< ఆదికాండము 33 >

1 యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావు, అతనితో నాలుగువందల మంది మనుషులు వస్తూ ఉన్నారు.
І звів Яків очі свої, та й побачив, аж ось іде Ісав, а з ним чотири сотні людей. І він поділив своїх дітей на Лію, і на Рахіль, і на обо́х невільниць своїх.
2 అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలులకు, ఇద్దరు దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలనూ వారి పిల్లలనూ, వారి వెనక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనక రాహేలునూ యోసేపునూ ఉంచాడు.
І поставив він тих невільниць і дітей їх напереді, а Лію й дітей її перед останніми, а Рахіль та Йо́сипа останніми.
3 తాను వారి ముందు వెళ్తూ తన సోదరుణ్ణి సమీపించే వరకూ ఏడు సార్లు నేలపై సాగిలపడ్డాడు.
А сам пішов перед ними, і вклонився до землі сім раз, аж поки підійшов до брата свого.
4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
І побіг Ісав назустріч йому, і обняв його, і впав на шию йому, і цілував його. І вони заплакали.
5 ఏశావు ఆ స్త్రీలనూ పిల్లలనూ చూసి “వీరు నీకేమౌతారు?” అని అడిగాడు. అతడు “వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే” అని చెప్పాడు.
І звів свої очі Ісав, і побачив жінок та дітей. І сказав: „Хто то такі?“А той відказав: „Діти, якими обдарував Бог твого раба“.
6 అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరికి వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు.
І підійшли сюди невільниці, і їхні діти, та й вклонилися.
7 లేయా ఆమె పిల్లలూ దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపూ రాహేలు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.
І підійшла також Лія та діти її, і вклонилися, а потім підійшов Йо́сип і Рахі́ль, та й вклонилися.
8 ఏశావు “నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు?” అని అడిగాడు. అతడు “నా ప్రభువు దయ నా మీద కలగడానికే” అని చెప్పాడు.
І сказав Ісав: „А що це за ці́лий табір той, що я спіткав?“А той відказав: „Щоб знайти милість в очах мого пана“.
9 అప్పుడు ఏశావు “తమ్ముడూ, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో” అని చెప్పాడు.
А Ісав сказав: „Я маю багато, мій брате, — твоє нехай бу́де тобі“.
10 ౧౦ అప్పుడు యాకోబు “అలా కాదు, నీ అనుగ్రహం నా మీద ఉంటే దయచేసి ఈ కానుకను అంగీకరించు. దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను. నీ దయ నా మీద ఉంది కదా.
А Яків сказав: „Ні ж бо! Коли я знайшов милість в очах твоїх, то візьми дарунка мого з моєї руки. Бож я побачив обличчя твоє, ніби побачив Боже лице, і ти собі уподобав мене.
11 ౧౧ నేను నీ కోసం తెచ్చిన కానుకను దయచేసి అంగీకరించు. దేవుడు నన్ను కనికరించాడు. పైగా, నాకు కావలసినంత ఉంది” అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు కాబట్టి అతడు దాన్ని పుచ్చుకుని
Візьми ж благослове́ння моє, що припроваджене тобі, бо Бог був милостивий до мене, та й маю я все“. І благав він його, — і той узяв.
12 ౧౨ “మనం వెళదాం, నేను నీకు ముందుగా సాగిపోతాను” అని చెప్పగా
І промовив Ісав: „Рушаймо й ходім, а я піду́ обік те́бе“.
13 ౧౩ అతడు “నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.
А той відказав: „Пан мій знає, що діти молоді, а дрібна та велика худоба в мене дійні. Коли погнати їх один день, то вигине вся отара.
14 ౧౪ నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాలి. నేను నా ప్రభువు దగ్గరికి శేయీరుకు వచ్చేవరకూ, ముందున్న మందలూ, ఈ పిల్లలూ నడవగలిగిన కొలదీ వాటిని మెల్లగా నడిపించుకుంటూ వస్తాను” అని అతనితో చెప్పాడు.
Нехай же піде пан мій перед очима свого раба, а я піду́ поволі за ногою скотини, що передо мною, і за ногою дітей, аж поки не прийду́ до пана свого до Сеїру“.
15 ౧౫ అప్పుడు ఏశావు “నీ కిష్టమైతే నా దగ్గర ఉన్న ఈ మనుషుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెడతాను” అనగా అతడు “అదెందుకు? నా ప్రభువు కటాక్షం నా మీద ఉంది. అది చాలు” అన్నాడు.
І промовив Ісав: „Позоставлю ж з тобою трохи з людей, що зо мною“. А той відказав: „Пощо знаходжу я таку милість в очах свого пана?“
16 ౧౬ ఆ రోజునే ఏశావు తన దారిలో శేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు.
І вернувся того дня Ісав на дорогу свою до Сеїру.
17 ౧౭ అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు ఆ చోటికి “సుక్కోతు” అనే పేరు వచ్చింది.
А Яків подався до Суккоту, і збудував собі хату, а для худоби своєї поробив курені́, тому назвав ім'я́ тому місцю: Сукко́т.
18 ౧౮ ఆ విధంగా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారాలు వేశాడు.
І Яків, коли він прийшов із Падану арамейського, прибув спокійно до міста Сихем у Кра́ї ханаанському, і розта́борився перед містом.
19 ౧౯ అతడు గుడారాలు వేసిన పొలంలోని భాగాన్ని షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర నూరు వెండి నాణాలకు కొన్నాడు.
І купив він кусок поля, де розклав намета свого, з руки синів Гамора, батька Сихема, за сто срібнякі́в.
20 ౨౦ అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి “ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు” అని పేరు పెట్టాడు.
І поставив там жертівника, і назвав його: Ел-Елогей-Ізраїль.

< ఆదికాండము 33 >