< ఆదికాండము 41 >

1 రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు.
І сталося по закінченні двох літ ча́су, і сниться фараонові, — ось він стоїть над Річкою.
2 పుష్టిగా ఉన్న అందమైన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
І ось виходять із Річки семеро корів гарного вигляду й ситого тіла, — і па́слися на лузі.
3 వాటి తరువాత వికారంగా, బక్కచిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి.
А ось виходять із Річки за ними семеро корів інших, бридкі виглядом і худі тілом. І вони стали при тих коровах на березі Річки.
4 అప్పుడు అందవిహీనమైనవీ చిక్కిపోయినవీ అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు.
І корови бридкі́ виглядом і худі тілом поз'їда́ли сім корів гарних виглядом і ситих. І прокинувся фараон.
5 అతడు నిద్రపోయి రెండవసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల ఏడు కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది.
І знову заснув він. І снилося йому вдруге, — аж ось сходять на однім стеблі семеро колосків здорових та добрих.
6 తూర్పుగాలి వల్ల పాడైపోయిన ఏడు తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి.
А ось виростає за ними семеро колосків тонких та спалених східнім вітром.
7 అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలుకంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకుని అది కల అని గ్రహించాడు.
І проковтнули ті тонкі́ колоски сім колосків здорових та повних. І прокинувся фараон, — а то був сон.
8 ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు.
І сталося рано, — і занепоко́ївся дух його. І послав він, і поскликав усіх ворожбитів Єгипту та всіх мудреців його. І фараон розповів їм свій сон, — та ніхто не міг відгадати їх фараонові.
9 అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు “ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది.
І говорив начальник чашників з фараоном, кажучи: „Я сьогодні згадую гріхи свої.
10 ౧౦ ఫరో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు.
Розгнівався був фараон на рабів своїх, і вмістив мене під варту дому начальника царсько́ї сторожі, мене й начальника пекарів.
11 ౧౧ ఒకే రాత్రి నేనూ అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము.
І однієї ночі снився нам сон, мені та йому, кожному снився сон за своїм зна́ченням.
12 ౧౨ అక్కడ రాజ అంగ రక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడ ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు.
А там з нами був єврейський юнак, раб начальника царської сторожі. І ми розповіли́ йому, а він відгадав нам наші сни, кожному за сном його відгадав.
13 ౧౩ అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరేవాడిని ఉరి తీయించారు” అని ఫరోతో చెప్పాడు.
І сталося, — як він відгадав нам, так і трапилося: мене ти вернув на становище моє, а того повісив“.
14 ౧౪ ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.
І послав фараон, і покликав Йо́сипа, — і його сквапно вивели з в'язниці. І оголився, і змінив одежу свою, — і він прибув до фараона.
15 ౧౫ ఫరో యోసేపుతో “నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను” అన్నాడు.
І промовив фараон до Йосипа: „Снився мені сон, та нема, хто б відгадав його. А я чув про тебе таке: ти вислухуєш сон, щоб відгадати його“.
16 ౧౬ యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు.
А Йосип сказав до фараона, говорячи: „Не я, — Бог дасть у відповідь мир фараонові“.
17 ౧౭ అందుకు ఫరో “నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను.
І сказав фараон до Йосипа: „ Бачив я в сні своїм — ось я стою на березі Річки.
18 ౧౮ బలిసిన, అందమైన ఏడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
І ось виходять із Річки семеро корів ситих тілом і гарних виглядом. І вони па́слися на лузі.
19 ౧౯ నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు.
А ось виходять за ними семеро корів інші, бідні та дуже бридкі виглядом і худі тілом. Таких бридки́х, як вони, я не бачив у всьому краї єгипетському.
20 ౨౦ చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినేశాయి.
І корови худі та бридкі поз'їда́ли сім корів перших ситих.
21 ౨౧ అవి వాటి కడుపులో పడ్డాయి గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను.
І ввійшли вони до черева їхнього, та не було знати, що ввійшли вони до черева їхнього, — і вигляд їх був лихий, як на початку. І я прокинувся.
22 ౨౨ నా కలలో నేను చూస్తే, పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి.
І побачив я в сні своїм знов, аж ось сходять на однім стеблі семеро колосків повних та добрих.
23 ౨౩ తూర్పు గాలిచేత చెడిపోయి, ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి.
А ось виростає за ними семеро колосків худих, тонких, спалених східнім вітром.
24 ౨౪ ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసే వారెవరూ లేరు” అని అతనితో చెప్పాడు.
І проковтнули ті тонкі колоски сім колосків добрих. І розповів я те ворожбитам, та не було, хто б мені роз'яснив“.
25 ౨౫ అందుకు యోసేపు “ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు, ఏడేళ్ళు.
І сказав Йо́сип до фараона: „Сон фараонів — один він. Що́ Бог робить, те Він звістив фараонові.
26 ౨౬ ఆ ఏడు మంచికంకులు ఏడేళ్ళు.
Семеро корів добрих — то сім літ, і семеро колосків добрих — сім літ вони. А сон — один він.
27 ౨౭ కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులూ ఏడేళ్ళు. తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు తాలువెన్నులు, ఏడేళ్ళ కరువు.
А сім корів худих і бридки́х, що вийшли за ними, — сім літ вони, і сім колосків порожніх і спалених східнім вітром — то бу́дуть сім літ голодних.
28 ౨౮ నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు.
Оце та річ, що я сказав був фараонові: Що́ Бог робить, те Він показав фараонові.
29 ౨౯ ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళు రాబోతున్నాయి.
Ось приходять сім літ, — великий достаток у всім краї єгипетськім.
30 ౩౦ వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది.
А по них настануть сім літ голодних, — і буде забутий увесь той достаток в єгипетській землі, і голод винищить край.
