< ఆదికాండము 42 >
1 ౧ ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు తెలుసుకుని “మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారేంటి?” అని తన కొడుకులతో అన్నాడు.
And Jacob seeth that there is corn in Egypt, and Jacob saith to his sons, 'Why do you look at each other?'
2 ౨ “చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను. మనం చావకుండా బతికేలా మీరు అక్కడికి వెళ్ళి మన కోసం అక్కడనుంచి ధాన్యం కొనుక్కురండి” అన్నాడు.
he saith also, 'Lo, I have heard that there is corn in Egypt, go down thither, and buy for us from thence, and we live and do not die;'
3 ౩ యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనడానికి వెళ్ళారు.
and the ten brethren of Joseph go down to buy corn in Egypt,
4 ౪ అయితే యాకోబు “అతనికి ఏదైనా హాని సంభవిస్తుందేమో” అని యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపలేదు.
and Benjamin, Joseph's brother, Jacob hath not sent with his brethren, for he said, 'Lest mischief meet him.'
5 ౫ కరువు కనాను దేశంలో ఉంది కాబట్టి ధాన్యం కొనడానికి వచ్చిన వారితో ఇశ్రాయేలు కొడుకులు కూడా వచ్చారు.
And the sons of Israel come to buy in the midst of those coming, for the famine hath been in the land of Canaan,
6 ౬ అప్పుడు యోసేపు ఆ దేశానికి అధికారిగా ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యాన్ని అమ్మేవాడు కాబట్టి యోసేపు అన్నలు వచ్చి ముఖాలు వంచి నేలకు వంగి యోసేపుకు నమస్కారం చేశారు.
and Joseph is the ruler over the land, he who is selling to all the people of the land, and Joseph's brethren come and bow themselves to him — face to the earth.
7 ౭ యోసేపు తన అన్నలను చూసి వారిని గుర్తు పట్టి వారికి తెలియని మనిషిలా వారితో కఠినంగా మాట్లాడి “మీరెక్కడనుండి వచ్చారు?” అని అడిగాడు. అందుకు వారు “ఆహారం కొనడానికి కనాను దేశం నుండి వచ్చాము” అన్నారు.
And Joseph seeth his brethren, and discerneth them, and maketh himself strange unto them, and speaketh with them sharp things, and saith unto them, 'From whence have ye come?' and they say, 'From the land of Canaan — to buy food.'
8 ౮ యోసేపు తన అన్నలను గుర్తు పట్టాడు గాని వారు అతణ్ణి గుర్తు పట్టలేదు.
And Joseph discerneth his brethren, but they have not discerned him,
9 ౯ యోసేపు వారిని గూర్చి తనకు వచ్చిన కలలను గుర్తుకు తెచ్చుకుని “మీరు గూఢచారులు. ఈ దేశపు గుట్టు తెలుసుకోడానికి వచ్చారు” అన్నాడు.
and Joseph remembereth the dreams which he dreamed of them, and saith unto them, 'Ye [are] spies; to see the nakedness of the land ye have come.'
10 ౧౦ వారు “లేదు ప్రభూ, మీ దాసులైన మేము ఆహారం కొనడానికే వచ్చాము.
And they say unto him, 'No, my lord, but thy servants have come to buy food;
11 ౧౧ మేమంతా ఒక తండ్రి కొడుకులం. మేము నిజాయితీగల వాళ్ళం. నీ దాసులమైన మేము గూఢచారులం కాదు” అని బదులిచ్చారు.
we [are] all of us sons of one man, we [are] right men; thy servants have not been spies;'
12 ౧౨ అయితే అతడు వారితో “కాదు, ఈ దేశం గుట్టు తెలుసుకోడానికి మీరు వచ్చారు” అన్నాడు.
and he saith unto them, 'No, but the nakedness of the land ye have come to see;'
13 ౧౩ అందుకు వారు “నీ దాసులమైన మేము పన్నెండుగురు అన్నదమ్ములం. కనాను దేశంలో ఉన్న ఒక తండ్రి కొడుకులం. ఇదిగో, అందరిలో చిన్నవాడు ఈ రోజు మా నాన్న దగ్గర ఉన్నాడు. ఒకడు లేడు” అన్నారు.
and they say, 'Thy servants [are] twelve brethren; we [are] sons of one man in the land of Canaan, and lo, the young one [is] with our father to-day, and the one is not.'
14 ౧౪ అయితే యోసేపు “కాదు, నేను చెప్పినట్టు మీరు గూఢచారులే.
