< ఆదికాండము 46 >
1 ౧ ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు.
Un Israēls aizgāja ar visu, kas tam piederēja, un nāca uz Bēršebu un upurēja upurus sava tēva Īzaka Dievam.
2 ౨ అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.
Un Dievs runāja ar Israēli nakts parādīšanā un sacīja: Jēkab, Jēkab! Un tas sacīja: redzi, še es esmu.
3 ౩ ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను.
Tad viņš sacīja: Es esmu tas stiprais Dievs, tava tēva Dievs; nebīsties noiet uz Ēģipti, jo Es tevi tur celšu par lielu tautu.
4 ౪ నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.”
Es noiešu tev līdz uz Ēģiptes zemi un Es tevi vedin atkal atvedīšu, un Jāzepam būs ar savu roku tavas acis aizspiest.
5 ౫ యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు.
Tad Jēkabs cēlās no Bēršebas, un Israēla bērni veda Jēkabu, savu tēvu, un savus bērniņus un savas sievas uz ratiem, ko Faraons bija sūtījis, viņu vest.
6 ౬ యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు.
Un tie ņēma savus lopus un savu mantu, ko tie bija sakrājuši Kanaāna zemē, un nāca uz Ēģipti, Jēkabs un viss viņa dzimums līdz ar viņu;
7 ౭ అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.
Viņa dēli un viņa dēlu dēli ar viņu, viņa meitas un viņa dēlu meitas un viss viņa dzimums, to viņš veda līdz uz Ēģiptes zemi.
8 ౮ ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.
Un šie ir Israēla dēlu vārdi, kas nāca uz Ēģipti, Jēkabs un viņa dēli: Rūbens, Jēkaba pirmdzimtais.
9 ౯ యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
Un Rūbena dēli: Hanoks un Pallus un Hecrons un Karmus.
10 ౧౦ షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు.
Un Sīmeana dēli: Jemuels un Jamins un Oāds un Jaķins un Coārs un Sauls, vienas Kanaāniešu sievas dēls.
11 ౧౧ లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.
Un Levja dēli: Geršons, Kehāts un Merarus.
12 ౧౨ యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు.
Un Jūda dēli: Ģers un Onans un Šelus, Perec un Zerus; un Ģers un Onans bija miruši Kanaāna zemē, - un Pereca dēli bija Hecrons un Hamuls.
13 ౧౩ ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.
Un Īsašara dēli: Tolus un Puūs un Jobs un Šimrons.
14 ౧౪ జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.
Un Zebulona dēli: Sereds un Elons un Jahleēls.
15 ౧౫ వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు.
Šie ir Leas dēli, ko tā Jēkabam ir dzemdējusi Mezopotamijā, ar Dinu, viņa meitu; visas viņa dēlu un viņa meitu dvēseles bija trīsdesmit un trīs.
16 ౧౬ గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.
Un Gada dēli: Zifions un Hagaja, Šunus, Ecbons, Erus un Arodus un Arelus.
17 ౧౭ ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు.
Un Ašera dēli: Jemnus un Ješvus, Jisvi un Berius un Zera, viņu māsa. Un Berius dēli: Hebers un Malķiēls.
18 ౧౮ లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.
Šie ir Zilfas bērni, ko Lābans Leai, savai meitai, bija devis; un tā dzemdēja Jēkabam šās sešpadsmit dvēseles.
19 ౧౯ యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.
Rahēles, Jēkaba sievas, dēli bija Jāzeps un Benjamins.
20 ౨౦ యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది.
Un Jāzepam dzima Ēģiptē Manasus un Efraīms, ko viņam dzemdēja Asnata, Potifera, Onna priestera, meita.
21 ౨౧ బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు.
Un Benjamina dēli: Belus un Beķers un Ašbels, Ģerus un Naāmans, Eķius un Ros, Mupims un Hupims un Ards.
22 ౨౨ యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.
Šie ir Rahēles dēli, kas Jēkabam ir piedzimuši, - visi kopā četrpadsmit dvēseles.
23 ౨౩ దాను కొడుకు హుషీము.
Dana dēli: Hušims.
24 ౨౪ నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము.
Un Naftalus dēli: Jahceēls un Gunus un Jecers un Šillems.
25 ౨౫ లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు.
Šie ir Bilhas dēli, ko Lābans savai meitai Rahēlei deva, un tā dzemdēja šos Jēkabam, - visi kopā bija septiņas dvēseles.
26 ౨౬ యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు.
Visas dvēseles, kas ar Jēkabu uz Ēģipti nāca, kas no viņa gurniem cēlušās, bez Jēkaba dēlu sievām, visas dvēseles sešdesmit un sešas.
27 ౨౭ ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది.
Un Jāzepa dēli, kas viņam Ēģiptes zemē dzimuši, bija divas dvēseles; visas dvēseles Jēkaba namā, kas uz Ēģipti nāca, bija septiņdesmit.
28 ౨౮ యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు.
Un viņš sūtīja Jūdu savā priekšā pie Jāzepa, ka šis priekš viņa tam ierādītu Gošenes zemi; un tie nāca Gošenes zemē.
29 ౨౯ యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు.
Tad Jāzeps iejūdza savus ratus un gāja savam tēvam Israēlim pretī uz Gošeni, un viņu ieraudzījis tas metās ap viņa kaklu un raudāja ilgi pie viņa kakla.
30 ౩౦ అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు.
Un Israēls sacīja uz Jāzepu: nu es labprāt gribu mirt, kad tavu vaigu esmu redzējis, ka tu vēl esi dzīvs.
31 ౩౧ యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు.
Un Jāzeps sacīja uz saviem brāļiem un uz sava tēva namu: es noiešu un to pasacīšu Faraonam un tam teikšu: mani brāļi un mana tēva nams, kas bija Kanaāna zemē, pie manis atnākuši.
32 ౩౨ వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను.
Un tie vīri ir avju gani, jo tie ir lopu kopēji, un savus sīkos lopus un savus vēršus, un visu, kas tiem pieder, to tie atveduši.
33 ౩౩ కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే
Kad nu Faraons jūs aicinās un jautās, kas ir jūsu amats?
34 ౩౪ ‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”
Tad sakāt: tavi kalpi ir lopu kopēji no mazām dienām līdz šim, tā pat mēs kā mūsu tēvi, lai jūs varat mist Gošenes zemē; jo ēģiptiešiem visi lopu gani bija negantība.