< ఆదికాండము 35 >
1 ౧ దేవుడు యాకోబుతో “నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు” అని చెప్పాడు.
And God said to Jacob, "Arise, go up to Bethel, and live there. Make an altar there to God, who appeared to you when you fled from your brother Esau."
2 ౨ యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో “మీ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకుని, మీ వస్త్రాలు మార్చుకోండి.
Then Jacob said to his household and to all who were with him, "Get rid of the foreign gods that you have among you, and purify yourselves and change your clothes.
3 ౩ మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను” అని చెప్పాడు.
Let us arise and go up to Bethel, and I will make an altar there to God, who answered me in the day of my distress, and has been with me wherever I went."
4 ౪ వారు తమ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.
So they gave to Jacob all the foreign gods which were in their possession, and the rings that were in their ears, and Jacob buried them under the oak that was near Shechem.
5 ౫ వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు.
Then they set out, and a terror of God was upon the cities that were around them, so that they did not pursue the sons of Jacob.
6 ౬ యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.
So Jacob came to Luz (that is, Bethel), which is in the land of Canaan, he and all the people who were with him.
7 ౭ అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఏల్ బేతేలు అని పేరు పెట్టారు.
He built an altar there, and called the place El Bethel, because there God had revealed himself to him when he was fleeing from his brother.
8 ౮ రిబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి, దానికి అల్లోన్ బాకూత్ అనే పేరు పెట్టారు.
Now Deborah, Rebekah's nurse, died, and she was buried under an oak outside Bethel. So he called its name Allon Bakuth.
9 ౯ యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.
And God appeared to Jacob again after he returned from Paddan Aram, and blessed him.
10 ౧౦ అప్పుడు దేవుడు అతనితో “నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు” అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
God said to him, "Your name is Jacob. Your name will no longer be called Jacob, but your name will be Israel." So he called his name Israel.
11 ౧౧ దేవుడు “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.
And God said to him, "I am El Shaddai. Be fruitful and multiply. A nation and a company of nations will come from you, and kings will come from your body.
12 ౧౨ నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను” అని అతనితో చెప్పాడు.
The land which I gave to Abraham and Isaac, I will give to you, and I will give the land to your descendants after you."
13 ౧౩ దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు.
Then God went up from him in the place where he spoke with him.
14 ౧౪ దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దాని మీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.
And Jacob set up a standing-stone in the place where he spoke with him, a pillar of stone. And he poured out a drink offering on it, and poured oil on it.
15 ౧౫ తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు.
Jacob called the name of the place where God spoke with him Bethel.
16 ౧౬ వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.
Then they set out from Bethel. There was still some distance to come to Ephrath, and Rachel went into labor, and her labor was difficult.
17 ౧౭ ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో “భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు” అంది.
When she was in the difficult labor, the midwife said to her, "Do not be afraid, for now you have another son."
18 ౧౮ రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
It happened, as her life was departing (for she died), that she named him Ben-Oni, but his father named him Benjamin.
19 ౧౯ ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.
So Rachel died and was buried on the way to Ephrath (that is, Bethlehem).
20 ౨౦ యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.
Jacob set up a standing-stone on her grave. It is the standing-stone of Rachel's grave to this day.
21 ౨౧ ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.
And Israel traveled and pitched his tent beyond Migdal Eder.
22 ౨౨ ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.
It happened, while Israel lived in that land, that Reuben went and slept with Bilhah, his father's secondary wife, and Israel heard about it. Now the sons of Jacob were twelve.
23 ౨౩ యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.
The sons of Leah: Reuben, Jacob's firstborn, and Simeon, and Levi, and Judah, and Issachar, and Zebulun.
24 ౨౪ యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.
The sons of Rachel: Joseph and Benjamin.
25 ౨౫ రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.
And the sons of Bilhah, Rachel's servant: Dan and Naphtali.
26 ౨౬ లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.
And the sons of Zilpah, Leah's servant: Gad and Asher. These are the sons of Jacob who were born to him in Paddan Aram.
27 ౨౭ అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను.
So Jacob came to Isaac his father at Mamre in Kiriath Arba (which is Hebron), where Abraham and Isaac had sojourned.
28 ౨౮ ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.
Now the days of Isaac were one hundred eighty years.
29 ౨౯ ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.
And Isaac took his last breath and died, and was gathered to his people, old and full of days. And his sons Esau and Jacob buried him.