And Joseph saith unto them, 'This [is] that which I have spoken unto you, saying, Ye [are] spies,
15 ౧౫ మీ అసలు సంగతి ఇలా తెలుస్తుంది. ఫరో జీవం తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే తప్ప మీరిక్కడనుంచి వెళ్ళరు.
by this ye are proved: Pharaoh liveth! if ye go out from this — except by your young brother coming hither;
16 ౧౬ మీ తమ్ముణ్ణి తీసుకురావడానికి మీలో ఒకణ్ణి పంపండి. అప్పటి వరకూ మీరు ఇక్కడ బందీలుగా ఉంటారు. మీలో నిజముందో లేదో మీ మాటల్లో తెలుస్తుంది. లేకపోతే ఫరో జీవం తోడు, మీరు గూఢచారులే” అని చెప్పి
send one of you, and let him bring your brother, and ye, remain ye bound, and let your words be proved, whether truth be with you: and if not — Pharaoh liveth! surely ye [are] spies;'
17 ౧౭ వారిని మూడు రోజులు చెరసాలలో వేయించాడు.
and he removeth them unto charge three days.
18 ౧౮ మూడవ రోజు యోసేపు వారిని చూసి “నేను దేవునికి భయపడే వాణ్ణి. మీరు బతకాలంటే ఇలా చేయండి.
And Joseph saith unto them on the third day, 'This do and live; God I fear!
19 ౧౯ మీరు నిజాయితీగల వారైతే మీ సోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో ఉండాలి. మిగతావారు మీ ఇంటి వారి కరువు తీరడానికి ధాన్యం తీసుకు వెళ్ళండి.
if ye [are] right men, let one of your brethren be bound in the house of your ward, and ye, go, carry in corn [for] the famine of your houses,
20 ౨౦ మీ తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీ మాటలు నిజమే అని తెలుస్తుంది, మీరు చావరు” అని చెప్పాడు. కాబట్టి వారు అలా చేశారు.
and your young brother ye bring unto me, and your words are established, and ye die not;' and they do so.
21 ౨౧ అప్పుడు వారు ఒకడితో ఒకడు “మన తమ్ముని విషయంలో మనం నిజంగా అపరాధులమే. అతడు మనలను బతిమాలినప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినలేదు.”
And they say one unto another, 'Verily we [are] guilty concerning our brother, because we saw the distress of his soul, in his making supplication unto us, and we did not hearken: therefore hath this distress come upon us.'
22 ౨౨ రూబేను “ఈ చిన్నవాడి పట్ల పాపం చేయవద్దని నేను మీతో చెప్పినా మీరు వినలేదు, కాబట్టి అతని చావును బట్టి మనకు తగిన శాస్తి జరుగుతున్నది” అని వారితో అన్నాడు.
And Reuben answereth them, saying, 'Spake I not unto you, saying, Sin not against the lad? and ye hearkened not; and his blood also, lo, it is required.'
23 ౨౩ వారి మాటలు యోసేపుకు అర్థమయ్యాయని వారికి తెలియదు, ఎందుకంటే వారి మధ్య తర్జుమా చేసేవాడు ఒకడున్నాడు.
And they have not known that Joseph understandeth, for the interpreter [is] between them;
24 ౨౪ యోసేపు వారి దగ్గరనుండి అవతలకు పోయి ఏడ్చాడు. వారి దగ్గరికి తిరిగి వచ్చి వారితో మాట్లాడాడు. వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కళ్ళెదుటే అతన్ని బంధించాడు.
and he turneth round from them, and weepeth, and turneth back unto them, and speaketh unto them, and taketh from them Simeon, and bindeth him before their eyes.
25 ౨౫ తన అన్నల సంచుల్లో ధాన్యం నింపమనీ, ఎవరి డబ్బులు వారి సంచుల్లోనే తిరిగి ఉంచమనీ, ప్రయాణం కోసం భోజనపదార్ధాలు వారికివ్వాలనీ తన పనివారికి ఆజ్ఞాపించాడు.
And Joseph commandeth, and they fill their vessels [with] corn, also to put back the money of each unto his sack, and to give to them provision for the way; and one doth to them so.
26 ౨౬ వారు, తాము కొనిన ధాన్యాన్ని గాడిదల మీద ఎక్కించుకుని అక్కడనుంచి వెళ్ళిపోయారు.
