< ఆదికాండము 35 >

1 దేవుడు యాకోబుతో “నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు” అని చెప్పాడు.
神对雅各说:“起来!上伯特利去,住在那里;要在那里筑一座坛给 神,就是你逃避你哥哥以扫的时候向你显现的那位。”
2 యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో “మీ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకుని, మీ వస్త్రాలు మార్చుకోండి.
雅各就对他家中的人并一切与他同在的人说:“你们要除掉你们中间的外邦神,也要自洁,更换衣裳。
3 మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను” అని చెప్పాడు.
我们要起来,上伯特利去,在那里我要筑一座坛给 神,就是在我遭难的日子应允我的祷告、在我行的路上保佑我的那位。”
4 వారు తమ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.
他们就把外邦人的神像和他们耳朵上的环子交给雅各;雅各都藏在示剑那里的橡树底下。
5 వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు.
他们便起行前往。 神使那周围城邑的人都甚惊惧,就不追赶雅各的众子了。
6 యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.
于是雅各和一切与他同在的人到了迦南地的路斯,就是伯特利。
7 అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఏల్‌ బేతేలు అని పేరు పెట్టారు.
他在那里筑了一座坛,就给那地方起名叫伊勒·伯特利;因为他逃避他哥哥的时候, 神在那里向他显现。
8 రిబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి, దానికి అల్లోన్ బాకూత్‌ అనే పేరు పెట్టారు.
利百加的奶母底波拉死了,就葬在伯特利下边橡树底下;那棵树名叫亚伦·巴古。
9 యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.
雅各从巴旦·亚兰回来, 神又向他显现,赐福与他,
10 ౧౦ అప్పుడు దేవుడు అతనితో “నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు” అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
且对他说:“你的名原是雅各,从今以后不要再叫雅各,要叫以色列。”这样,他就改名叫以色列。
11 ౧౧ దేవుడు “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.
神又对他说:“我是全能的 神;你要生养众多,将来有一族和多国的民从你而生,又有君王从你而出。
12 ౧౨ నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను” అని అతనితో చెప్పాడు.
我所赐给亚伯拉罕和以撒的地,我要赐给你与你的后裔。”
13 ౧౩ దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు.
神就从那与雅各说话的地方升上去了。
14 ౧౪ దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దాని మీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.
雅各便在那里立了一根石柱,在柱子上奠酒,浇油。
15 ౧౫ తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు.
雅各就给那地方起名叫伯特利。
16 ౧౬ వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.
他们从伯特利起行,离以法他还有一段路程,拉结临产甚是艰难。
17 ౧౭ ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో “భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు” అంది.
正在艰难的时候,收生婆对她说:“不要怕,你又要得一个儿子了。”
18 ౧౮ రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
她将近于死,灵魂要走的时候,就给她儿子起名叫便·俄尼;他父亲却给他起名叫便雅悯。
19 ౧౯ ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.
拉结死了,葬在以法他的路旁;以法他就是伯利恒。
20 ౨౦ యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.
雅各在她的坟上立了一统碑,就是拉结的墓碑,到今日还在。
21 ౨౧ ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్‌ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.
以色列起行前往,在以得台那边支搭帐棚。
22 ౨౨ ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.
以色列住在那地的时候,吕便去与他父亲的妾辟拉同寝,以色列也听见了。 雅各共有十二个儿子。
23 ౨౩ యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.
利亚所生的是雅各的长子吕便,还有西缅、利未、犹大、以萨迦、西布伦。
24 ౨౪ యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.
拉结所生的是约瑟、便雅悯。
25 ౨౫ రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.
拉结的使女辟拉所生的是但、拿弗他利。
26 ౨౬ లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.
利亚的使女悉帕所生的是迦得、亚设。这是雅各在巴旦·亚兰所生的儿子。
27 ౨౭ అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను.
雅各来到他父亲以撒那里,到了基列·亚巴的幔利,乃是亚伯拉罕和以撒寄居的地方;基列·亚巴就是希伯 。
28 ౨౮ ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.
以撒共活了一百八十岁。
29 ౨౯ ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.
以撒年纪老迈,日子满足,气绝而死,归到他列祖那里。他两个儿子以扫、雅各把他埋葬了。

< ఆదికాండము 35 >