< ఆదికాండము 40 >
1 ౧ ఆ తరువాత ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడూ, రొట్టెలు చేసేవాడూ తమ యజమాని పట్ల నేరం చేశారు.
Bangʼ ndalo moko jagam divai kod jated makati mar Farao ruodh Misri nochwanyo ruoth.
2 ౨ తన ఇద్దరు ఉద్యోగస్థులు, అంటే గిన్నె అందించే వాడి మీదా రొట్టెలు చేసే వాడి మీదా ఫరో కోపగించుకున్నాడు.
Mirima nomako Farao gi jotichge ariyogo, ma gin jotend jagam divai kod jatend joma tedo makati.
3 ౩ వారిని చెరసాలలో ఉంచడానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. ఆ చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు.
Kendo noketogi e od twech kama jatend askeche mar od twech notweyoe Josef.
4 ౪ ఆ అధిపతి వారందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడు. అతడు వారి బాగోగులు చూసేవాడు. వారు కొన్నిరోజులు బందీలుగా ఉన్న తరువాత
Jatend askeche noketogi e lwet Josef mondo oritgi. Bangʼ kane gisebedo e od twech kuom kinde moko,
5 ౫ వారిద్దరూ, అంటే ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు ఒకే రాత్రి కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావాలతో కల కన్నారు.
moro ka moro kuom ji ariyogi mane gin jatend jogam divai kod jatend joted makati mar ruodh Misri mane oyudo otwe, noleko lek otienono moro ka moro, kendo lek ka lek ne nigi tiende mopogore gi machielo.
6 ౬ ఉదయాన యోసేపు వారి దగ్గరికి వచ్చి చూసినపుడు వారు విచారంగా ఉన్నారు.
Kane Josef obiro irgi kinyne gokinyi, noneno ka chunygi ool.
7 ౭ అతడు “మీరెందుకు విచారంగా ఉన్నారు?” అని వారిని అడిగాడు.
Kuom mano nopenjo jatich Farao mane ni kode e od twechgo niya, “Angʼo ma omiyo uol kawuono?”
8 ౮ అందుకు వారు “మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు” అన్నారు. యోసేపు వారితో “అర్థాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి” అన్నాడు.
Negidwoke niya, “Waduto nyoro waleko lek mopogore opogore, to onge ngʼama nyalo lokonwa tiendgi.” Eka Josef nowachonegi niya, “Donge fwenyo tiend lek aa mane kuom Nyasaye? Emomiyo yieuru unyisa lekugo.”
9 ౯ అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుతో “నా కలలో ఒక ద్రాక్షతీగ నా ఎదుట ఉంది.
Kuom mano jatend jogam Divai nonyiso Josef lek mane oleko. Nowachone niya, “E lekna nende aleko ni aneno yadh mzabibu e nyima,
10 ౧౦ ఆ ద్రాక్షతీగకు మూడు కొమ్మలున్నాయి. దానికి మొగ్గలొచ్చి పూలు పూసి గెలలు పండి ద్రాక్షపళ్ళు వచ్చాయి.
kendo e yadh mzabibuno ne nitie bede adek. Kane ochako loth, nogolo thiepene kendo neginyago mzabibu mochiek mana gikanyono.
11 ౧౧ ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్షపళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను” అని చెప్పాడు.
Kikombe Farao ne ni e lweta, kendo nakawo olembe mag mzabibu mi abiyogi e kikombe mar Farao kendo aketo kikombe e lwete.”
12 ౧౨ అప్పుడు యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు కొమ్మలు, మూడు రోజులు.
Josef nowachone niya, “Ma e tiend lek mane ilekono. Bede yadh mzabibu adekgo nyiso ndalo adek.
13 ౧౩ ఇంక మూడు రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు.
Bangʼ ndalo adek Farao biro gonyi kendo dwoki e tiji, kendo ibiro keto kikombe Farao e lwete mana kaka yande kitimo kane in jatingʼ divai mare.
14 ౧౪ అయితే నీకంతా సరి అయినప్పుడు నన్ను గుర్తు చేసుకుని నామీద దయ చూపించు. ఫరో దగ్గర నా గురించి మాట్లాడి ఈ చెరసాల నుండి నేను బయటికి వచ్చేలా చూడు.
To ka gik moko duto otimoreni maber, ipara kendo itimna ngʼwono; iwuona gi Farao mondo ogola e od twech.
15 ౧౫ ఎందుకంటే నన్ను హెబ్రీయుల దేశం నుండి దొంగిలించి తీసుకొచ్చారు. ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు” అన్నాడు.
Nikech nomaka githuon ka igola e piny jo-Hibrania, kendo kata mana kaonge gima rach ma asetimo manyalo miyo abedie od twech ka.”
16 ౧౬ రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో “నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి.
Kane jatend joted makati oneno ni Josef oloko tiend lek maber, nowachone Josef niya, “An bende ne aleko kama: Atonge adek mag makati ne ni e wiya.
17 ౧౭ పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు.
Ei atonga mamalo ne nitie chiemo duto motedi ni Farao, to winy ne chamogi ei atonga mamalono.”
18 ౧౮ యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు.
Josef nowachone niya, “Ma e tiend leknino. Atonge adek nyiso ndalo adek.
19 ౧౯ ఇంక మూడు రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి” అని జవాబిచ్చాడు.
Kapok okadho ndalo adek Farao biro golie od twech, kendo obiro ngʼado wiyi oko manolieri e yath kendo winy biro chamo ringri.”
20 ౨౦ మూడవ రోజు ఫరో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైనా రొట్టెలు చేసే వారి నాయకుడిపైనా మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు.
Koro odiechiengʼ mar adek ne en odiechieng rapar mar nywol Farao, kendo noloso nyasi ne jotije duto. Nogonyo jatend jogam divai kod jatend joted makati moketogi e nyim jodonge.
21 ౨౧ గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు, కాబట్టి అతడు ఫరో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు.
Nodwoko jatend jogam divai e tije, mondo omi ochak oket kikombe e lwet Farao,
22 ౨౨ యోసేపు చెప్పినట్టుగా రొట్టెలు చేసేవారి నాయకుణ్ణి ఉరి తీయించాడు.
to jatend joted makati nonego, mana kaka Josef noselokonegi tiend lekgi.
23 ౨౩ అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు చేస్తానన్న సాయం గురించి పట్టించుకోలేదు. అసలు అతని గురించి మరచిపోయాడు.
To kata kamano jatend jogam divai ne ok oparo Josef; wiye nowil kode.