< ఆదికాండము 31 >
1 ౧ లాబాను కొడుకులు “యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకుని, దాని వలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు.
І почув був Яків слова Лаванових синів, що казали: „Яків забрав усе, що було в нашого батька. І з того, що було в батька нашого, зробив собі всю оцю честь“.
2 ౨ అంతే గాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులాగా ప్రసన్నంగా లేదు.
І побачив Яків Лаванове обличчя, а ото — він тепер інший до нього, як був учора, позавчора.
3 ౩ అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను నీకు తోడై ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.
І промовив Господь до Якова: „Вернися до кра́ю батьків своїх, і до місця твого наро́дження. А Я бу́ду з тобою“.
4 ౪ యాకోబు పొలంలో తన మంద దగ్గరికి రాహేలునీ లేయానీ పిలిపించి వారితో,
І послав Яків, і покликав Рахіль і Лію на поле до отари своєї,
5 ౫ “ఇంతకు ముందులాగా మీ నాన్న నేనంటే ఇష్టం చూపడం లేదని నాకు కనిపిస్తున్నది. అయితే నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.
та й промовив до них: „Я бачив обличчя вашого батька, що він тепер інший до мене, як був учора й позавчора. Та Бог батька мого був зо мною.
6 ౬ నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు.
А ви знаєте, що всією силою своєю я служив вашому ба́тькові.
7 ౭ మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు.
І ба́тько ваш сміявся з мене, і десять раз міняв заплату мені, але Бог не дав йому чинити зо мною зле.
8 ౮ అతడు, ‘పొడలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. ‘చారలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లలను ఈనాయి.
Коли він говорив був отак: „Крапчасте буде заплата твоя“, то й котяться всі овечки та кози крапчасті. А коли скаже так: „Пасасте буде заплата твоя“, то й котяться всі овечки та кози пасасті.
9 ౯ ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు.
І відня́в Бог худобу вашого батька, та й дав мені.
10 ౧౦ మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి.
І сталося в час, коли отара злучувалася, звів був я очі свої та й побачив у сні: аж ось козли, що спинались на овечок та на кіз, були пасасті, крапчасті й рябі.
11 ౧౧ ఆ కలలో దేవుని దూత ‘యాకోబూ’ అని నన్ను పిలిచినప్పుడు నేను ‘చిత్తం, ప్రభూ’ అన్నాను.
І сказав мені Ангол у сні: „Якове!“А я відказав: „Ось я!“
12 ౧౨ అప్పుడు ఆయన ‘నీ కళ్ళు పైకెత్తి చూడు. గొర్రెలతో జంటకట్టే పొట్టేళ్ళన్నీ చారలు, పొడలు, మచ్చలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే లాబాను నీకు చేస్తున్న దానంతటినీ నేను చూశాను.
Він промовив: „Зведи свої очі й побач: усі козли, що спинаються на овечок та на кіз, — пасасті, крапчасті й рябі, бо Я бачив усе, що Лаван виробляє тобі.
13 ౧౩ నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో, ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు’ అని నాతో చెప్పాడు” అన్నాడు.
Я Бог Бет-Елу, що ти намастив був там пам'ятника, і Мені склав там обі́тницю. Тепер уставай, вийди з цієї землі, і вертайся до землі твого наро́дження“.
14 ౧౪ అందుకు రాహేలు, లేయాలు “ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూడడం లేదా?
І відповіла Рахіль та Лія, та й сказали йому: „Чи ми маємо частку та спадщину в домі нашого батька?
15 ౧౫ అతడు మమ్మల్ని అమ్మివేసి, మాకు రావలసిన సొమ్మంతటినీ పూర్తిగా తినేశాడు.
Таж він нас полічив за чужинців, бо продав нас, і справді поже́р наше срібло.
16 ౧౬ దేవుడు మా నాన్న దగ్గరనుండి తీసేసిన ధనమంతా మాదీ మా పిల్లలదీ కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి” అని అతనికి జవాబు చెప్పారు.