31 ౩౧ దాని తరువాత వచ్చే కరువుచేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది.
І не буде видно того достатку в краї через той голод, що настане по́тім, бо він буде дуже тяжки́й.
32 ౩౨ ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీన్ని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది.
А що сон повторився фараонові двічі, це значить, що справа ця постановлена від Бога, і Бог незабаром виконає її.
33 ౩౩ కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి.
А тепер нехай фараон наздрить чоловіка розумного й мудрого, і нехай поставить його над єгипетською землею.
34 ౩౪ ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి.
Нехай учинить фараон, і нехай призна́чить урядників над краєм, і нехай за сім літ достатку збирає п'ятину врожаю єгипетської землі.
35 ౩౫ వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి.
І нехай вони позбирають усю їжу тих добрих років, що приходять, і нехай вони позбирають збіжжя під руку фараонову, на їжу по містах, і нехай бережуть.
36 ౩౬ కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది” అని ఫరోతో చెప్పాడు.
І буде та їжа на запа́с для краю на сім літ голодних, що настануть в єгипетській землі, — і край не буде знищений голодом“.
37 ౩౭ ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది.
І була ця річ добра в оча́х фараона та в очах усіх його рабів.
38 ౩౮ ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు.
І сказав фараон своїм рабам: „Чи зна́йдеться чоловік, як оцей, що Дух Божий у нім?“
39 ౩౯ ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు.
І сказав фараон Йосипові: „Що Бог відкрив тобі це все, то немає такого розумного й мудрого, як ти.
40 ౪౦ నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు.
Ти бу́деш над домом моїм, а слів твоїх уст буде слухатися ввесь наро́д мій. Тільки троном я буду вищий від тебе“.
41 ౪౧ ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు.
І сказав фараон Йо́сипові: „Дивись, — я поставив тебе над усім краєм єгипетським“.
42 ౪౨ ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.
І зняв фараон персня свого з своєї руки, та й дав його на руку Йо́сипову, і зодягнув його в одежу віссо́нну, а на шию йому повісив золотого ланцюга.
43 ౪౩ తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ “నమస్కారం చేయండి” అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు.
І зробив, що він їздив його другим по́возом, і кричали перед обличчям його: „Кланяйтеся!“І поставив його над усім єгипетським краєм.
44 ౪౪ ఫరో యోసేపుతో “నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు” అన్నాడు.
І сказав фараон Йосипові: „Я фараон, а без тебе ніхто не підійме своєї руки та своєї ноги в усім краї єгипетськім“.
45 ౪౫ ఫరో, యోసేపుకు “జఫనత్ పనేహు” అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు.
І назвав фараон ім'я Йосипові: Цофнат-Панеах, і дав йому за жінку Оснату, дочку Поті-Фера, жерця Ону. І Йосип піднявся над єгипетським краєм.
46 ౪౬ యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ముప్ఫై ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గరనుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు.
А Йосип був віку тридцяти літ, коли він став перед лицем фараона, царя єгипетського. І пішов Йосип від лиця фараонового, і перейшов через увесь єгипетський край.
47 ౪౭ సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది.
А земля в сім літ достатку родила на повні жмені.
48 ౪౮ ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వచేశాడు.
І зібрав він усю їжу семи літ, що була в єгипетськім кра́ї, і вмістив їжу по містах: їжу поля міста, що навколо нього, вмістив у ньо́му.
49 ౪౯ యోసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలవ చేశాడు. అది కొలతకు మించిపోయింది కాబట్టి దాన్నిక కొలవడం మానుకున్నారు.
І зібрав Йо́сип збіжжя дуже багато, як мо́рський пісок, аж перестав рахувати, бо не було вже числа.
50 ౫౦ కరువు కాలం ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు వారికి తల్లి.
А Йосипові, поки прийшов рік голодний, уродилися два сини, що вродила йому Осната, дочка Поті-Фера, жерця Ону.
51 ౫౧ అప్పుడు యోసేపు “దేవుడు నా కష్టాన్నంతా మా నాన్న ఇంట్లో వారందరినీ నేను మరచిపోయేలా చేశాడు” అని తన పెద్దకొడుక్కి “మనష్షే” అనే పేరు పెట్టాడు.
І назвав Йо́сип ім'я́ перворідному: Манасі́я, бо „Бог зробив мені, що я забув усе своє терпіння та ввесь дім мого батька“.
52 ౫౨ “నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అని రెండో కొడుక్కి “ఎఫ్రాయిము” అనే పేరు పెట్టాడు.
А ймення другому назвав: Єфрем, бо „розмножив мене Бог у краї недолі моєї“.
53 ౫౩ ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి.
І скінчи́лися сім літ достатку, що були в єгипетськім краї.
54 ౫౪ యోసేపు చెప్పిన ప్రకారం ఏడేళ్ళ కరువు మొదలయింది గాని ఐగుప్తు దేశమంతటా ఆహారముంది.
І зачали наступати сім літ голодні, як сказав був Йосип. І був голод по всіх краях, а в усім єгипетськім краї був хліб.
55 ౫౫ ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో “మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి” అని ఐగుప్తీయులందరితో చెప్పాడు.
Але виголоднів увесь єгипетський край, а наро́д став кричати до фараона про хліб. І сказав фараон усьому Єгиптові: „Ідіть до Йосипа. Що́ він вам скаже, те робіть“.
56 ౫౬ ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది.
І був той голод на всій поверхні землі. І відчинив Йосип усе, що було́ в них, і продавав поживу Єгиптові. А голод зміцнявся в єгипетськім краї.
57 ౫౭ ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండడం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది.
І прибували зо всієї землі до Йосипа купити поживи, бо голод зміцнявся по всій землі.

< ఆదికాండము 41 >