< ఆదికాండము 45 >
1 ౧ అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక “అందరినీ నా దగ్గరనుంచి బయటికి పంపేయండి” అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు.
Joseph was unable to restrain himself any longer, standing before so many. Therefore, he instructed that all should go outside, and that no stranger should be among them as they recognized one another.
2 ౨ అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు.
And he lifted up his voice with weeping, which the Egyptians heard, along with the entire house of Pharaoh.
3 ౩ అప్పుడు యోసేపు “నేను యోసేపును. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా?” అని అడిగినప్పుడు, అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు.
And he said to his brothers: “I am Joseph. Is my father still alive?” His brothers were unable to respond, being terrified by a very great fear.
4 ౪ అప్పుడు యోసేపు “నా దగ్గరికి రండి” అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు “ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే.
And he said to them mildly, “Approach toward me.” And when they had approached close by, he said: “I am Joseph, your brother, whom you sold into Egypt.
5 ౫ అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.
Do not be afraid, and let it not seem to you to be a hardship that you sold me into these regions. For God sent me before you into Egypt for your salvation.
6 ౬ రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.
For it is two years since the famine began to be upon the land, and five years more remain, in which there can be neither plowing, nor reaping.
7 ౭ మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.
And God sent me ahead, so that you may be preserved upon the earth, and so that you would be able to have food in order to live.
8 ౮ కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు.
I was sent here, not by your counsel, but by the will of God. He has caused me to be like a father to Pharaoh, and to be the lord of his entire house, as well as governor throughout all the land of Egypt.
9 ౯ మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో ‘నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు-దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా నియమించాడు, నా దగ్గరికి రండి. ఆలస్యం చేయవద్దు.
Hurry, and go up to my father, and say to him: ‘Your son Joseph commands this: God has caused me to be lord of the entire land of Egypt. Come down to me, do not delay,
10 ౧౦ నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వూ నీ పిల్లలూ నీ పిల్లల పిల్లలూ నీ గొర్రెల మందలూ నీ పశువులూ నీకు కలిగిన సమస్తమూ నాకు దగ్గరగా ఉంటాయి.
and you will live in the land of Goshen. And you will be next to me, you and your sons and the sons of your sons, your sheep and your herds, and all that you possess.
11 ౧౧ ఇంకా ఐదేళ్ళు కరువు ఉంటుంది, కాబట్టి నీకూ నీ ఇంటి వారికీ నీకు కలిగినదానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను’ అన్నాడని చెప్పండి.
And there I will pasture you, (for there are still five years of famine remaining) lest both you and your house perish, along with all that you possess.’
12 ౧౨ ఇదిగో మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళూ నా తమ్ముడు బెన్యామీను కళ్ళూ చూస్తున్నాయి.
Behold, your eyes and the eyes of my brother Benjamin can see that it is my mouth speaking to you.
13 ౧౩ ఐగుప్తులో నాకున్న వైభవాన్నీ మీరు చూసిన సమస్తాన్నీ మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసుకు రండి” అని తన సోదరులతో చెప్పాడు.
You will report to my father about all my glory, and about all that you have seen in Egypt. Hurry, and bring him to me.”
14 ౧౪ తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు.
And then falling upon the neck of his brother Benjamin, he embraced him and wept. And likewise, Benjamin wept at the same time on his neck.
15 ౧౫ అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
And Joseph kissed all his brothers, and he cried over each one. After this, they were emboldened to speak to him.
16 ౧౬ “యోసేపు సోదరులు వచ్చారు” అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది.
And it was overheard, and the news spread by word throughout the king’s court. The brothers of Joseph had arrived, and Pharaoh was gladdened along with all his family.
17 ౧౭ అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు “నీ సోదరులతో ఇలా చెప్పు, ‘మీరిలా చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి
And he told Joseph that he should command his brothers, saying: “‘Burden your beasts, and go into the land of Canaan,
18 ౧౮ మీ తండ్రినీ మీ ఇంటివారిని వెంట బెట్టుకుని నా దగ్గరికి రండి, ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు.
and take from there your father and kindred, and come to me. And I will give you all the good things of Egypt, so that you may eat from the marrow of the land.’”
19 ౧౯ మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి.
“And you may even instruct that they take wagons from the land of Egypt, in order to transport their little ones as well as their wives. And say: ‘Take your father, and come quickly, as soon as possible.
20 ౨౦ ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు’” అన్నాడు.
You need not give up anything from your household, for all the riches of Egypt will be yours.’”
21 ౨౧ ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట ప్రకారం వారికి బండ్లు ఇప్పించాడు. ప్రయాణానికి భోజన పదార్ధాలు ఇప్పించాడు.
And the sons of Israel did just as they were commanded. And Joseph gave them wagons, according to the command of Pharaoh, and provisions for the journey.
22 ౨౨ అతడు వారికి రెండేసి జతల బట్టలు ఇచ్చాడు, బెన్యామీనుకు 300 షెకెల్ ల వెండి, ఐదు జతల బట్టలు ఇచ్చాడు.
Likewise, he ordered two robes for each of them to be brought. Yet truly, to Benjamin he gave three hundred pieces of silver along with five of the best robes.
23 ౨౩ అతడు తన తండ్రి కోసం వీటిని పంపించాడు, ఐగుప్తులోని శ్రేష్ఠమైన వాటిని మోస్తున్న పది గాడిదలనూ ప్రయాణానికి తన తండ్రి కోసం ఆహారం, ఇతర ధాన్యం, వేర్వేరు తినే సరుకులు మోస్తున్న పది ఆడ గాడిదలనూ పంపించాడు.
And he sent just as much money and clothing to his father, adding also ten male donkeys, with which to transport all the riches of Egypt, and as many female donkeys, carrying wheat and bread for the journey.
24 ౨౪ అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే “దారిలో పోట్లాడుకోవద్దు” అని వారితో చెప్పాడు.
Thus he sent away his brothers, and as they set out he said, “Do not become angry on the way.”
25 ౨౫ వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి
And they ascended out of Egypt, and they arrived in the land of Canaan, to their father Jacob.
26 ౨౬ “యోసేపు ఇంకా బతికే ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా ఉన్నాడు” అని అతనికి తెలియచేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేక పోయాడు. అతని హృదయం విస్మయం చెందింది.
And they reported to him, saying: “Your son Joseph is alive, and he is ruler throughout all the land of Egypt. When Jacob heard this, he was stirred up, as if from a deep sleep, yet he did not believe them.
27 ౨౭ అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకు వెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి, వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది.
To the contrary, they explained the entire matter in order. And when he had seen the wagons, and all that he had sent, his spirit revived,
28 ౨౮ అప్పుడు ఇశ్రాయేలు “ఇంతే చాలు. నా కొడుకు యోసేపు బతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూస్తాను” అన్నాడు.
and he said: “It is enough for me, if my son Joseph is still alive. I will go and see him before I die.”