Бож усе багатство, що Бог вирвав від нашого батька, — воно наше та наших синів. А тепер зроби все, що Бог наказав був тобі“.
17 ౧౭ యాకోబు తన కొడుకులనూ తన భార్యలనూ ఒంటెల మీద ఎక్కించి
І встав Яків, і посадив синів своїх і жінок своїх на верблюди.
18 ౧౮ తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి తన పశువులన్నిటినీ, పద్దనరాములో తాను సంపాదించిన సంపద అంతటినీ తీసుకు కనాను దేశానికి బయలుదేరాడు.
І він забрав усю худобу свою, і все майно своє, що набув, здобуту худобу свою, що набув у Падані арамейськім, щоб прийти до Ісака, батька свого, до землі ханаанської.
19 ౧౯ లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవుళ్ళను దొంగిలించింది.
А Лаван пішов стригти отару свою, а Рахіль покрала домових божків, яких батько мав.
20 ౨౦ యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియ పరచకపోవడం చేత అతణ్ణి మోసపుచ్చినట్టు అయ్యింది.
І Яків обманив Лавана арамейського, бо не сказав йому, що втікає.
21 ౨౧ అతడు తనకు కలిగినదంతా తీసుకు పారిపోయాడు. అతడు నది దాటి గిలాదు కొండ ప్రాంతాల వైపు వెళ్ళాడు.
І втік він, і все, що його. І встав, і перейшов річку, і прямував до Ґілеядської гори.
22 ౨౨ యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది.
А третього дня розказано Лаванові, що Яків утік.
23 ౨౩ అతడు తన బంధువులను వెంటబెట్టుకుని, ఏడు రోజుల ప్రయాణమంత దూరం యాకోబును తరుముకుని వెళ్లి, గిలాదు కొండ మీద అతణ్ణి కలుసుకున్నాడు.
І взяв він з собою братів своїх, і гнався за ним дорогою семи день, та й догнав його на горі Ґілеядській.
24 ౨౪ ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరికి వచ్చి “నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు. జాగ్రత్త సుమా” అని అతనితో చెప్పాడు.
І прийшов Бог до Лавана арамеянина в нічнім сні, та й до нього сказав: „Стережися, щоб ти не говорив з Яковом ані доброго, ані зло́го“.
25 ౨౫ చివరికి లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని ఆ కొండ మీద వేసుకుని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండమీద గుడారం వేసుకున్నాడు.
І догнав Лаван Якова. А Яків поставив намета свого на горі, і Лаван поставив з братами своїми на горі Ґілеядській.
26 ౨౬ అప్పుడు లాబాను యాకోబుతో “ఏంటి, ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్ళను తీసుకుపోవడం ఎందుకు?
І промовив Лаван до Якова: „Що́ ти зробив? Ти обманив мене, і забрав моїх дочок, немов бранок меча!
27 ౨౭ నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా, పాటలతో, కంజరిలతో, సితారాలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే.
Чого втік ти таємно, і обікрав мене, і не сказав мені? А я був би відіслав тебе з радістю, із співами, з бубном, і з гуслами.
28 ౨౮ నేను నా మనవళ్ళనూ, కూతుళ్ళనూ ముద్దు పెట్టుకోనియ్యకుండా బుద్ధిహీనంగా ఇలా చేశావు.
І ти не дозволив мені навіть поцілувати онуків моїх і дочок моїх. Тож ти нерозумно вчинив!
29 ౨౯ నేను మీకు హాని చేయగలను. అయితే రాత్రి మీ తండ్రి దేవుడు, ‘జాగ్రత్త సుమా! నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు’ అని నాతో చెప్పాడు.
Я маю в руці своїй силу, щоб учинити з вами зле. Але́ Бог вашого батька вчора вночі сказав був до мене, говорячи: „Стережися, щоб ти не говорив з Яковом ані доброго, ані зло́го“.
30 ౩౦ నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు, నా దేవుళ్ళను దొంగిలించావేంటి?” అన్నాడు.
