< ఆదికాండము 23 >

1 శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.
Sara levede 127 Aar, saa mange var Saras Leveaar.
2 కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియత్ ఆర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రాహాము శారా కోసం దుఃఖించడానికి, విలపించడానికీ వచ్చాడు.
Sara døde i Kirjat-Arba, det er Hebron, i Kana'ans Land. Saa gik Abraham hen og holdt Klage over Sara og begræd hende.
3 తరువాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గరనుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు,
Og da han havde rejst sig fra sin døde, talte han saaledes til Hetiterne:
4 “నేను మీ మధ్య ఒక పరదేశిగానూ పరాయి వాడిగానూ ఉన్నాను. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది. చనిపోయిన నా వాళ్ళను పాతిపెట్టడానికి నాకు ఒక స్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి” అన్నాడు.
»Jeg er Gæst og fremmed hos eder; men giv mig et Gravsted hos eder, saa jeg kan jorde min døde og bringe hende bort fra mit Ansigt!«
5 దానికి హేతు వారసులు ఇలా అన్నారు “అయ్యా, మేము చెప్పేది వినండి. నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు.
Da svarede Hetiterne Abraham:
6 మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్ఠమైన దాంట్లో చనిపోయిన నీ వాళ్ళను పాతి పెట్టు. చనిపోయిన నీ భార్యను పాతి పెట్టడానికి మాలో ఎవరూ తమ భూమిని నీకివ్వడానికి నిరాకరించరు.”
»Hør os, Herre! En Guds Fyrste er du jo iblandt os; jord du din døde i en af vore bedste Grave! Ikke en af os vil nægte dig sin Grav og hindre dig i at jorde din døde.«
7 అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు వారసుల ముందు సాగిల పడ్డాడు.
Men Abraham stod op og bøjede sig for Hetiterne, Folkene der paa Stedet,
8 “చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి.
og sagde til dem: »Hvis I samtykker i, at jeg jorder min døde og bringer hende bort fra mit Ansigt, saa føj mig i at lægge et godt Ord ind for mig hos Efron, Zohars Søn,
9 అతని పొలం చివరన ఉన్న మక్పేలా గుహను నాకు ఇమ్మని అతనితో మనవి చేయండి. అది నా సొంత స్మశానంగా ఉండటానికి దాన్ని పూర్తి వెలకు నాకు అమ్మమని చెప్పండి” అన్నాడు.
saa han giver mig sin Klippehule i Makpela ved Udkanten af sin Mark; for fuld Betaling skal han i eders Nærværelse give mig den til Gravsted!«
10 ౧౦ ఆ ఎఫ్రోను హేతు సంతతివారి మధ్యలోనే కూర్చుని ఉన్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను ఆ పట్టణ ద్వారం లో ప్రవేశించే వారందరి ముందు హేతు సంతతివారు వింటుండగా అబ్రాహాముకు ఇలా చెప్పాడు.
Men Efron sad blandt Hetiterne; og Hetiten Efron svarede Abraham i Hetiternes Paahør, saa mange som gik ind gennem hans Bys Port:
11 ౧౧ “అయ్యా, అలా కాదు. నేను చెప్పేది వినండి. ఆ పొలాన్నీ దానిలో ఉన్న గుహను కూడా మీకిస్తున్నాను. నా ప్రజలందరి సమక్షంలోనే దాన్ని మీకిస్తున్నాను. చనిపోయిన మీ భార్యను పాతిపెట్టడానికి మీకిస్తున్నాను.”
»Gid min Herre vilde høre mig! Marken giver jeg dig, og Hulen derpaa giver jeg dig; i mit Folks Nærværelse giver jeg dig den; jord du kun din døde!«
12 ౧౨ అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ముందు సాగిల పడ్డాడు.
Da bøjede Abraham sig for Folkene der paa Stedet
13 ౧౩ “నీ కిష్టమైతే నా మనవి విను. ఆ పొలానికి వెల చెల్లిస్తాను. నా దగ్గర వెల పుచ్చుకో. అప్పుడు నా భార్యను అక్కడ పాతిపెడతాను” అని అందరికీ వినపడేలా చెప్పాడు.
og sagde til Efron i deres Paahør: »Om du blot — gid du dog vilde høre mig! Jeg giver dig, hvad Marken er værd; modtag det dog af mig, saa jeg kan jorde min døde der.«
14 ౧౪ దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు.
Da sagde Efron til Abraham:
15 ౧౫ “అయ్యా, విను. ఆ భూమి వెలగా నాలుగు వందల షెకెల్ల వెండి చెల్లిస్తే చాలు. ఆ మాత్రం మొత్తం నీకూ నాకూ ఎంత? చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో” అన్నాడు.
»Gid min Herre vilde høre mig! Et Stykke Land til 400 Sekel Sølv, hvad har det at sige mellem mig og dig? Jord du kun din døde!«
16 ౧౬ అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.
Og Abraham forstod Efron og tilvejede ham den Sum, han havde nævnet i Hetiternes Paahør, 400 Sekel Sølv i gangbar Mønt.
17 ౧౭ ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్పేలా లోని ఎఫ్రోను పొలం, దాంట్లో ఉన్న గుహ, ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోనూ ఉన్న చెట్లతో సహా
Saaledes gik Efrons Mark i Makpela over for Mamre i hele sin Udstrækning tillige med Klippehulen og alle Træerne paa Marken
18 ౧౮ ఆ ఊరి ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతు వారసుల సమక్షంలో అబ్రాహాముకు స్వాధీనం అయింది.
over i Abrahams Eje i Hetiternes Nærværelse, saa mange som gik ind gennem hans Bys Port.
19 ౧౯ ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారాను పాతిపెట్టాడు.
Derefter jordede Abraham sin Hustru Sara i Klippehulen paa Makpelas Mark over for Mamre, det er Hebron, i Kana'ans Land.
20 ౨౦ ఆ విధంగా ఆ పొలాన్నీ, దాంట్లో ఉన్న గుహనీ శ్మశానం కోసం అబ్రాహాముకు హేతు సంతతి వారు ఇవ్వడం వల్ల అవి అతని సొంతం అయ్యాయి.
Og Marken med Klippehulen derpaa gik fra Hetiterne over til Abraham som Gravsted.

< ఆదికాండము 23 >