, megcsókolta és megölelte őket.
11 ౧౧ ఇశ్రాయేలు యోసేపుతో “నీ ముఖాన్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు. అయితే, నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు.
És mondta Izrael Józsefnek: Arcodat látni sem gondoltam és íme, látnom engedte Isten a te magzatodat is.
12 ౧౨ యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకు అతనికి సాగిలపడ్డాడు.
És József kivezette őket térdei közül, és leborult arcával a földre.
13 ౧౩ తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి వైపు తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని, వారిద్దరిని అతని సమీపంగా తీసుకు వచ్చాడు.
És vette József mindkettőjüket, Efráimot jobbjával Izrael baljáról és Menássét baljával Izrael jobbjáról és közelvitte hozzá.
14 ౧౪ ఇశ్రాయేలు, చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని, మనష్షే తలమీద తన ఎడమచేతిని ఉంచాడు.
Izrael pedig kinyújtotta jobbját és rátette Efráim fejére, az pedig az ifjabbik, és balját Menásse fejére; megfontolva tette kezeit, mert Menásse volt az elsőszülött.
15 ౧౫ ఇశ్రాయేలు యోసేపును దీవించి “నా పూర్వీకులు అబ్రాహాము ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో ఆ దేవుడు, ఇప్పటి వరకూ నన్ను పోషించిన ఆ దేవుడు,
Megáldotta Józsefet és mondta: Az Isten, aki előtt jártak atyáim, Ábrahám és Izsák, az Isten, a pásztorom, mióta vagyok e napig;
16 ౧౬ సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లలను దీవించు గాక. నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగు గాక. లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక” అన్నాడు.
az angyal, aki megváltott engem minden bajtól, áldja meg a gyermekeket és neveztessék rajtuk az én nevem és atyáimnak, Ábrahámnak és Izsáknak neve és halként szaporodjanak sokasággá az országban.
17 ౧౭ యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టడం చూశాడు. అది అతనికి నచ్చలేదు. అతడు మనష్షే తల మీద పెట్టించాలని తన తండ్రి చెయ్యి, ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి,
Midőn József látta, hogy atyja jobb kezét teszi Efráim fejére, visszatetszett szemeiben; megfogta atyja kezét, hogy eltávolítsa azt Efráim fejéről Menásse fejére.
18 ౧౮ “నాన్నా, అలా కాదు. ఇతడే పెద్దవాడు. నీ కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టు” అని చెప్పాడు.
És mondta József az atyjának: Nem így atyám, mert ez az elsőszülött, tedd jobbodat az ő fejére.
19 ౧౯ అతని తండ్రి ఒప్పుకోక “నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఇతడు కూడా ఒక జన సమూహమై గొప్పవాడవుతాడు. అయితే, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. అతని సంతానం జన సమూహాలు అవుతారు” అన్నాడు.
De atyja vonakodott és mondta: Tudom fiam, tudom, ő is néppé lesz és ő is nagy lesz, de kisebbik testvére nagyobb lesz nála és magzatja lesz népek sokaságává.
20 ౨౦ ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు. “ఇశ్రాయేలీయులు ఎవరినైనా దీవించేటపుడు, ‘ఎఫ్రాయిములాగా మనష్షేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు గాక’ అని మీ పేరెత్తి దీవిస్తారు” అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు.
És megáldotta őket azon a napon, mondván: Tegyen téged Isten olyanná, mint Efráim és mint Menásse. És elé helyezte Efráimot Menássénak.
21 ౨౧ ఇశ్రాయేలు “ఇదిగో నేను చనిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడై ఉండి మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు.
És mondta Izrael Józsefnek: Íme, én meghalok, de Isten veletek lesz és visszavisz benneteket őseitek országába.
22 ౨౨ నేను నీ సోదరులకంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చాను. దాన్ని, నా కత్తితో నా వింటితో, అమోరీయుల చేతిలో నుండి తీసుకున్నాను” అని యోసేపుతో చెప్పాడు.
Én pedig adok neked egy részt testvéreid fölött, amit elvettem az Emóri kezéből kardommal és ifjammal.