А тепер справді пі́деш, бо ти сильно затужив за домом батька свого. Але на́що ти покрав моїх богів?“
31 ౩౧ అందుకు యాకోబు “నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను.
А Яков відповів і сказав до Лавана: „Тому, що боявся, бо я ду́мав: Аби но він не забрав від мене своїх дочок!
32 ౩౨ ఎవరి దగ్గర నీ దేవుళ్ళు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెదికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకో” అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియలేదు.
При кому ж ти зна́йдеш своїх богів, не буде він жити. Перед нашими братами пізнай собі, що́ твого́ в мене, і візьми собі“. А Яків не знав, що Рахіль їх покрала.
33 ౩౩ లాబాను యాకోబు గుడారంలోకీ లేయా గుడారంలోకీ ఇద్దరు దాసీల గుడారాల్లోకీ వెళ్ళాడు గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు.
І ввійшов Лаван до намету Якового, і до намету Ліїного, і до намету обох невільниць, та нічого не знайшов. І вийшов він із намету Ліїного і ввійшов до намету Рахілиного.
34 ౩౪ రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు.
А Рахіль узяла божки, і вложила їх до сідла верблюда, та й сіла на них. І обмацав Лаван усього намета, — і нічого не знайшов.
35 ౩౫ ఆమె తన తండ్రితో “తమ ఎదుట నేను లేఛి నిలబడనందుకు తమరు కోపపడవద్దు. నేను నా నెలసరి కాలంలో ఉన్నాను” అని చెప్పింది. అతడెంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు.
А вона сказала до батька свого: „Нехай не палає гнів в очах батька мого, бо я не можу встати перед обличчям твоїм, бо в мене тепер звичайне жіноче“. І перешукав він, — та божків не знайшов.
36 ౩౬ యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ “నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపమేంటి?
І запалав Яків гнівом, і сварився з Лаваном. І відповів Яків, і сказав до Лавана: „Яка провина моя, який мій гріх, що ти гнався за мною,
37 ౩౭ నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నావారి ముందూ, నీవారి ముందూ దాన్ని తెచ్చి పెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు.
що ти обмацав усі мої речі? Що́ ти знайшов зо всіх речей свого дому, положи тут перед моїми братами і братами своїми, — і нехай вони розсудять поміж нами двома.
38 ౩౮ ఈ ఇరవై సంవత్సరాలూ నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేళ్ళను దేనినీ నేను తినలేదు.
Я вже двадцять літ із тобою. Вівці твої та кози твої не мертвили свого плоду, а баранів отари твоєї я не їв.
39 ౩౯ క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా, రాత్రైనా, ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు.
Розшарпаного диким звірем я не прино́сив до тебе, — я сам ніс ту шкоду. Від мене домагався ти того, що́ було вкрадене вдень, і що́ було вкрадене вночі.
40 ౪౦ నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది.
Бувало, що вдень з'їдала мене спекота, а вночі па́морозь, а мій сон мандрував від моїх очей.
41 ౪౧ నీ ఇద్దరు కూతుళ్ళకోసం పద్నాలుగు సంవత్సరాలూ నీ మంద కోసం ఆరు సంవత్సరాలూ మొత్తం ఇరవై సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం పదిసార్లు మార్చావు.
Таке мені двадцять літ у твоїм домі... Служив я тобі чотирнадцять літ за двох дочок твоїх, і шість літ за отару твою, а ти десять раз зміняв мені свою заплату!
42 ౪౨ నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసనీ నా చేతుల కష్టాన్నీ చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు” అని అన్నాడు.
Коли б не був при мені Бог батька мого, Бог Авраамів, і не Той, Кого боїться Ісак, то тепер ти відіслав би мене впорожні́!... Біду мою й труд рук моїх Бог бачив, — і виказав це вчора вночі“.
43 ౪౩ అందుకు లాబాను “ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడేదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనా, వీరికి పుట్టిన కొడుకులనైనా నేనేం చేయగలను?
І відповів Лаван і сказав до Якова: „До́чки — дочки мої, а діти — мої діти, а отара — моя отара, і все, що́ ти бачиш — то моє. А дочкам моїм, що́ зроблю їм сьогодні, або їхнім дітям, що вони породили їх?
