< ఆదికాండము 44 >
1 ౧ యోసేపు “వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు,
И заповеди Јосиф човеку што управљаше кућом његовом говорећи: Наспи овим људима у вреће жита колико могу понети, и свакоме у врећу метни озго новце његове.
2 ౨ చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు” అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.
И чашу моју, чашу сребрну, метни најмлађем у врећу одозго и новце за његово жито. И учини како му Јосиф рече.
3 ౩ తెల్లవారినప్పుడు ఆ మనుషులను తమ గాడిదలతో పాటు పంపి వేశారు.
А ујутру кад свану, отпустише људе с магарцима њиховим.
4 ౪ వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో “నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, ‘మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి?
А кад изађоше из места и још не беху далеко, рече Јосиф човеку што управљаше кућом његовом: Устани, иди брже за оним људима, и кад их стигнеш реци им: Зашто враћате зло за добро?
5 ౫ నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం’ అని వారితో చెప్పు” అన్నాడు.
Није ли то чаша из које пије мој господар? И неће ли по њој зацело познати какви сте? Зло сте радили што сте то учинили.
6 ౬ అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు.
И он их стиже, и рече им тако.
7 ౭ వారు “మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.
А они му рекоше: Зашто говориш, господару, такве речи? Сачувај Боже да слуге твоје учине такво шта!
8 ౮ చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసుకు వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము?
Ено смо ти донели натраг из земље хананске новце које нађосмо озго у врећама својим, па како бисмо украли из куће господара твог сребро или злато?
9 ౯ నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం” అని అతనితో అన్నారు.
У ког се између слуга твојих нађе, онај нека погине, и сврх тога ми ћемо бити робови господару мом.
10 ౧౦ గృహ నిర్వాహకుడు “మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు” అని చెప్పాడు.
А он рече: Нека буде како рекосте; али у кога се нађе, онај да ми буде роб, а ви остали нећете бити криви.
11 ౧౧ అప్పుడు ప్రతివాడూ గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు.
И брже поскидаше сви на земљу вреће своје, и разрешише сваки своју врећу.
12 ౧౨ ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలు పెట్టి చిన్నవాడి సంచి వరకూ వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది.
А он стаде тражити почевши од најстаријег, и кад дође на најмлађег, нађе се чаша у врећи Венијаминовој.
13 ౧౩ వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు.
Тада раздреше хаљине своје, и натоваривши сваки свој товар на свог магарца вратише се у град.
14 ౧౪ అప్పుడు యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు, వారు అతని ముందు నేలమీద సాగిలపడ్డారు.
И дође Јуда с браћом својом Јосифу у кућу, док он још беше код куће, и падоше пред њим на земљу.
15 ౧౫ అప్పుడు యోసేపు “మీరు చేసిన ఈ పని ఏమిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా” అని వారితో అన్నాడు.
А Јосиф им рече: Шта сте то учинили? Зар нисте знали да човек као што сам ја може зацело дознати?
16 ౧౬ యూదా “మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం” అన్నాడు.
Тада рече Јуда: Шта да ти кажемо, господару? Шта да говоримо? Како ли да се правдамо? Бог је открио злочинство твојих слуга. Ево, ми смо сви робови твоји, господару, и ми и овај у кога се нашла чаша.
17 ౧౭ యోసేపు “అలా చేయడం నాకు దూరమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరికి సమాధానంగా వెళ్ళండి” అని చెప్పాడు.
А Јосиф рече: Боже сачувај! Нећу ја то; у кога се нашла чаша он нека ми буде роб, а ви идите с миром оцу свом.
18 ౧౮ యూదా అతని సమీపించి “ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా.
Али Јуда приступив к њему рече: Чуј ме, господару; допусти да проговори слуга твој господару свом, и нека се гнев твој не распали на слугу твог, јер си ти као сам Фараон.
19 ౧౯ నా యజమానులైన మీరు, ‘మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా?’ అని తమ దాసులను అడిగారు.
Господар мој запита слуге своје говорећи: Имате ли оца или брата?
20 ౨౦ అందుకు మేము, ‘మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు’ అన్నాము.
А ми рекосмо господару свом: Имамо старог оца и брата најмлађег, који му се роди у старости; а његов је брат умро, и он оста сам од матере своје, и отац га пази.
21 ౨౧ అప్పుడు తమరు, ‘నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరికి తీసుకు రండి’ అని తమ దాసులతో చెప్పారు.
А ти рече слугама својим: Доведите ми га да видим својим очима.
22 ౨౨ అందుకు మేము, ‘ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు’ అని నా యజమానులైన మీతో చెప్పాము.
И рекосмо господару свом: Неће моћи дете оставити оца свог; да остави оца свог, одмах ће отац умрети.
23 ౨౩ అందుకు తమరు, ‘మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మళ్లీ నా ముఖం చూడకూడదు’ అని తమ దాసులతో చెప్పారు.
А ти рече слугама својим: Ако не дође брат ваш најмлађи, нећете видети лице моје.
24 ౨౪ కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరికి మేము వెళ్ళి, నా యజమానులైన మీ మాటలను అతనికి తెలియచేశాము.
А кад се вратисмо к слузи твом а оцу мом, казасмо му речи господара мог.
25 ౨౫ మా తండ్రి, ‘మీరు తిరిగి వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కుని రండి’ అని చెబితే
После рече нам отац: Идите опет, купите нам хране.
26 ౨౬ ‘మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము’ అని చెప్పాము.
А ми рекосмо: Не можемо ићи, осим ако буде брат наш најмлађи с нама, онда ћемо ићи, јер не можемо видети лица оног човека, ако не буде с нама брат наш најмлађи.
27 ౨౭ అందుకు తమ దాసుడైన నా తండ్రి, ‘నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు.
А слуга твој, отац мој, рече нам: Знате да ми је жена родила два сина.
28 ౨౮ వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు.
И један од њих отиде од мене, и рекох: Зацело га је раскинула зверка; и до сада га не видех.
29 ౨౯ మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు’ అని మాతో చెప్పాడు. (Sheol )
Ако и овог одведете од мене и задеси га како зло, свалићете ме старог у гроб с тугом. (Sheol )
30 ౩౦ కాబట్టి, తమ దాసుడైన నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతో బాటు లేకపోతే
Па сада да отидем к слузи твом, оцу свом, а ово дете да не буде с нама, како је душа оног везана за душу овог,
31 ౩౧ మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తాము. (Sheol )
Умреће кад види да нема детета, те ће слуге твоје свалити старог слугу твог, а оца свог, с тугом у гроб. (Sheol )
32 ౩౨ తమ సేవకుడినైన నేను, ‘ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరికి నేనతని తీసుకు రాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పాను.
А твој се слуга подјемчио за дете оцу свом рекавши: Ако ти га не доведем натраг, да сам крив оцу свом до века.
33 ౩౩ కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి.
Зато нека слуга твој остане место детета, да буде роб господару мом, а дете нека иде с браћом својом.
34 ౩౪ ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది” అని చెప్పాడు.
Јер како бих се вратио к оцу свом без детета, да гледам јаде који би ми оца задесили?