And they lift up their corn upon their asses, and go from thence,
27 ౨౭ అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టడానికి తన సంచి విప్పితే అతని ధనం కనబడింది. అవి అతని సంచి మూతిలో ఉన్నాయి.
and the one openeth his sack to give provender to his ass at a lodging-place, and he seeth his money, and lo, it [is] in the mouth of his bag,
28 ౨౮ అప్పుడతడు “నా డబ్బు నాకే ఉంది. చూడండి, నా సంచిలోనే ఉంది” అని తన సోదరులతో అన్నాడు. వారి గుండెలు అదిరిపోయాయి. వారు వణికిపోతూ ఒకరితో ఒకరు “ఇదేంటి దేవుడు మనకిలా చేశాడు?” అనుకున్నారు.
and he saith unto his brethren, 'My money hath been put back, and also, lo, in my bag:' and their heart goeth out, and they tremble, one to another saying, 'What [is] this God hath done to us!'
29 ౨౯ వారు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చి తమకు జరిగినదంతా అతనికి తెలియచేశారు.
And they come in unto Jacob their father, to the land of Canaan, and they declare to him all the things meeting them, saying,
30 ౩౦ “ఆ దేశానికి అధిపతి, మాతో కఠినంగా మాట్లాడి, మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చామనుకున్నాడు.
'The man, the lord of the land, hath spoken with us sharp things, and maketh us as spies of the land;
31 ౩౧ అప్పుడు మేము, ‘అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢచారులం కాదు.
and we say unto him, We [are] right men, we have not been spies,
32 ౩౨ పన్నెండు మంది సోదరులం, ఒక్క తండ్రి కొడుకులం, ఒకడు లేడు, చిన్నవాడు ఇప్పుడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు’ అని అతనితో చెప్పాము.
we [are] twelve brethren, sons of our father, the one is not, and the young one [is] to-day with our father in the land of Canaan.
33 ౩౩ అందుకు ఆ దేశాధిపతి, మాతో ‘మీరు నిజాయితీపరులని ఇలా తెలుసుకుంటాను. మీ సోదరుల్లో ఒకణ్ణి నా దగ్గర విడిచిపెట్టి, మీ ఇంట్లోవారికి కరువు తీరేలా ధాన్యం తీసుకు వెళ్ళండి.
'And the man, the lord of the land, saith unto us, By this I know that ye [are] right men — one of your brethren leave with me, and [for] the famine of your houses take ye and go,
34 ౩౪ నా దగ్గరికి ఆ చిన్నవాణ్ని తీసుకు రండి. అప్పుడు మీరు నిజాయితీపరులనీ గూఢచారులు కారనీ నేను తెలుసుకుని మీ సోదరుణ్ణి మీకప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు’ అని చెప్పాడు” అన్నారు.
and bring your young brother unto me, and I know that ye [are] not spies, but ye [are] right men; your brother I give to you, and ye trade with the land.'
35 ౩౫ వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారూ వారి తండ్రీ ఆ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు.
And it cometh to pass, they are emptying their sacks, and lo, the bundle of each man's silver [is] in his sack, and they see their bundles of silver, they and their father, and are afraid;
36 ౩౬ అప్పుడు వారి తండ్రి యాకోబు “మీరు నా పిల్లల విషయంలో నన్ను దుఃఖానికి గురిచేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుపోతారు. ఇవన్నీ నా మీదికే వచ్చాయి” అని వారితో అన్నాడు.
and Jacob their father saith unto them, 'Me ye have bereaved; Joseph is not, and Simeon is not, and Benjamin ye take — against me have been all these.'
37 ౩౭ అందుకు రూబేను “నేనతన్ని నీ దగ్గరికి తీసుకు రాకపోతే, నా ఇద్దరు కొడుకులను నువ్వు చంపెయ్యవచ్చు. అతన్ని నా చేతికి అప్పగిస్తే, అతన్ని తిరిగి మీ దగ్గరికి తీసుకు వస్తాను” అని చెప్పాడు.
And Reuben speaketh unto his father, saying, 'My two sons thou dost put to death, if I bring him not in unto thee; give him into my hand, and I — I bring him back unto thee;'
38 ౩౮ అయితే అతడు “నా కొడుకును మీతో వెళ్ళనివ్వను. అతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలాడు. మీరు వెళ్ళే దారిలో ఇతనికి హాని కలిగితే తల నెరిసిన నన్ను దుఃఖంతో మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు” అన్నాడు. (Sheol )
and he saith, 'My son doth not go down with you, for his brother [is] dead, and he by himself is left; when mischief hath met him in the way in which ye go, then ye have brought down my grey hairs in sorrow to sheol.' (Sheol )