44 ౪౪ కాబట్టి నువ్వూ నేనూ ఒక నిబంధన చేసుకుందాం రా. అది నాకూ, నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది” అని యాకోబుతో అన్నాడు.
А тепер ходи, — я й ти вчинімо умову, і оце буде свідком поміж мною й поміж тобою“.
45 ౪౫ అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు.
І взяв Яків каменя, і поставив його за пам'ятника.
46 ౪౬ “రాళ్ళు పోగుచేయండి” అని తన బంధువులతో చెప్పగానే వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేశారు. వారు ఆ కుప్ప దగ్గర భోజనం చేశారు.
І сказав Яків браттям своїм: „Назбирайте каміння“. І назбирали каміння вони, та й зробили могилу, і їли там на тій могилі.
47 ౪౭ లాబాను దానికి “యగర్ శహదూతా” అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి “గలేదు” అని పేరు పెట్టాడు.
І назвав її Лаван: Еґар-Сагадута, а Яків її назвав: Ґал-Ед.
48 ౪౮ లాబాను “ఈ రోజు ఈ కుప్ప నాకూ నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది” అని చెప్పాడు. అందుకే దానికి గలేదు అనే పేరు వచ్చింది.
І промовив Лаван: „Ця могила — свідок між мною й між тобою сьогодні", тому то й названо ймення її: Ґал-Ед
49 ౪౯ ఇంక “మనం ఒకరి కొకరం దూరంగా ఉన్నప్పటికీ యెహోవా నాకూ నీకూ మధ్య జరిగేది కనిపెడతాడు” అని చెప్పాడు కాబట్టి దానికి “మిస్పా” అని కూడా పేరు పెట్టారు.
і Міцпа, бо сказав: „Нехай дивиться Господь між мною й між тобою, коли ми розійдемося один від о́дного.
50 ౫౦ తరువాత లాబాను “నువ్వు నా కుమార్తెలను బాధ పెట్టినా, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్ళి చేసుకున్నా, చూడు, మన దగ్గర ఎవరూ లేకపోయినా, నాకూ నీకూ మధ్య దేవుడే సాక్షి” అని చెప్పాడు.
Коли ти будеш кри́вдити дочо́к моїх, і коли візьмеш за жінок понад дочок моїх, то не люди́на з нами, а дивися — Бог свідок між мною й між тобою!“
51 ౫౧ అదీ గాక లాబాను “నాకూ నీకూ మధ్య నేను నిలబెట్టిన ఈ స్తంభాన్నీ, ఈ రాళ్ళ కుప్పనీ చూడు.
А Яків сказав до Лавана: „Ось ця могила, й ось той пам'ятник, якого поставив я між собою й між тобою.
52 ౫౨ నీకు హాని చేయడానికి నేను ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నీ దగ్గరికి రాకుండా, నువ్వు నాకు హాని చేయడానికి ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నా దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ కుప్ప, ఈ స్తంభమూ సాక్షి.
Свідок ця могила, і свідок цей пам'ятник, що я не перейду́ цієї могили до тебе, і ти не пере́йдеш до мене цієї могили та цього пам'ятника на зле.
53 ౫౩ అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు, మన మధ్య న్యాయం తీరుస్తాడు” అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణం చేశాడు.
Розсудить між нами Бог Авраамів і Бог Нахорів, Бог їхнього батька“. І Яків присягнув Тим, Кого боїться його батько Ісак.
54 ౫౪ యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలిచినప్పుడు వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి గడిపారు.
І приніс Яків жертву на горі, і покликав братів своїх їсти хліб. І вони їли хліб і ночували на горі.
55 ౫౫ తెల్లవారినప్పుడు లాబాను తన మనుమలనూ తన కుమార్తెలనూ ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు.
І встав Лаван рано вранці, і поцілував онуків своїх, і дочок своїх, — і поблагословив їх. І пішов, та й вернувся Лаван до місця свого.